త్రిశూర్ లో ఉన్న అర్కేలాజికల్ మ్యుజియం 1938 లో ఏర్పాటైంది. ప్రస్తుతం కనిపిస్తున్న పురావస్తు గాలెరి మరియు పిక్చర్ గాలెరి ల అనుసంధానం మాత్రం 1975 లో రూపుదిద్దుకుంది. పురాతన లిఖిత ప్రతులు, త్రవ్వకాలలో లభించిన పదార్ధాలు మరియు ఏడవ శతాబ్దానికి చెందిన రాతి శిల్పాలు వంటి ఆసక్తికరమైన చారిత్రిక అంశాలతో ఈ మ్యూజియం సందర్శన గొప్ప పర్యాటక అనుభవాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ ప్రదర్శింపబడే కేరళ కి సంబంధించిన కళాఖండాలు త్రిశూర్, వాయనాడ్ మరియు పాలక్కాడ్ జిల్లాల నుండి లభ్యమైనవి కావడం విశేషం. ప్రముఖ వ్యక్తుల భారీ విగ్రహాలు, చారిత్రక భవనాల మినియేచర్ లు, విస్తృతంగా సేకరించబడిన చిత్రలేఖనాలు పర్యాటకుల సందర్శన కి అందుబాటులో ఉన్నాయి. తూర్పు మరియు పశ్చిమాల ఆహ్లాదకరమైన కలయిక ఈ భవనం.
ఈ మ్యూజియం లో ఎన్నో రకాల చారిత్రక అంశాల ప్రదర్శనలు ఉండడం వల్ల వైవిధ్యభరితమైన మ్యూజియంగా ఖ్యాతి గడించింది. త్రిశూర్ జూ ఉన్న ప్రాంగణం లో నే ఈ మ్యుజియం కూడా ఉంది.



Click it and Unblock the Notifications