రేణుక వైల్డ్ లైఫ్ పార్క్ దదాహు అనే ఒక చిన్న గ్రామం వద్ద ఒక పర్యాటక ప్రదేశం. ఇది సిర్మౌర్ జిల్లాలో నహాన్ కు 15 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పార్క్ సుమారు 402.80 హెక్టార్లు విస్తరించి దానిలో రేణుక లేక్, వైల్డ్ లైఫ్ పార్క్ కలిగి అనేక స్థానిక వన్య జంతువులకు వృక్షాలకు నిలయంగా వుంది. సింహం,తోక కోతి,ఆసియాటిక్ లయన్,రెడ్ జంగల్ ఫౌల్, ఇండియన్ యాన్తిలోప్, సాంబార్, చితల్ మరియు హిమాలయన్ బ్లాచ్క్ బేర్ వంటి జంతువులను చూడవచ్చు.
రంగు రంగుల అనేక పక్షులు, బ్లాకు పెసంట్, నెమలి, ఇంకా వివిధ నీటి పక్షులు ఇక్కడ చూడవచ్చు. వినోద కార్యక్రమాలు అయిన లయన్ సఫారి లు, బోటింగ్, ట్రెక్కింగ్ కూడా పార్క్ లో కలవు. వైల్డ్ లైఫ్ పార్క్ లో ఒక మినీ జూ కలదు. కాఫీ హోటళ్ళు , టూరిస్ట్ బంగళాలు కూడా కలవు. రేణుకా వైల్డ్ లైఫ్ పార్క్ సమీపం లో ఒక టెంపుల్ కూడా కలదు. ఇది మరి ఒక పర్యాటక ఆకర్షణ.