ఫ్లాట్స్ లో ఎన్నో క్రీడా స్థలాలు కలవు. ఇక్కడ పోలో, క్రికెట్ ,హాకీ మెచ్ లు జరుగుతాయి. 1880 సంవత్సరంలో ఒక సారి అతి పెద్ద కొండ భాగం విరిగి పడి సుమారు 151 మంది మరణించినట్లు చెపుతారు.ఫలితంగా అప్పటి నుండి సరస్సు పక్కగా కల చదునైన భూమిని కేటాయించి క్రీడలకు ఉపయోగిస్తున్నారు. దీనిని ఫ్లాట్స్ అంటారు. ల్యాండ్ స్లైడ్ దుర్ఘటన తర్వాత దీనినిఒక విశ్రాంత ప్రదేశంగా రూపొందించారు. ఇక్కడ పండగలపుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. చాట్ బజార్ లో సందర్సకులు వివిధ చాట్ లను రుచికరంగా తినవచ్చు. భోటియా మార్కెట్ లో చవక ధరలలో ఇక్కడ లభించే అల్లిన వూల్లెన్ దుస్తులు కొనుగోలు చేయవచ్చు. ఒక మసీదు ,గురుద్వారా, మరియు నైనా దేవి టెంపుల్ కూడా ఈప్రాంతంలో కలవు. కేపిటల్ సినిమా, రింక్ థియేటర్ (ఇది రోలరు స్కేటింగ్ కు ప్రసిద్ధి) కలవు, న్యూ క్లబ్, బోటు హౌస్ క్లబ్,మేసోనిక్ హాల్ లు ఈ ప్రదేశం లోనే ఒక పక్కగా కలవు.



Click it and Unblock the Notifications