Search
  • Follow NativePlanet
Share
» » ఉత్తరాఖండ్ లో సాహస క్రీడలు !

ఉత్తరాఖండ్ లో సాహస క్రీడలు !

ఇండియా లో ఒక రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ చాలా అందమైనది. హిమాలయాల దిగువ భాగంలో కలదు. మంత్ర ముగ్ధులను చేసే ఈ ప్రదేశ అందాలు వేలాది మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే కాదు, ఇటీవలి కాలంలో బాలి వుడ్ చిత్రాలు సైతం ఈ ప్రాంతాలలో షూట్ చేయబడుతున్నాయి.

ఉత్తరాఖండ్ లోని అడ్వెంచర్స్ అంటే అవి వివిధ రకాలుగా వుంటాయి. ఇవన్నీ ఉత్తరాఖండ్ పర్యాటకం లో అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తాయి. వివిధ ప్రకృతి ప్రదేశాలను వాటర్ స్పొర్త్స్ , ట్రెక్కింగ్ వంటి క్రీడలతో ముడిపెట్టి పర్యాటకులు ఆనందించవచ్చు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో ఏ రకమైన సాహస క్రీడలు ఆచరించవచ్చు అనేవి కొన్ని ఇక్కడ పరిశీలించండి.

ట్రెక్కింగ్
ట్రెక్కింగ్ కు ఉత్తరాఖండ్ ఒక ఉత్తమ ప్రదేశం. ఇక్కడి రూప కుండ్ ట్రెక్కింగ్, పాన్వాలి బుగ్యాల్ ట్రెక్, మదమహేస్వర్ ట్రెక్, చంద్రశిల ట్రెక్ మరియు సతోపంత్ స్వర్గారోహణ ట్రెక్ లు ట్రెక్కింగ్ ప్రియులకు ఆనందం కలిగిస్తాయి. కోరి పాస్ ట్రెక్ సాధారణంగా విదేశీయులు ఇక్కడ చేస్తారు.

పూవుల లోయ మరొక అందమైన ప్రదేశం. ఇక్కడ కూడా ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. టూరిస్ట్ లు నందా దేవి సాన్క్చురి లోపల కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు. గంగోత్రి గ్లేసియర్ , మిలం గ్లేసియర్, ట్రెక్ బి కాఫ్ని గ్లేసియర్ లపై కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు.

ఉత్తరా ఖండ్ ఆకర్షణలు

వన్య జీవనం ఆనందించండి

కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ లు ఉత్తరాఖండ్ లోని వన్య జంతువుల అడ్వెంచర్ ప్రదేశాలలో ఒక భాగం. ఈ ప్రదేశాలు ఫోటోగ్రాఫర్లను, వన్య జంతు ప్రియులను, పక్షి ప్రియులను బాగా ఆకర్షిస్తాయి.

రాజాజీ నేషనల్ పార్క్ చూసేందుకు నవంబర్ నుండి జూన్ వరకూ అనుకూల సమయం. జీప్ సఫారీలు కార్బెట్ నేషనల్ పార్క్ కు బిన్సార్ వైల్డ్ లైఫ్ టూర్ కు వినియోగిస్తారు.

 ఉత్తరాఖండ్ లో సాహస క్రీడలు !

గంగా మరియు కాళీ నదులలో రాఫ్టింగ్
ఉత్తరాఖండ్ లో రివర్ రాఫ్టింగ్ చేయని వారు ఎవరు వుంటారు ? ఇక్కడ కల అలకానంద, దులి గంగ మరియు కాళి రివర్ లు రివర్ రాఫ్టింగ్ కు అత్యంత సౌకర్యంగా వుంటాయి. ఈ రాఫ్టింగ్ లో అనేక పర్వతాలు, అడవులు, కొండ ప్రాంతాలు దృశ్యాలు చూడవచ్చు. రాఫ్టింగ్ ఇక్కడ ఒక సవాలుతో కూడినది. మార్గాదర్శకతకు శిక్షకులు వుంటారు. అనుభవం, అర్హతలు కల శిక్షకులు రాఫ్టింగ్ కోర్సులు కూడా నిర్వహిస్తారు.

రాక్ క్లైమ్బింగ్
ఉత్తరాఖండ్ లో రాక్ క్లైమ్బింగ్ మరొక సాహస చర్య. రాక్ క్లైమ్బింగ్ ను నైనిటాల్ మరియు రిషికేశ్ లలో చేస్తారు. ఈ రాక్ క్లైమ్బింగ్ చేసేవారు ఇక్కడ ముందుగా మెంటల్ గా సిద్ధపడాలి. ఇక మిగిలిన జర్నీ అంతా గైడ్ లు, హెల్మెట్ లు, రోప్ వే లు , గేర్స్, సేఫ్ యాంఖర్ ల సహాయంతో నడిచిపోతుంది.

మౌంటెన్ బైకింగ్
ఉత్తరాఖండ్ మౌంటెన్ బైకింగ్ అంతా హిమాలయాలలో సాగుతుంది. ఎంతో ఉత్సాహవంతమైన, ఉద్విగ్న భరితమైన క్రీడ ఇది. అత్యంత రిస్క్ తో కూడినది. ఎత్తైన ఏటవాలులు, ఎగుడు దిగుడు ప్రదేశాలు సాహసికులను స్వాగతిస్తాయి. బైకింగ్ లో చూడవలసిన మార్గాలు ఎన్నో కలవు.

కామ్పింగ్
ఉత్తరాఖండ్ కామ్పింగ్ లో మీరు అనేక సుందర ప్రదేశాలు చూడవచ్చు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, బిన్సార్ సాన్క్చురి లలో ఆసక్తికరమైన వైల్డ్ లైఫ్ కెంపులు చేయవచ్చు. బేస్ కెంపులు రిషికేశ్, ధనౌల్తి, నైనిటాల్, చోప్తా , భీమతాల్ లో చేస్తారు. రిషి కేష్ ప్రదేశం సాహసిక ప్రియులకు జంగల్ కామ్పింగ్, బంగీ జుంపింగ్, రాఫ్టింగ్ లకు అనుకూలంగా వుంటుంది.

ఔలి ప్రదేశం ఇండియా కు స్కై కేపిటల్ గా పరిగనిస్తారు. ఈప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2500 - 3500 మీటర్ల ఎత్తున కలదు. స్కై ఇంగ్ లో మేరు ఎంతో త్రిల్ మరియు ఆనందం నిస్సందేహంగా పొందవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్కై ఇంగ్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తారు. పర్యాటకులు అధికంగా వస్తారు. స్కై ఇంగ్ లో దయారా బుగ్యాల్, మున్సియారి మరియు మున్డాలి వంటి ఆకర్షణీయ ప్రదేశాలు చూడవచ్చు.

ఉత్తరా ఖండ్ లో మీరు ఇంకా బంగీ జంపింగ్, ఫ్లైయింగ్ ఫాక్స్ జైంట్ స్వింగ్ వంటివి చేయవచ్చు. అయితే ఈ క్రీడలు ఇక్కడ ఇంకా ప్రారంభ దశలో వున్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+