హిందువుల కి అతి పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి ఈ మందిరం. పూంచ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పీర్ పంచాల్ పర్వతాలు మరియు గాగ్రి, పులస్త నదీ సంగమ ప్రదేశంలో ఉన్నది ఈ మందిరం.
పెద్ద రాతితో మలచబడిన ఈ దేవాలయానికి తూర్పు, పడమర, ఉత్తరం దక్షిణం ముఖాలైన నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలు ఉంటాయి. దీని అర్ధం హిందువులలోని ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అనే నాలుగు వర్గాల వారు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. తెల్లటి రాతి శివలింగం కూడాఈ మందిరంలో ఇతర దేవుళ్ళతో పాటు ప్రతిష్టింపబడింది.
ఇక్కడున్నటువంటి పవిత్రమైన కొలనులో భక్తులు స్నానమాచరించి దర్శనానికి వెళ్తారు. ప్రతిసంవత్సరం రక్షాబంధన సమయంలో ఇక్కడ పెద్ద మేళా జరుపుకుంటారు. దశమి అఖర పూంచ్ వద్ద పవిత్రమైన హోమాన్ని, పూజలను(చారి ముబారక్, హోలీ మేస్) నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications