బద్గాం శ్రీనగర్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక జిల్లా. గతంలో, శ్రీనగర్ జిల్లా లో బద్గాం ఒక భాగం. 1979 లో ఒక స్వతంత్ర జిల్లా గా అవతరించింది. ఇది దాని నీటి వాగులు మరియు పర్వత శిఖరాల వల్ల పర్యాటకుల లో ప్రఖ్యాతమైనది. పెహ్జాన్, దూద్ పతేర్, సంగ్-ఎ-సఫేద్ లేదా తెలుపు రాళ్లు, నక్వేర్ పాల్ మరియు యౌస్మర్గ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్వతాలలో కొన్ని. తతకుతి పర్వతం, దూద్ గంగ, సుట్ హరన్, నీల్ నాగ్, గంధక్ నాగ్, సుఖ్ నాగ్, నారా నాగ్ మరియు పుష్కర్ నాగ్ ఈ ప్రాంతంలో ప్రముఖ నీటి వాగులలో కొన్ని.
బద్గాం జిల్లా చుట్టూ దక్షిణాన పుల్వామా, ఉత్తరాన శ్రీనగర్ మరియు నైరుతి లో బారాముల్లా మరియు పూంచ్ ఉన్నాయి. ఖగ్ మరియు తోసామైదాన్ జిల్లాలోని ఇతర ఆకర్షణలు. పర్వతపాదాల్లో ఉన్న సుందరమైన చిన్న గ్రామాలు చూడటానికి నలు మూలల నుంచి పర్యాటకులు ఇక్కడకి వస్తారు.



Click it and Unblock the Notifications