400 అడుగుల పొడవైన ఈ విజయ నగర్ కోట 5 వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో కోల్ రాజులచే నిర్మించబడినది. రోబెర్ట్స్ గంజ్ కు 30 కి.మీ.ల దూరం. ఇది మావు కలాన్ విలేజ్ లో చర్చి రోడ్ లో కలదు. కోటలో సగం భాగం కైమూర్ శ్రేణుల కొండ ప్రాంతం ఈ కోటలో కేవ్ పెయింటింగ్ లు, విగ్రహాలు, శిలా శాసనాలు, ఎప్పటికి ఎండిపోని కొలనులు కలవు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ ఒక ఉర్స్ వేడుకలను నిర్వహిస్తారు. దీనికి యాత్రికులు అన్ని మతాల వారు అధిక సంఖ్యలో వస్తారు.
కోటకు సమీపంలో మీరా సాగర్ మరియు రాం సాగర్ అనే చెరువులు కలవు. వీటి మధ్యలో అందమైన ఒక విశాల రంగ మహల్ అనే భవనం కలదు. కన్వారియాస్ అనే శివ భక్తులు రాం సాగర్ లోని నీటిని కుండలతో తమ కాలి నడక ప్రారంభించే ముందు తీసుకు వెళతారు.



Click it and Unblock the Notifications