గుడవి బర్డ్ శాంక్చువరి లేదా పక్షుల అభయారణ్యం దట్టమైన అడవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వివిధ జాతుల పక్షులుంటాయి. పక్షులను గమనించే వారికి ఎంతో ప్రియమైన ప్రదేశం ఇది. ఎన్నో రకాల పక్షులు జూన్ నుండి డిసెంబర్ వరకు ఇక్కడ ఉంటాయి. ఇది. 0.73 చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. కర్నాటకలోని అయిదు ప్రధాన పక్షి అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇది షిమోగాకు 15 కి.మీ. దూరంలోను మరియు సాగర్ కు 41 కి.మీ. దూరంలో ఉంటుంది. సమీప రైలు స్టేషన్ షిమోగా. దీనికి అతి దగ్గరి విమానాశ్రయం మంగుళూరు. గుడవి కి బస్ సౌకర్యం కూడా ఉంది. సిర్సి వంటి పట్టణాలనుండి గుడవి రెండు గంటల ప్రయాణ దూరం.



Click it and Unblock the Notifications