నవసారి ప్రదేశం పూర్ణ నది ఒడ్డున సూరత్ కు దక్షిణంగా 30 కి. మీ. ల దూరం లో కలదు. ఇది ఒక మంచి వ్యాపార కేంద్రం. పార్సీల సెటిల్మెంట్ లు ఇక్కడ కలవు. పార్సీలు ఇక్కడకు క్రి. శ. 1142 లో వచ్చారు. వారి అగ్ని దేవాలయాలు, ప్రసిద్ధ పార్శ్వనాత్ టెంపుల్, సయ్యద్ సాదత్ కి దర్గా వంటివి ఇక్కడ చూడవలసిన ప్రసిద్ధ ఆకర్షణలు. ఖ్యాతి గాంచిన స్టీల్ పారిశ్రామిక వేత్త జంషెడ్ జి టాటా కు ఇది జన్మస్థలం. నేటికి ఆయన నివాసాన్ని ఒక చారిత్రక స్మారకంగా ఇక్కడ పరిరక్షిస్తున్నారు.



Click it and Unblock the Notifications