కేరళ యొక్క కళలు మరియు సంస్కృతి ల వ్యాప్తి కై తీవ్రంగా కృషి చేస్తున్న కేంద్రం ఈ కేరళ కళామందిరం. లలిత కళలను బోధించే విద్యా సంస్థ ఇది. కళల వ్యాప్తికై కృషి చేస్తున్న రెసిడెన్షియల్ కాంపస్ ఇది. ప్రముఖ కవి పద్మభూషణ్ వల్లతోల్ నారాయణ మీనన్ గారిచే ఈ కళామండలం 1930 లో స్థాపించబడినది.
ఆసక్తికరమైన మరియు ఉత్సాహవంతులకి ఈ కళామండలం ద్వారాలు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాయి. అందుకే కేరళ పర్యాటక శాఖతో కలిసిన ఈ ప్రాంతం ఏంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తోంది. పురాతన మరియు ప్రస్తుతం ఆచరణలో ఉన్న కేరళ సంస్కృతులని తెలుసుకునేందుకు ఈ కళామండలం ఒక వేదికగా పనిచేస్తుంది.
వల్లతోల్ మ్యూజియంలో నారాయణ మీనన్ గారి రచనల ప్రదర్శన ప్రముఖంగా ఆకర్షిస్తుంది. అంతే కాకుండా, ఈ కళామండలం యొక్క అభివృద్దికి కృషిచేసిన ఏంతో మంది కళాకారుల పోర్ట్రైట్ గాలెరి (Portrait gallery) ప్రదర్శన కూడా సందర్శకులని అమితంగా ఆకర్షిస్తుంది. పురాతన కళామండలం ప్రాంగణంలో ఉన్న సమాధిలోవల్లోతోల్ వారి ఆత్మ విశ్రాంతి తీసుకుంటోంది.



Click it and Unblock the Notifications