షా-ఇ- హందాన్ మసీదు లేదా ఖన్కా-ఎ-మొల్లా అని కూడా పిలవబడే షా హందాన్ ఖన్కా, సుల్తాన్ సికందర్ చే శ్రీనగర్ లో జీలం నది ఒడ్డున క్రీ.శ 1400 లో నిర్మించబడింది. ఈ మసీదుని మహమ్మదీయ మతాన్ని మొట్టమొదట జమ్మూ మరియు కాశ్మీర్ లో ప్రచారం చేసిన మీర్ సయ్యద్ ఆలీ హందానీ గౌరవార్ధం నిర్మించారు.
మహమ్మదీయ చాంద్రమాన పంచాంగం (క్యాలెండర్) అనుసారం సంవత్సరంలో చివరి నెల దుల్-హజ్ యొక్క ఆరో రోజు న మీర్ సయ్యద్ ఆలీ హందానీ వర్ధంతి జరుపుకుంటారు. భక్తులు ప్రార్థనలు నిర్వహించడం కోసం ఆ రోజు పెద్ద సంఖ్యలో ఈ పుణ్య స్థలాన్ని సందర్శించుకుంటారు. చిత్రంగా చెక్కిన పైకప్పు మరియు వేలాడుతున్నగంటలు తో కూడిన అందమైన చెక్క నిర్మాణం మందిరం లోపల కనిపిస్తుంది. మందిరం లోపలి గోడల పై పురాతన, చారిత్రక వ్యాఖ్యానాలు మరియు ధార్మిక సందేశాలు చెక్కబడి ఉన్నాయి.



Click it and Unblock the Notifications