Search
  • Follow NativePlanet
Share

రెడి - ఒక సమీక్ష

3

రెడి ఒక ప్రశాంత కోస్తాగ్రామం, చిన్న గ్రామం. ఇది మహారాష్ట్రలోని సింధు దుర్గ జిల్లాలో కలదు. దీని అసలు పేరు రెడి. ఈ గ్రామం అరేబియా సముద్ర తీరంలో కలదు. ఇక్కడ జీడిపప్పు, కొబ్బరి చెట్లు అధికంగా పండుతాయి.

ఈ గ్రామం వెంగుర్ల తాలూకా కిందకు వస్తుంది. పురాతన కాలంలో ఇది ప్రసిద్ధ ఓడరేవుగా ఉండేది. ఇపుడు రెడి ఒక పర్యాటక కేంద్రంగా మారింది. బీచ్ లు, యశ్వంత ఘడ్ కోట వంటి చారిత్రక చిహ్నాలు కలిగి పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ముంబై నుండి రెడి గ్రామం సుమారు 566 కి.మీ.లు మాత్రమే, రవాణా సౌకర్యాలు అధికం కనుక తేలికగా చేరవచ్చు.

రెడి లో పర్యాటక ఆకర్షణలు ఏమి కలవు?  స్వయంభు శివ దేవాలయం, గణేశ దావాలయం, మౌళి దేవాలయం, రాంపురుష్ దేవాలయం, నవదుర్గా దేవాలయాలు కలవు. నవదుర్గ దేవాలయంలో మాత దుర్గాదేవి పూజలు అందుకుంటుంది. ఇవే కాక ఈ ప్రదేశంలో మరికొన్ని దేవాలయాలు కూడా కలవు. యశ్వంత ఘడ్ కోట, షిరోడా, ఆరావళి మరియు తెరెఖోల్ కోట వంటి విలువైన చారిత్రక ప్రదేశాలు కూడా చూడదగినవే.

రెడి ప్రకృతి దృశ్యాలతో, అందచందాలతో ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. రెడి బీచ్ మనోహరమైన ప్రదేశం. సుందరమైన కొబ్బరి చెట్లు, వక్క చెట్లు, జీడిపప్పు మరియు మామిడి తోటలు కలిగి ఉంటుంది. రెడి వాతావరణం సంవత్సరం పొడవునా స్వాగతిస్తూనే ఉంటుంది.  ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది అంటే, వేసవులు కొద్దిపాటి వేడి, శీతాకాలపు చలిగాలులు వంటి వాటితో సంవత్సరం అంతా ఆహ్లాదంగానే ఉంటుంది. కాని. వర్షాకాలం తర్వాత పర్యటన సూచించదగినది.

రెడి ప్రదేశంలో రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం లేదు. అందమైన ఈ ప్రదేశాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయం లేదా సావంత్ వాడి రైల్వే స్టేషన్ల ద్వారా చేరవచ్చు. ప్రయాణం సుఖ కరంగానే ఉంటుంది. రోడ్డు మార్గం ఎంచుకునేవారికి ఎన్నో రకాల ప్రభుత్వ బస్సులు సౌకర్యవంతంగానే కాదు, చవక ధరలలో కూడా లభిస్తాయి.

రెడి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రెడి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రెడి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రెడి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రెడి గోవాకు సమీపంలో పాణాజీకి దగ్గరగా ఉంటుంది. ముంబైనగరం దీనికి 566 కి.మీ.ల దూరంలో ఉంది. పాణాజీ 55 కి.మీ.ల దూరం మాత్రమే. అనేక ప్రభుత్వ బస్సులు, ప్రయివేట్ బస్సులు, టాక్సీలు మహారాష్ట్ర మరియు ఇతర పట్టణాలనుండి రెడి చేరేందుకు సిద్ధంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రెడి కి సమీపంలో సావంత్ వాడి ముఖ్య రైలు స్టేషన్. ఇది 20 కి.మీ.ల దూరంలో కలదు. సావంత్ వాడి నుండి ఇతర నగరాలకు, పట్టణాలకు తరచు రైళ్ళ రాకపోకలు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    రెడి ఎలా చేరాలి? విమాన ప్రయాణం రెడికి సమీపంలో డబోలిం విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం ముంబై, బెంగుళూరు వంటి నగరాలకు రోజువారీ విమానాల సౌకర్యం కలిగి ఉంది. విమానాశ్రయం నుండి రెడి చేరాలంటే, టాక్సీలు ప్రతి కి.మీ.కు రూ.7 చొప్పున లభ్యంగా ఉంటాయి. విదేశీ పర్యాటకులకు రెడి చేరాలంటే, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సౌకర్యంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue