ఈ కాలేజీ రాజ్ కోట్ మధ్యలో కలదు. దేశం లోనే పురాతన విద్య సంస్థలలో ఇది ఒకటి. దీనిని కథియవార్ రాజ కుమారుల విద్యాభ్యాసం కొరకు స్థాపించారు. 1868 లో ఈ కాలేజీ ని బ్రిటిష్ వారు తీసుకొని, 1870 లో నామ మాత్రంగా ఆవిష్కరించారు. ఈ కాలేజీ సుమారు 26 ఎకరాల భూమిలో వుండి అనేక అందమైన భవనాలు కలిగి వుంది. ఆర్ కే సి అనే పేరుతో పిలువబడుతుంది. మద్రాస్ రాష్ట్ర మొదటి గవర్నర్ కృష్ణ కుమార్ సింగ్ భావ సిన్హా, ముంబై పోలీస్ కమీషనర్ అశోక్ కంటే , క్రికెటర్ కుమార్ సింగ్ దులీప్ సిన్హాజి , కవి కాలాపి వంటి ప్రముఖులు దీనిలో చదివారు.



Click it and Unblock the Notifications