హిమాచల్ ప్రదేశ్ లోని నగ్గర్ లో కల త్రిపుర సుందరి దేవాలయం ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. దీని శిల్ప తీరు పాగోడ స్టైల్ లో వుంది. అతి పెద్ద మూడు కొయ్య మిద్దెల నిర్మాణం. పైభాగంలో ఒక గొడుగు వలే వుంటుంది. దీనిలో వివిధ హిందూ దేవుడు, దేవతల అంటే, గణేశ, విష్ణు, బ్రహ్మ, ల విగ్రహాలు చూడవచ్చు. ఇవే కాక త్రిపుర రక్షా విగ్రహం కూడా వుంటుంది.
నగ్గర్ కు సమీపం అవటంతో తేలికగా చేరవచ్చు. ఈ టెంపుల్ ను రాజా యశోద పాల కొన్ని వందల సంవత్సరాల కిందట నిర్మించారు. కాని జానపదులు మాత్రం ఒక దేవత తానే సాలీడు గా మారి ఈ టెంపుల్ ను అల్లిందని చెపుతారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఇక్కడ శార్హి జాతర జరుగుతుంది కనుక అపుడు చూడదగిన సమయం.



Click it and Unblock the Notifications