సోమనాథ్ నుండి 6 కి.మీ.ల దూరంలో ఉన్న వేరవాల్ , చేపలకై ప్రసిద్ధి చెందిన స్థలం. సంప్రదాయ పద్ధతులలో పడవ నిర్మాణం మరియు జాలవాహినౌకలను ఉపయోగించి చేసే చేపల వేట ఇక్కడ చూడవచ్చు. చేపల వాసన వాతావరణంలో ఎల్లప్పుడూ ఉంటుంది. అది మీకు పడనట్లయితే, ఇక్కడకు రాకుండా ఉండటం మంచిది. ఈ ప్రదేశం విశిష్ట తీర ప్రాంత పారిశ్రామిక కేంద్రం. భారీ పరిమాణంలో సముద్రపు ఆహారం ఇక్కడ నుండి జపాన్, ఐరోపా, ఆగ్నేయ ఆసియా, పెర్షియన్ గల్ఫ్ దేశాలు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది.



Click it and Unblock the Notifications