పర్యటించదగిన మరొక ప్రదేశం వాడక్కుంనాథన్ టెంపుల్. తెన్కైలాసం మరియు వర్షభకాలం గా కుడా ప్రసిద్ది. ఈ గుడిలో మహా శివుడు కొలువై ఉంటాడు. పురాణాల ప్రకారం, విష్ణు మూర్తి అవతారమైన పరశురాముడు నిర్మించిన గుడులలో ఇది మొట్ట మొదటి గుడి. ఈ గుడిలో దైవత్వం యొక్క ప్రశాంత కిరణాలు భక్తులపై ప్రసరిస్తాయి.
ఈ గుడికి నలువైపులా ఉన్న అధ్బుతమైన బురుజులు కేరళ యొక్క నిర్మాణకళ ని ప్రతిబింబిస్తాయి. చెక్కపై అధ్బుతంగా చిత్రింపబడిన ఆసక్తికరమైన పురాణ గాధలు, గోడలపై చిత్రించబడిన మహాభారతం లో ని కొన్ని ముఖ్య ఘట్టాల తో నే కాకుండా కుటుంబలం లో ప్రదర్శించే సాంస్కృతిక కళా ప్రదర్శనల ద్వారా కూడా పర్యాటకులను మరియు భక్తులను ఈ గుడి అమితంగా ఆకట్టుకుంటుంది.
కుటుంబలం అనే ప్రాంతాన్ని ప్రత్యేకించి కళలని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసారు. ఈ ప్రవిత్రమైన వేదిక ని గర్భగుడి గానే భావిస్తారు. పూరం పండుగని జరుపుకునే తెక్కికాడు ప్రాంతంలో ఈ గుడి ఉంది.



Click it and Unblock the Notifications