Search
  • Follow NativePlanet
Share
» »ట్రైన్‌ టికెట్లు AI చాట్‌బోట్ ద్వారా ఇక‌ మీ ఫోన్‌లోనే బుక్ చేసుకోండి!

ట్రైన్‌ టికెట్లు AI చాట్‌బోట్ ద్వారా ఇక‌ మీ ఫోన్‌లోనే బుక్ చేసుకోండి!

రైలు ప్ర‌యాణం మ‌న భార‌తీయుల్లో ఓ రోజువారీ ప్ర‌క్రియగా మారిపోయింది. పేద, ధ‌నిక వ‌ర్గాల‌కు ఇది ప్ర‌ధాన ర‌వాణా వ్య‌వ‌స్థ‌గా ఉంది. అలాంటి రైలు ప్ర‌యాణానికి గ‌తంలో రైల్వే స్టేష‌న్‌కు వెళ్లి టికెట్‌లు బుక్ చేసుకునేవారు. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం భార‌తీయ రైల్వే ఇప్ప‌టికే టికెట్ బుకింగ్ విష‌యంలోనూ ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింది. ఆన్‌లైన్ సేవ‌ల ద్వారా టికెట్ బుక్ చేసుకునేలా త‌మ సేవ‌ల‌ను సుల‌భ‌తరం చేసింది. అయితే, యాప్‌ ద్వారా కూడా టికెట్ బుకింగ్‌ చేసుకొనే వారికి అనేక సమస్యలు ఎద‌రువుతున్నాయి. బుకింగ్‌ సమయంలో ప‌లు సాంకేతిక సమస్యలు సహా అనే ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో మ‌రోసారి రైలు ప్ర‌యాణీకుల మ‌న‌సును సొంతం చేసుకుంది రైల్వే శాఖ‌.

irctc ask disha

మెషిన్‌ లెర్నింగ్ ఆధారంగా..

ప్ర‌యాణీకులు రైలు టికెట్ బుకింగ్ స‌మ‌యంలో ఎదుర్కుంటోన్న స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు భార‌తీయ రైల్వే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ( Artificial intelligence ), మెషిన్‌ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే AskDisha 2.0 చాట్‌బోట్‌ను స‌రికొత్త‌గా తీసుకువ‌చ్చింది. CoRover AI పైన ఇది పనిచేస్తుంది. భారతీయ రైల్వే AI చాట్‌బోట్‌ AskDisha 2.0 ద్వారా అనేక రకాల సేవలను ప‌రిచ‌యం చేస్తోంది. ఇది టికెట్లు బుకింగ్‌ చేయడం (Indian Railway Ticket Booking)తోపాటు రిఫండ్‌ ప్రక్రియ గురించి తెలుసుకోవడం సహా వివిధ సేవలకు సంబంధించిన సమాచారాన్ని అంద‌జేస్తోంది. ఈ చాట్‌బోట్‌ హిందీ, ఇంగ్లీష్‌, హింగ్లీష్‌ (Hinglish) భాషలను సపోర్టు చేస్తుంది. అలాగే, ఈ AI చాట్‌బోట్‌ IRCTC మొబైల్ యాప్‌తోపాటు వెబ్‌సైట్‌లోనూ అందుబాటులోకి వ‌చ్చింది.

వాయిస్‌ కమాండ్‌ల‌ ద్వారా కూడా..

మ‌న‌ భారతీయ రైల్వేకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బోట్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకోవడంతోపాటు PNR స్టేటస్ చెక్ చేసుకోవ‌చ్చుకూడా. అలాగే, టికెట్ ర‌ద్దు చేసుకోవచ్చు. దీంతోపాటు రిఫండ్ స్టేట‌స్‌, బోర్డింగ్‌ స్టేషన్‌ మార్పులు చేయడం సహా బుకింగ్‌ హిస్టరీ, టికెట్‌ల డౌన్‌లోడ్ ఇలా చాలా సేవ‌ల‌ను పొందేందుకు అవ‌కాశం ఉంది. AskDisha 2.0 లో చిన్న చిన్న కమాండ్‌ల‌ను ఉపయోగించిన ఇందులో ట్రైన్‌ టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు.

askdisha2-0chatbot

చాట్‌బోట్ లోగోను గుర్తించాలి..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ మరియు మొబైల్ యాప్‌ ద్వారా AskDisha 2.0 చాట్‌బోట్‌ను యాక్సెస్ చేసుకునే అవ‌కాశం ఉంది. యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో ఈ చాట్‌బోట్‌ లోగోను గుర్తించాలి. త‌ర్వాత‌ చాట్‌ బోట్‌ ఓపెన్‌ చేసి సంబంధించిన వివరాల కమాండ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే, దీంతోపాటు మైక్రోఫోన్‌ ఆప్షన్‌ కూడా వినియోగించుకోవచ్చు. లేదా సింపుల్‌ వాయిస్‌ కమాండ్ల ద్వారా కూడా వినియోగించుకోవచ్చు. AskDisha 2.0 మొబైల్ ఫోన్‌లో వినియోగించుకొనేందుకు ప్లేస్టోర్‌ నుంచి ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్ యాప్‌ (IRCTC Rail Connect App)ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలా డౌన్‌లోడ్ చేసుకున్న త‌ర్వాత మ‌న‌కు కావాల్సిన సమాచారం కోసం కమాండ్లు, వాయిస్‌ కమాండ్ల‌ను అనుస‌రిస‌తే స‌రిపోతుంది. ప్రస్తుతం ఈ చాట్‌బోట్‌ అందరికీ అందుబాటులో ఉంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+