నాశిక్ లో సూలా వైన్ యార్డులు కలవు. నాగపూర్ ఆరెంజెస్ లేదా కమలా పండ్లకు ఎంత ప్రసిద్ధి చెందిందో అదే రకంగా నాసిక్ ద్రాక్షతోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంత వాతావరణం వాటి పెంపకానికి అనుకూలం. ఇక్కడికల ప్రసిద్ధి చెందిన వైన్ యార్డులలో సూలా వైన్ యార్డ్ ఒకటి. వీటికి ఇండియాలోనే ఉత్తమ వైన్ ఉత్పత్తి ప్రదేశంగా పేరు కలదు. వీరి గరిష్ట ఉత్పత్తి సామర్ధ్యం 5 మిలియన్ లీటర్లు. వైన్ యార్డు లో ఒక వైన్ రుచి చూసే గది ఉంటుంది. అక్కడకు వచ్చిన పర్యాటకులు రూ.100 ప్రవేశ రుసుము చెల్లించి అక్కడి వైన్ తయారీ రుచులను కూడా ఆస్వాదించవచ్చు. వీరు అక్కడి వైన్ తయారీ ప్రక్రియను కూడా పర్యాటకులకు వివరిస్తారు. ఈ ప్రక్రియ అంతా వివరవంతంగా చూపేందుకు షుమారు 45 నిమిషాలపాటు పడుతుంది.



Click it and Unblock the Notifications