సిర్సా నగరానికి పడమటి వైపు 30 కిలోమీటర్ల దూరంలో డేరా జీవన్ నగర్ వుంది. నామదారీ తెగకు ఇది చాలా ముఖ్యమైన ధార్మిక కేంద్రం. గురువు నుంచి నామ్, అంటే మంత్రం లేదా ఒక దైవ నామం తీసుకున్న వారు ఆజీవితం ఆయన ఆదేశాలకు కట్టుబడి వుండి, నామదారీ లు అనిపించుకుంటారు.
నామదారీ తెగకు చెందిన డేరా లేక శిబిరం వున్న గ్రామాన్ని పూర్వం చిచల్ అనే వారు. తరువాత దానికి నామదారీ గురువు స్వర్గీయ ప్రతాబ్ప్ సింగ్ తల్లి పేరిట జీవన్ కౌర్ అనే పేరు వచ్చింది. ఈ తెగకు చెందిన చాలా మంది అనుయాయులు పాకిస్తాన్ లోని షేక్ పురా, సియాల్ కోట్, గుజ్రన్ వాలా జిల్లాలకు చెందినా వారు, అయితే దేశ విభజన తరువాత వారు ఇక్కడ స్థిరపడి పోయారు.
అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహించి గురు గ్రంథ సాహిబ్ నుంచి గుర్బాని చదివి వినిపిస్తారు. తరువాత నామదారీ తెగ గురువు ఒక ప్రవచనం చేస్తారు.
చేట్ బడీ సందర్భంగా (మార్చ్-ఏప్రిల్) హలా అనే వార్షిక ఉత్సవాన్ని ఈ కేంద్రంలో చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. ఇక్కడ జరిగే ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే 11 రూపాయల రుసుముతో సామూహిక వివాహాలు చేస్తారు.