Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు » పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి

పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి, త్రిశూర్

3

ప్రకృతి ప్రేమికులకి ఈ పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. తమిళనాడు లో ఉన్న అన్నామలై మరియు కేరళ లో ఉన్న నేల్లింపతి పరిధుల మధ్యలో ఉన్న ఈ లోయ సహజమైన ప్రకృతి సౌందర్యానికి ఉదాహరణ. ఈ సాంచురి దాదాపు 285 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇందులో వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలాన్ని గమనించవచ్చు.

34 జీవవైవిధ్య కేంద్రాలలో ఒకటైన ఈ సాంచురి లో ప్రైవేటు వాహనాలు నిషేధం. పులి, చిరుత పులి, అడవి కుక్కలు, ఏనుగులు, అడవి దున్న వంటి వివిధ జంతువులని చూడడానికి సఫారి వాహనాలు అద్దెకి అందుబాటులో ఉంటాయి. 134 జాతుల అరుదైన పక్షులకి ఈ సాంచురి స్థావరం. వివిధ రకాల కీటకాలు, ఉభయచరాలు, చేపలు, సీతాకోకచిలుకలు, మొక్కలు వంటివి ఎన్నో ఈ సాంచురి లో సందర్శకులని ఆకర్షించేవి ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సాంచురి లో వసతి సదుపాయం కలదు. ఆహ్లాదకరంగా ఉండే ట్రీ హౌస్ ల దగ్గర నుండి కుటీరాల వరకు వసతుల ఏర్పాటు కలదు.

ఈ ప్రాంతానికి కేవలం రోడ్డు మార్గం ద్వారానే చేరగలుగుతారు. పాలక్కాడ్(కేరళ) లేదా కోయంబత్తూర్ (తమిళ్ నాడు) నుండి ఇక్కడకి చేరవచ్చు. పొల్లాచి(తమిళ్ నాడు) నుండి బస్సు సర్వీసులు కలవు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సాంచురి తెరిచే వేళలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat