పటాన్ వద్ద పటోల నేతవారు అల్లిన పట్టును పటోల అని పిలుస్తారు. పటోల పట్టును నేసె పద్దతి అన్ని నేత పద్ధతులు కన్నా చాలా కష్టంగా ఉంటుంది. వారు పట్టు నేత పనికి 'డబుల్ ఇక్కాట్ శైలి' ని ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక శైలి పటోల చేనేతకారులే కాకుండా ఇండోనేషియాలో కూడా ఈ పద్దతిని ఉపయోగిస్తారు. చీరలు తయారు చేయటానికి నెలల సమయం పడుతుంది, అందుకే వారు అధిక ధరల టాగ్లు వేస్తారు.
పటోల చీరల నేత హస్తకళను ప్రస్తుతం సాల్వి కమ్యూనిటీ వారు మాత్రమే నిర్వహిస్తున్నారు.