సముద్ర మట్టం నుండి 3801 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్రిష్ణసర్ సరస్సు, సొనామార్గ్ కి సమీపంలో ఉన్న అతి సుందరమైన సరస్సులలో ఒకటి. దట్టమైన అడవులతో చుట్టబడి ఉన్న ఈ ప్రాంతం లో పర్యాటకులు మంచి నీటి చేపలని పట్టడం వంటి నీటి క్రీడలని ఆనందించవచ్చు. ఎండాకాలం లో ఈ ప్రాంత వాతావరణం చల్లగా అలాగే ఆహ్లాదకరంగా ఉంటుంది. 4084 మీటర్ల ఎత్తులో ఉన్న నిచినై పాస్ ద్వారా పర్యాటకులు సులభంగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు బిసంసర్ లేక్ అనబడే మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ ని కూడా సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications