ప్రసిద్ధ షాలిమార్ ఉద్యానవనానికి వాయువ్య భాగంలో ఉన్న బుర్జాహాం కాశ్మీర్ లో గొప్ప పురావస్తు పరిశోధనా సంబంధ ప్రాముఖ్యత ఉన్న ప్రధాన చారిత్రక ప్రదేశం. ఈ ప్రాంతం లో క్రీ.పూ 3000 మరియు 1500 ల మధ్య నియోలిథిక్ గ్రామం ఒకటి ఉండేదని కనుగొన్నారు. ఇక్కకి పురాతన గృహాలు పాక్షికంగా భూమిలోకి త్రవ్వి నిర్మించిన భూగర్భ గుంట ఇళ్ళు. క్రీ. పూ 2000 తరువాత ఇక్కడ ఇళ్ళు మట్టి-ఇటుకలు తో నేలమట్టమునకు పైన కట్టబడ్డాయి.
స్థానిక భాషలో బుర్జాహాం అనగా కొండ రావి చెట్ల స్థలం. ఈ ప్రదేశంలో జరిగిన త్రవ్వకాలలో కాలిన కొండ రావి చెట్లను భారీ సంఖ్యలో కనుగొన్నారు. అందువల్లే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఈ కొండ రావి చెట్లు నియోలిథిక్ యుగ సమయంలో సమృద్ధిగా పెరిగాయని ఆ త్రవ్వకాల వల్ల తెలుస్తుంది.
ఈ ప్రదేశంలో తవ్వకం 1961 నుండి 1968 వరకు దాదాపు ఆరు సంవత్సరాలు జరిగింది. పది మానవ అస్థిపంజరాలు దొరికాయి. శాస్త్రీయ ప్రయోగాల తో ఈ మానవ అస్థిపంజరాలు నియోలిథిక్-మెగాలిథిక్, నియోలిథిక్, మరియు కొన్ని ఇతర చారిత్రాత్మక యుగాలకి చెందినవి గా ధ్రువీకరించారు. ఈ ప్రదేశం నుండి సేకరించిన ప్రధాన పురాతత్వ వస్తువులలో కొన్ని కుండలు, బాణపు మొదలులు, జంతు అస్థిపంజరాలు మరియు పరికరాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications