Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంచకుల » ఆకర్షణలు » యదవింద్ర గార్డెన్ పింజోర్

యదవింద్ర గార్డెన్ పింజోర్, పంచకుల

18

యదవింద్ర గార్డెన్ లేదా పింజోర్ గార్డెన్ పింజోర్ లో ఉంది. పటియాల వంశ పాలకులచే నిర్మించబడిన ఈ గార్డెన్ ముఘల్ శైలిని ప్రతిబింబిస్తుంది. దీనిని 17 వ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలనలో ఏర్పాటుచేయబడింది. యదవింద్ర గార్డెన్ పేరు పటియాల యదవింద్ర సింగ్ మహారాజుకి అంకితం చేయబడింది.

యదవింద్ర తోటలు ఉత్తర భారతదేశంలోని పురాతన, ఇష్టపూర్వక తోటలుగా భావించబడుతుంది. పర్యాటకుల గదులు, రెస్టారెంట్లు విద్యుదీకరణ ఫౌంటైన్ లతో ఉంటాయి.

యదవింద్ర తోటలు చండీగర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అనేక పైకప్పులతో, గూళ్ళతో నిండిఉన్న ఈ ప్రదేశం రాజస్థానీ-మొఘల్ శైలిలో నిర్మించిన ఒక రాజభవనం. ఈ రాజభావనంలోని మొదటి అంతస్తు శిష్ మహల్, హవా మహల్ చేరికలో ఉంది. ప్రధాన ద్వారం ఈ అంతస్తు నుండి తెరుస్తారు. రెండవ అంతస్తులో రంగ మహల్, మూడవ అంతస్తులో చెట్లు, అనేక ఫల తోటలకు దారితీసే పూల పంపులు ఉన్నాయి.

తరువాతి అంతస్తులో ప్రస్తుతం ఫౌంటైన్ లతోపాటు జల్ మహల్ ఉంది, ఇక్కడి విశ్రాంతి కోసం ఒక వేదిక కూడా ఉంది. తరువాతి దానిలో దట్టమైన చెట్లు, ఫౌంటైన్లు కనిపిస్తాయి, అయితే చివరి అంతస్తులో డిస్క్ ఆకారంలో ఉండే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. ఈ తోటలో ఒక జూ కూడా కలిసి ఉంది.

ఈ ప్రాంగణంలో మంచి వెలుగులతో, సరైన కాలిబాట తో కలుపబడిన ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం, ఓకే ఆలయం కూడా ఉన్నాయి. ఈ ప్రాంగణం లోపల ఉన్న స్మారకాలు, మొత్తం తోటల గుండా తిరవడానికి నూతన ఆలోచనలతో కూడిన వారసత్వ రైలు కూడా ఉంది.

ఇది ఘగ్గర్ నదికి ఉపనదులైన ఝజ్జర్, కౌశల్య నదులకు సమీపంలో ఉంది. దీనికి చారిత్రాత్మక, ధార్మిక ప్రాముఖ్యత కలిగిన పంచపుర పేరు పెట్టబడింది. పంచపుర అనేది పాండవుల పట్టణం. శివాలిక్ శ్రేణులు సంగమించే ప్రదేశంలో ఈ అందమైన దృశ్యాలు పెంపొందించ బడ్డాయి.

ఇక్కడి ఏప్రిల్ నెలలో జరిగే బైసఖి, జూన్, జులై లో జరిగే మంగో పండుగ పర్యాటకులను ఆకర్షిస్తాయి. పింజోర్ వారసత్వ పండుగ షుమారు 2006 లో హర్యానా పర్యాటక౦ వారిచే ప్రారంభించ బడింది. పింజోర్ పట్టణ పురాతన, అద్భుతమైన వారసత్వాన్ని, యాదవింద్ర తోటల మహత్వాన్ని ఈ పండుగలో జరుపుకుంటారు. ప్రఖ్యాత కళాకారులు పాల్గొనేందుకు ఈ పండుగ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేస్తారు.

భిమదేవ్ ఆలయం, పురాతన స్నానపు గదులు యాదవింద్ర తోటకు సమీపంలో ఉన్నాయి. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రోడ్డు, రైలు, వాయుమర్గాలు అందుబాటులో ఉన్నాయి. షిమ్ల మార్గంలో ఉన్న కాలక ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రాచీన శిలాయుగానికి చెందినా పింజోర్ కూడా గోపురాల సాధనాలకు పేరుగాంచింది. క్రీశ. 10 వ శతాబ్దానికి చెందిన అనేక పురాతన శిల్పాలు, అవశేషాలు ఈ ప్రాంతం నుండి వేలికితీయబడ్డాయి. ఆదిమానవుడు ఒకటిన్నర కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివశించాడని నమ్మకం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed