శ్రీరాముని భక్తులకు శుభవార్త... దేశంలోని అత్యంత ప్రఖ్యాతి గాంచిన అయోధ్య రామాలయం వెళ్లేవారికి విమానయాన శాఖ ఓ గుడ్‌న్యూస్‌ను అందించింది. హైదరాబాద్ టు అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇకనుంచి హైదరాబాద్ నగరం నుంచి అయోధ్యకు చేరుకోవాలంటే 30 గంటలు శ్రమించాల్సిన అవసరం ఉండదు. కేవలం రెండుగంటల్లోనే అయోధ్యకు చేరుకోవచ్చు. హైదరాబాద్ టూ అయోధ్య ఫ్లైట్ సర్వీసులతో పాటు మరో రెండు సర్వీసులను కూడా సెప్టెంబర్ 27వ తేది నుంచి విమానయాన శాఖ ప్రారంభించింది.
ఇక, హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు చింతించాల్సిన పనిలేదు. సులభంగా అతి తక్కువ సమయంలో అయోధ్య రాములోరి దర్శనం చేసుకోవచ్చు. ప్రజల కోరికమేరకు హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు సెప్టెంబర్ 27వ తేది నుంచే నేరుగా విమాన సర్వీసులును ప్రారంభించారు. దీంతో భక్తులు అయోధ్యకు కేవలం రెండుగంటల్లోనే చేరుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తేది నుంచి హైదరాబాద్ టూ అయోధ్యతో పాటు హైదరాబాద్ టూ కాన్పూర్‌కు.. వారంలో నాలుగురోజులపాటు సేవలందించే విమాన సర్వీసులను కూడా విమానయాన శాఖ ప్రారంభించింది.

మరికొన్ని సర్వీసులు...
హైదరాబాద్ టూ అయోధ్య, హైదరాబాద్ టూ కాన్పూర్‌తో పాటు మరికొన్ని సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. అవే హైదరాబాద్ టు ప్రయాగరాజ్, హైదరాబాద్ టు ఆగ్రాకు వారానికి మూడు రోజులు ప్రయాణికులకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇక, ఈసర్వీసులు ఈరోజు (సెప్టెంబర్ 28) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే హైదరాబాద్ టు అగర్తాల, హైదరాబాద్ టు జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా.. ఇప్పుడు ఈ కొత్త సర్వీసులను కూడా విమానాయాన శాఖ ప్రారంభించింది. ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ ప్రయాణికులకు సూచించింది.

వీటి ధరలు ఇలా ఉన్నాయి...
ఇక, వీటి ధరలను ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ టు అయోధ్యకు విమాన ధర సుమారు రూ. 5 వేలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే, హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్‌కు రూ. 5,635గా ఉన్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్ టు కాన్పూర్ ప్రయాణానికి టికెట్ ధర రూ. 4,598 నిర్ణయించారు. అయితే, హైదరాబాద్ నుంచి కేవలం ఒక్క నెలలోనే ఏడు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తోన్న ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకుని, ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు.



Click it and Unblock the Notifications















