Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంచకుల » ఆకర్షణలు » మొర్ని కొండలు

మొర్ని కొండలు, పంచకుల

8

మొర్ని కొండలు లేదా భోజ్ జబిఅల్ హర్యానాలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పంచకుల అదేవిధంగా హర్యానా లో ఎత్తైన ప్రదేశం. ఇది చండీగర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలించిన రాణి పేరు తో ఈ పేరు వచ్చింది. ప్రకృతి సిద్ధమైన హిమాలయ వీక్షణ సరస్సులు, వివిధ రకాల వృక్ష జాతులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

మొర్ని కొండలు హిమాలయాలలోని శివాలిక్ కొండలలో ఒక భాగం. ఇక్కడ కొండ ప్రాంతమే కాకుండా ఈ పేరుతో ఒక గ్రామం కూడా ఉంది. ఈ కొండల మార్గం నడుము రెండు సరస్సులు ఉన్నాయి. అయితే ఇవి కొండ ద్వారా వేరుచేయబడి వాటి మధ్య దాగిఉన్న రహస్యం ఈ రెండు సరస్సుల నీటి మట్టం దాదాపు ఒకేవిధంగా ఉంటుంది. ఈ సరస్సులను స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

హర్యానా ప్రభుత్వం వారు పర్వతరోహకులకు, పర్యాటకులకు రిసార్ట్లు నిర్మించారు, వాటితోపాటు మొర్ని కొండలు, హర్యానా రాష్ట్ర జాతీయ రహదారిని రోడ్లు కలుపుతాయి. ఈ రోడ్లు చండీగర్, సమీప పట్టణాలను కలపడానికి మరింతగా నిర్వహించబడుతున్నాయి.

భారతీయ అటవీ శాఖవారు, PWD వారు విశ్రాంత గదులను కూడా నిర్మించారు. ఇక్కడ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్, రోలర్ స్కేటింగ్ రింక్, ఆటస్థలం ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే శిధిలావస్థలో ఉన్న ఒక పురాతన కోట కూడా ఉంది. మొర్ని కొండలు పర్వతారోహణ ఆశక్తి కలవారికి ఎప్పుడూ ఇష్టమైన కేంద్రంగా ఉంటాయి.

మొర్ని కొండల వద్ద టిక్కర్ తాల్, బడా టిక్కర్, చోటా టిక్కర్ అనే చిన్న మనిషి చేసిన సరస్సులు ఉన్నాయి. హర్యానా పర్యాటకం వారు టిక్కర్ తాల్ వద్ద శిబిరాలలో వసతి ఏర్పాట్లను చేసారు. ఈ సరస్సులు మొర్ని పట్టణ ప్రాంతం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నిర్మలమైన పరిసరాలు శిబిరాలకు ఆధారంగా ఉంటాయి.

ఈ సరస్సులు కూడా పంచకుల లోని మొదటి సాహసోపేత పార్కు వాలే పర్యాటకులను ఆకర్షిస్తుంది. హర్యానా పర్యాటకం చే 2004 లో ప్రారంభించిన ఈ పార్కు ఒక చిన్న సరస్సు ద్వారా నిర్మించబడింది. హిమాలయాల దిగువ ప్రాంతాన్ని సాహసోపేత ప్రదేశంగా పెరుపొందేటట్లు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. తక్కువ తాళ్లు, కమాండో వలలు, బర్మ వంతెన, బోటింగ్ కనోయింగ్, కయాకింగ్ సెయిలింగ్, త్రాళ్ళతో అధిరోహించడం మరియు రాక్ క్లైంబింగ్ వంటి కొన్ని చర్యలతో ప్రయాణికులు ఆనందించవచ్చు.

వాతావరణం చాలా ఆరోగ్యకరంగా, పర్వతారోహణకి ఈ భూభాగం ఎంపిక చేసుకుని ఆనందించవచ్చు. ఈ లోయల గుండా ఘగ్గర్ నది ప్రవహిస్తుంది. కొండపైన ఉన్న ఈ మైదానం వర్ణించలేని లోయ మొత్తాన్నీ చూపిస్తుంది. ఇది ఆకుపచ్చని పచ్చిక బయళ్ళతో, ఒక బార్ ని కలిగిఉంటుంది. కొండ పైభాగాన పైన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఘగ్గర్ నది ఒడ్డున ఉన్న ఇరుకైన మార్గంలో పర్వతారోహణ చేయడం అనేది సాహసోపేతమైనదని చెప్పవచ్చు.

మొర్ని కొండలు నగర రద్దీ నుండి దూరంగా ఉండి, ప్రకృతి ఒడిలో విశ్రాంతిని, చైతన్యాన్ని నింపుకొనే ఒక ఆదర్సవంతమైన ప్రదేశం. ఈ ప్రదేశం పూర్తిగా అన్వేషించ బడలేదు, పర్యాటకుల సందర్శనకు ఇంకా కొన్ని నిజాలు దాగిఉన్నాయి. దారిమోత్తం అనేక రకాల పూలజతులు పరిచి ఉంటాయి. ఇక్కడ నివశించే గ్రామస్తులలో ఎక్కువమంది వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నారు.

మొర్ని కొండల చుట్టూ వేప, పేపాల్, జామున్, దక్, పైన్ వంటి కొన్ని మూక్కలు ఉన్నాయి. వసంతకాల సందర్భంగా ఈ చెట్ల పుష్పాలు కళ్ళను మిరుమిట్లు గోల్పుతాయి. ఈ కొండ ప్రాంతంలో పావురాలు, కుయలిస్, ఇసుక గ్రౌస్ వంటి కొన్ని పక్షులు కనపడతాయి. సాంబార్, హైనా, అడవిపిల్లి మొదలైనవి మొర్ని హిల్స్ వన్యప్రాణులు.

హర్యానా పర్యాటకం వారు పర్యాటకుల కు సరైన సౌకర్యం కోసం పాకేజీలను ఏర్పాటుచేసారు. నిద్రపోవడానికి వసతులు అద్దెకు ఇవ్వబడతాయి. ఈ పాకేజీలో రవాణా కలవదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat