Search
  • Follow NativePlanet
Share
» »రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప‌రిధిలో స్పెష‌ల్ ట్రైన్స్‌..

రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప‌రిధిలో స్పెష‌ల్ ట్రైన్స్‌..

రైలు ప్రయాణీకులకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఓ శుభ‌వార్త‌ను అందించింది. ప్ర‌యాణికుల‌కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆరు స్పెష‌ల్ రైళ్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రైన్స్ విశాఖపట్నం - సికింద్రాబాద్, విశాఖపట్నం- తిరుపతి, న్యూ టిన్సుకియా (అస్సాం) ఎస్ఎంవీ బెంగళూరు మధ్య ఈ ట్రైన్స్ న‌డ‌వ‌నున్నాయి. ఈ మూడు మార్గాల్లో వారానికో ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది.

విశాఖపట్నం టు సికింద్రాబాద్

08579 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ ట్రైన్ ప్ర‌తి బుధ‌వారం ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక‌, ఈ ట్రైన్ జూలై 3,2024 నుండి ఆగ‌స్టు 28,2024 వరకు విశాఖపట్నం నుండి సికింద్రాబాద్‌కు వారానికి ఒక‌సారి ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌తి బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 8.20 గంట‌ల‌కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం తొమ్మిది వారాల పాటు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది.

08580అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్ ప్ర‌తి గురువారం ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ జూలై 4, 2024 ఆగ‌స్టు 29 వరకు న‌డుస్తోంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో రాత్రి 7ః40 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 6.40 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నానికి చేరుకుంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ కూడా మొత్తం తొమ్మిది వారాల పాటు న‌డుస్తుంది. ఇక, ఈ రెండు స్పెష‌ల్ ట్రైన్స్ విశాఖ‌పట్నం-సికింద్రాబాద్ మ‌ధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

eastcoastrailway
Photo Credit: Wikipedia

విశాఖపట్నం టు తిరుపతి

08583 అన నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం-తిరుప‌తి వీక్లీ స్పెషల్ ట్రైన్ ప్ర‌తి సోమ‌వారం ఉంటుంది. జులై 1, 2024 నుండి ఆగ‌స్టు 26, 2024 వరకు విశాఖపట్నం నుండి తిరుప‌తికి వారానికి ఒక‌సారి ఈ ప్ర‌త్యేక రైలు ఉంటుంది. ఈ రైలు విశాఖ‌ప‌ట్నంలో రాత్రి 7:

00 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 9:15 గంట‌ల‌కు తిరుప‌తి చేరుకుంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ మొత్తం తొమ్మిది వారాల పాటు అందుబాటులో ఉంటుంది. 08584 అనే నెంబ‌ర్‌గ‌ల తిరుప‌తి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్ ప్ర‌తి మంగ‌ళ‌వారం అందుబాటులో ఉంటుంది. జూలై 2, 2024 నుండి ఆగ‌స్టు 27, 2024 వరకు తిరుప‌తి నుండి విశాఖపట్నానికి వారానికి ఒక‌సారి ఈ ప్ర‌త్యేక రైలు న‌డుస్తుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ తిరుప‌తిలో రాత్రి 9:55 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 10:15 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది.

న్యూ టిన్సుకియా టు ఎస్ఎంవీ బెంగళూరు

05952 అనే నెంబ‌ర్‌గ‌ల న్యూ టిన్సుకియా (అస్సాం)- ఎస్ఎంవీ బెంగళూరు ట్రైన్ ప్ర‌తి గురువారం ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ జూలై 4 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు న‌డుస్తుంది. ఈ రైలు న్యూ టిన్సుకియా (అస్సాం)లో రాత్రి 6:15 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, మూడో రోజు మ‌ధ్యాహ్నం 1:50కి విశాఖ‌ప‌ట్నం చేరుకుని, మ‌ధ్యాహ్నం 2:10 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, ఎస్ఎంవీ బెంగ‌ళూరు ఉద‌యం 9:00 ల‌కు చేరుకుంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ 18 వారాల పాటు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది.

05951 అనే నెంబ‌ర్‌గ‌ల ఎస్ఎంవీ బెంగ‌ళూరు-న్యూ టిన్సుకియా (అస్సాం) స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తి సోమ‌వారం జూలై 8 నుండి న‌వంబ‌ర్ 4 వ‌ర‌కు వారానికి ఒక‌సారి న‌డుస్తుంది. ఈ ట్రైన్ ఎస్ఎంవీ బెంగ‌ళూరులో 00:30 గంటలకు బ‌య‌లుదేరి, అదే రోజు రాత్రి 9:40 విశాఖపట్నం చేరుకుంటుంది. అక్క‌డ నుంచి రాత్రి 10:00 గంట‌ల‌కు బ‌య‌లు దేరి, బుధవారం మ‌ధ్యాహ్నం 1:15 గంటలకు న్యూ టిన్సుకియా(అస్సాం) చేరుకుంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+