Search
  • Follow NativePlanet
Share
» »ఔలి - స్కయింగ్ క్రీడల స్పెషల్ !!

ఔలి - స్కయింగ్ క్రీడల స్పెషల్ !!

ఔలి ఒక అందమైన పర్యాటక ప్రదేశం. స్కయింగ్ క్రీడకు ప్రసిద్ధి. సుందర దృశ్యాలు కల ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల మీటర్ల ఎత్తున కలదు. ఏటవాలు ప్రాంతాలలో ఓక్ మరియు ఇతర వృక్షాలు కల అటవీ ప్రదేశాలు కలిగి వుంటుంది. ఈ ప్రదేశాన్ని స్థానిక భాషలో 'బుగ్యాల్' అంటే పచ్చిక మైదాన ప్రాంతం అని కూడా అంటారు.

ఇతర ఆకర్షణలతో పాటు ఇక్కడ శైల దార్ తపోవన్ ఒక చిన్న గ్రామం. ఔలి నుండి 15 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ప్రదేశంలో సహజ వేడి నీటి బుగ్గ మరియు ఒక దేవాలయం లు కలవు. దీని నుండి మూడు కి. మీ. ల దూరంలో మరొక వేడి నీటి బుగ్గ కూడా కలదు. ఇది ప్రధానంగా చూడ దగిన ప్రదేశం.

ఔలి ఎలా చేరాలి ?
విమాన ప్రయాణం
ఔలి నుండి 279 కి. మీ. ల దూరంలో కల డేహ్రా డూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఇతర ప్రదేశాలకు విమానంలో చేరవచ్చు. విదేశీయులు, న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుండి డెహ్రాడూన్ చేరవచ్చు.

రైలు మార్గం
ఔలి కి 28 7 కి. మీ. ల దూరంలో కల హరిద్వార్ రైల్వే స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం
జోషి మట్ నుండి టాక్సీ లేదా బస్సు లలో ఔలి కి రోడ్డు మార్గంలో చేరవచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమీప నగరాలైన జోషి మట్, రిషి కేష్, హరిద్వార్, డెహ్రాడున్ ల నుండి ఔలి కి బస్సు లు నడుపుతుంది.

భవిష్య బదరి

భవిష్య బదరి

భవిష్య బదరి ఔలి లో ఒక పర్యాటక ఆకర్షణ. ఇక్కడకు కాలి నడకన తపోవన్ నుండి చేరాలి. ఈ ప్రదేశం దట్టమైన అడవి మధ్యలో కలదు. సముద్ర మట్టానికి సుమారు మూడు వేల మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం అయిదు బదరి పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ కల దేవాలయంలో నరసింహ స్వామీ మరియు విష్ణు మూర్తి విగ్రహాలు కలవు. ఈ ప్రదేశానికి యాత్రికులు ట్రెక్కింగ్ లో చేరాలి.
Photo Courtesy: Ishan Manjrekar

ఔలి కృత్రిమ సరస్సు

ఔలి కృత్రిమ సరస్సు

ఔలి లో తప్పక సందర్శించవలసిన ప్రదేశం, సముద్ర మట్టానికి అధిక ఎత్తులో కల ఔలి కృత్రిమ సరస్సు. ఈ సరస్సును ప్రభుత్వం స్కయింగ్ ప్రదేశాలలో మంచు తక్కువ కురిసే సమయంలో కృత్రిమ మంచు కొరకు ఏర్పరిచింది. దీని వలన స్కయింగ్ సీజన్ అధిక కాలం వుంటుంది. ఔలి లో చూసేందుకు అనేక ప్రదేశాలు కలవు. మంచుతో నిండిన ఏటవాలు ప్రదేశాలలో నడిచేటపుడు పర్యాటకులు అద్భుతమైన నందా దేవి, మానస పర్వత, కామత్ పర్వత శ్రేణులు చూసి ఆనందించవచ్చు. పర్యాటకులు ఇక్కడ కల ఆపిల్ తోటలు, పచ్చటి దేవ దారు చెట్ల వరుసల దృశ్యాలను ఆనందించవచ్చు.
Photo Courtesy: Fowler&fowler

నంద ప్రయాగ్

నంద ప్రయాగ్

ఔలి లో నంద ప్రయాగ్ మరొక పర్యాటక ఆకర్షణ. ఇది ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో కలదు. అలకనంద మరియు నందాకిని నదులు కలిసే ప్రదేశంలో ఈ ప్రదేశం కలదు. యాత్రకులు తమ పాపాలను పోగొట్టుకునేందుకు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. పురాణాల మేరకు, నంద ప్రయాగ్ యదు కుల వంశ రాజుల రాజధాని. ఇది ఐదు ప్రయాగ లలో ఒకటి. బదరీనాథ్ మరియు కేదార్ నాథ్ లు వెళ్ళుమార్గం లో ప్రవేశ ద్వారం గా వుంటుంది. నంద ప్రయాగ్ లో మంచుతో కప్పబడిన అనేక పర్వత దృశ్యాలు చూడవచ్చు.
Photo Courtesy: Sanjoy Ghosh

త్రిశూల్ శిఖరం, ఔలి

త్రిశూల్ శిఖరం, ఔలి

త్రిశూల్ శిఖరం సముద్ర మట్టానికి 23,490 అడుగుల ఎత్తున కలదు. ఔలి లో ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ శిఖరానికి ఈ పేరు శివ భగవానుడి కారణంగా పెట్టారు. ఈ శిఖరంలో కూడా స్కయింగ్ ప్రదేశాలు కలవు. ఇండి - టిబెట్ బోర్డర్ పోలీస్ లకు ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. రూప్ కుండ్ సరస్సు శిఖర దిగువ భాగంలో కలదు.
Photo Courtesy: Anuj Kumar Garg

గుర్సో బుగ్యాల్

గుర్సో బుగ్యాల్

గుర్సో బుగ్యాల్ ఔలి లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది సముద్ర మట్టా నికి సుమారు మూడు వేల మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం దట్టమైన ఓక్ వృక్షాలతో కప్పబడి వుంటుంది. దీనిని చేరాలంటే, జోషి మట్ నుండి రోప్ వే మార్గంలో చేరాలి. గుర్సో బుగ్యాల్ నుండి ఒక కిలో మీటర్ దూరంలో కల చట్టార్ కుండ్ మరొక పర్యాటక ఆకర్షణ. ఈ సరస్సు నీరు స్వచ్చంగానూ మరియు తియ్య గాను వుంటుంది.
Photo Courtesy: Michael Scalet

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+