దేఒరియ సరస్సు రుద్రప్రయాగ్ కు 49 కి.మీ.ల దూరంలో కలదు. చుట్టూ పచ్చని అడవులు కలవు. ఈ సరస్సు నీటిలో చౌఖంబ పర్వత శ్రేణులు,గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, నీలకంత శిఖరాలు ప్రతిబింబిస్తాయి. సముద్ర మట్టానికి 2438 మీ.ల ఎత్తునకల ఈ సరస్సుచోప్త - ఉఖి మత్ రోడ్ లో రెండు కి.మీ.ల దూరంలో వుంటుంది. బర్డ్ వాచింగ్, బోటింగ్,చేపలు పట్టుట లు చేయవచ్చు.
పర్యాటకులు రాత్రి బస, కామ్పింగ్ ట్రెక్కింగ్ ఇక్కడ సాధారణంగా చేస్తారు. ట్రెక్కర్లు చోప్త నుండి బయలు దేరి తుంగనాత్ మరియు చంద్రశిల ప్రదేశాలు ట్రెక్కింగ్ లో చేరతారు. ఇతిసాల మేరకు దేవతలు ఈ సరస్సులో స్నానాలు చేసేవారు. కనుక దీనిని పురాణాలలో 'ఇంద్ర సరోవర్' అని పేర్కోన్నారు. ఈ సరస్సు వద్ద కల ఒక యక్షుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుని యక్ష ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు.



Click it and Unblock the Notifications