Search
  • Follow NativePlanet
Share
» »ఏపీ ప్ర‌యాణికులకు గుడ్‌న్యూస్‌.. ప‌ట్టాలెక్క‌నున్న విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు వందేభార‌త్ రైలు!

ఏపీ ప్ర‌యాణికులకు గుడ్‌న్యూస్‌.. ప‌ట్టాలెక్క‌నున్న విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు వందేభార‌త్ రైలు!

తాజా కేంద్ర‌ బడ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత పెరిగిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ద‌ఫా కేంద్ర రైల్వే మంత్రి హామీ మేర‌కు ఏపికి మరో వందేభారత్ అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న‌ ఏపీ రాజ‌ధాని అమరావతి రైల్వే స్టేషన్ క‌ళ సాకారం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. పార్ల‌మెంట్‌లో జ‌ర‌గిన బ‌డ్జెట్ స‌మావేశాల్లో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌వందేభారత్ సర్వీసుపైన చ‌ర్చించారు. ఈ మేర‌కు ఏపీ మంత్రుల ప్రతిపాదనపైన స్పందించిన రైల్వే మంత్రి విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్ రైలుపై స్ప‌ష్ట‌మైన హామీని ఇచ్చారు.

Vijayawada-Bangalore Vande Bharat train

ఏపీకి చెందిన లోక్‌స‌భ ఎంపీ సీఎం ర‌మేష్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రశ్నించారు. అందులో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ డెవలప్ మెంట్ గురించి అడ‌గ‌గా, ఆ స్టేషన్ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కేంద్ర‌ మంత్రి వెల్ల‌డించారు. అలాగే, ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల సమస్యలు ఉన్నాయని, త్వరలోనే పరిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే సంద‌ర్భంలో విజయవాడ -ముంబాయి మధ్య దూరం ఎక్కవగా ఉంద‌ని, ఈ లైన్‌లో వందేభారత్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేశారు. అదే సమయంలో బెంగళూరు - విజయవాడ మధ్య వందేభారత్ ప్రారంభించే అంశంపైన స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు.

ప్ర‌యాణికుల నుంచి మంచి స్పంద‌న‌..

ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్‌ పనులు వేగం పుంజుకున్నాయ‌ని, వీలైనంత తొంద‌ర‌లోనే ఆ స్టేష‌న్‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న‌ వందేభారత్ రైళ్లకు ప్ర‌యాణికుల నుంచి మంచి ఆద‌ర‌ణ ఉన్న నేప‌థ్యంలో కొత్త వందేభార‌త్‌కూ అదే త‌ర‌హా ఆద‌ర‌ణ ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకు, కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్‌కు వందేభారత్ అందుబాటులో ఉండ‌గా ఏపీ నుంచి నేరుగా బెంగళూరుకు వందేభారత్ కేటాయించాని ఎంపీలు విన్న‌వించారు. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైళ్ల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించి స‌మ‌యాన్ని ఆదా చేసుకునేందుకు ప్ర‌య‌ణికులు క్యూ క‌డుతున్నారు. ప‌లు రైల్వే స్టేష‌న్‌ల ఆదునికీక‌ర‌ణ ప‌నులు సైతం వేగం పుంజుకుంటుండ‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో రైల్వే శాఖ అగ్ర‌గామిగా నిలువ‌నుంది.

తొలి ప్రాధాణ్య‌త క‌ల్పిస్తూ..

ఇటీవ‌ల కాలంలో రైలు ప్ర‌యాణికుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లలో ప్ర‌యాణించేవారు అధిక‌మ‌య్యారు. అలాగే, విజయవాడ - చెన్నై మద్య నడుస్తున్న వందేభారత్ సైతం నిత్యం ర‌ద్దీగా ఉంటోంది. ఈ కారణంగానే కొత్తగా విజయవాడ - బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ ప్రతిపాదన‌ను ఎంపీలు తెర మీదకు తీసుకువ‌చ్చారు. దీంతోపాటు వచ్చే నెలలో ప‌ట్టాలెక్క‌నున్న‌ వందేభారత్ స్లీపర్ రైళ్లలోనూ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించి తొలి ప్రాధాణ్య‌త క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే రైల్వే శాఖ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం చేరువ అవుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

More News

    Read more about: vijayawada andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+