Search
  • Follow NativePlanet
Share
» »పిల్లల కొరకు బెంగుళూరు ... !

పిల్లల కొరకు బెంగుళూరు ... !

బెంగుళూరు నగరం సాధారణంగా పిల్లలకు ఆనందం కలిగించదని భావిస్తూ వుంటారు. ఎక్కడ చూసినా పెద్దలకు మాత్రమే విందులు, వినోదాలు, ఐ.టి. పార్కులు మొదలనవి కనపడుతూ వుంటాయి. అయితే, పిల్లలకే కాదు, మీలోని పిల్ల మనసులకు కూడా ఆసక్తి పుట్టించే కొన్ని ప్రదేశాలు బెంగుళూరు నగరం కలిగి వుంది. మరి అవేమిటో పరిశీలిద్దాం.

పిల్లలకు, పెద్దలకు ఒకే రకం ఆనందాలు కలిగించే వాటిలో బెంగుళూరు లో కల బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ ఒకటి. ఒక్కసారి ఈ పార్క్ లో ప్రవేశిస్తే, చిన్నలు, పెద్దలూ ఒకటై పోవాల్సిందే. ఇక్కడ అనేక జంతువులు, పక్షులు ఎన్నో ఆసక్తి కలిగిస్తాయి. పిల్లలకు మరొక ఆకర్షణ బెంగుళూరు లోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం. ఈ మ్యూజియం సందర్సన, పిల్లలు ఎల్లపుడూ చూసే సాధారణ సినిమాలు లేదా ఫుడ్ జాయింట్ ల కంటే విభిన్నంగా వుంటుంది.

పిల్లలకు మరొక ఆకర్షణ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వారి మ్యూజియం. ఇది ఇండియా లో మొట్ట మొదటి ఏరో స్పేస్ మ్యూజియం. మీ పిల్లవాడికి ఆసక్తి కలిగి ఒక ఆస్ట్రోనాట్ లేదా పైలట్ అవ్వాలంటే, దీనిని చూపించండి. ఈ మ్యూజియం చూస్తె చాలు, పిల్లల లో అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తి వారి సృజనాత్మకత మరింత అధికం కావలిసిందే. ఫ్లైట్ సిము లెటర్ లు, మాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లు మీ పిల్లలను ఆనందింప చేస్తాయి.

కబ్బన్ పార్క్

కబ్బన్ పార్క్

సిటీ లో ఒక పచ్చటి ప్రదేశం. దీనిలో ఒక లైబ్రరీ, మ్యూజియం, ఒక టాయ్ ట్రైన్ అనేక విగ్రహాలు, నీడ పట్టున కూర్చునే ప్రదేశాలు కలవు.
ఉదయాలు, సాయంత్రాలు, జాగర్లకు కబ్బన్ పార్క్ ఒక స్వర్గం వలే వుంటుంది.

వండర్ లా అమ్యూజిమేంట్ పార్క్

వండర్ లా అమ్యూజిమేంట్ పార్క్

వండర్ లా అమ్యూజిమేంట్ పార్క్ పిల్లలు తప్పక ఆనందిస్తారు.. ఇది పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ రక రకాల రైడ్ లు వివిధ సైజు లలో వుంటాయి. పిల్లల భద్రత కొరకు మీరు వారితో కలిసి కూడా వీటిని ఆనందించవచ్చు. ఈ ప్రదేశం బెంగుళూరు లో పిల్లలతో తప్పక చూడ దగినది.

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజ్లియం

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజ్లియం

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజ్లియం లో సైన్సు విషయాలు అధికంగాను, మ్యూజియం అంశాలు తక్క్కువగాను వుంటాయి. పిల్లలక్లు సైన్సు పట్ల ఆసక్తి కలిగించాలంటే ఇది ఒక మంచి ప్రదేశం. ఇక్కడ అనేక గాలరీ లు కలవు. స్పేస్ గాలరీ, సైన్సు ఫర్ చిల్ద్రెన్ గాలరీ, ఫన్ సైన్సు గాలరీ, ఎలెక్ట్రో గాలరీ వర్చువల్ గేమ్ ఏరియా వంటివి అసలు మిస్ కాకండి. ఈ మ్యూజియం అన్ని రోజులలో ఉదయం 10 గం . నుండి సా. 6 గం. వరకు తెరచి వుంటుంది. దీనిని పూర్తిగా చూడాలంటే కనీసం మూడు గంటలనుండి నాలుగు గంటల సమయం పడుతుంది.

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్

ఒక ఎలుగుబంటి, ఒక సింహం లేదా ఏనుగు చూసి ఆనందించని పిల్లలు ఎవరు వుంటారు ? ఈ నేషనల్ పార్క్ లో కల వివిధ జంతువులు సమీపం నుండి చూసి ఆనందించండి. ఈ పార్క్ పూర్తిగా చూసిన తర్వాత అక్కడే సమీపం లో కల బటర్ ఫ్లై పార్క్ కు వెళ్లి, అవి వాటి సహజ వాతావరణం లో స్వేచ్చగా ఎగరటం చూసి ఆనందించండి. ఈ పార్క్ ఉదయం 9 గం. నుండి సా. 5 గం. వరకూ తెరచి వుంటుంది.

లాల్ బాగ్ బోటానికాల్ గార్డెన్

లాల్ బాగ్ బోటానికాల్ గార్డెన్

ప్రకృతి తో కలసి పులకించి పోవాలను కుంటున్నారా? , వెంటనే లాల్ బాగ్ కు వెళ్ళండి. ఇది బెంగుళూరు లో సుమారు 240 ఎకరాల విస్తీర్ణంలో కల బొటనికల్ గార్డెన్. దీనిలో సుమారు వెయ్యి రకాల మొక్కలు ఎన్నో వందల ఎల్లా నాటి పురాతన వృక్షాలు కలవు. ఇక్కడ కల చెట్ల నీడలో, అక్కడే కల ఒక చిన్న సరస్సు ఒడ్డున మీ పిల్లలు త్లప్పక ఆనందిస్తారు.


More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+