దాల్ సరస్సు యొక్క పశ్చిమాన ఉన్న హరి పర్బత్ కోటని 18 వ శతాబ్దం సమయంలో అట్టా మొహమ్మద్ ఖాన్ అనే ఆఫ్ఘను గవర్నరు నిర్మించాడు.
మొఘల్ మహా చక్రవర్తి అక్బర్ 1590 సమయంలో ఈ కోట యొక్క పరిసర గోడలు నిర్మించాడు. ఒక కథ ప్రకారం, హరి పర్బత్ ఒకప్పుడు జలోభవుడు అనే భయంకరమైన రాక్షసుడు నివసించిన ఒక పెద్ద సరస్సు. భయకంపితులయిన ఆ ప్రాంత ప్రజలు వైవాహిక ఆనందం,దీర్ఘాయువు ఒసగే హిందూ దేవత సతి ని ప్రార్థించి ,ఆమె సాయం కోరారు. అపుడు ఆమె ఒక పక్షి రూపం లోకి పరివర్తన చెంది ఆ రాక్షసుని తల మీద ఒక గులకరాయి పడవేసిందని నమ్ముతారు. భూమి వైపు పడిపోతున్న కొద్దీ గులకరాయి క్రమంగా పెరిగి చివరికి రాక్షసుణ్ణి చూర్ణం చేసి చంపేసింది.
కోట ప్రస్తుతం జమ్మూ మరియు కాశ్మీర్ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ ప్రదేశాన్ని దర్శించగోరుతున్న పర్యాటకులు ఈ విభాగం నుండి అనుమతి పొందాలి. లాల్ మండి స్క్వేర్ మరియు శారికా దేవి ఆలయం హరి పర్బత్ కోట సమీపంలో కొన్ని ఇతర ప్రధాన ఆకర్షణలు.