అతి పూరాతన మ్యూజియం వాట్సన్ మ్యూజియం తప్పక చూడాలి. దీనిలో విలువైన కళాకృతులు, పెయింటింగ్ లు, అనేక పచ్చటి ప్రదేశాలు వుంటాయి. ఇది జూబిలీ గార్డెన్ లో క్వీన్ విక్టోరియా మెమోరియల్ లో కలదు. దీనికి కల్నల్ జాన్ వాట్సన్ పేరు పెట్టారు. ఈయన 1881 – 1889 లలో కధియవార్ ఏజెన్సీకి పొలిటికల్ ఏజెంట్ గా వుండేవారు. ఇక్కడ నాణెముల విభాగం , పురాతన చరిత్ర తెలిపే వస్తువులు, మహేన్జోదారో నాటి వస్తువులు, స్థానికుల వస్త్ర ప్రదర్సన, నగల ప్రదర్సన చూడవచ్చు. ఈ మ్యూజియం ఉదయం 9 గం నుండి సా.6 గం వరకు తెరచి వుంటుంది. సాధారణ సెలవు దినాలు, రెండు, నాలుగు ఆదివారాలు సెలవు దినాలు.



Click it and Unblock the Notifications