దాల్ సరస్సుకి పశ్చిమాన ఉన్న నసీం బాఘ్ మొఘల్ ఉద్యానవనాలలో ఖ్యాతి చెందింది. దీనికి “గాలుల ఉద్యానవనం” అని కూడా పేరు. ఈ తోటని మొఘల్ మహా చక్రవర్తి అక్బర్ తన హయాంలో 1586 లో నిర్మించాడు. తరువాత, 1635 లో, మరొక ప్రముఖ మొఘల్ రాజు, షాజహాన్, ఈ తోట లో సుమారు 1,200 చెట్లు నాటించాడు.
జీలం నది ఒడ్డున ఉన్న ఈ తోట లో పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఎన్నో సరస్సులు మరియు పడవ ఇళ్లు ఉన్నాయి. సందర్శకులకు శిబిరాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. సాంప్రదాయ కాశ్మీరీ హస్తకళచే తయారు చేయబడిన వస్తువులను, ఎండు ఫలాలను కూడా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. నసీం బాఘ్ ఏడాది పొడవునా ప్రవేశయోగ్యం గా ఉంటుంది. అయితే ఏప్రిల్ మరియు జూన్ మధ్య కాలం ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనువైనదిగా భావిస్తారు.



Click it and Unblock the Notifications