Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బన్నెరఘట్ట

బన్నెరఘట్ట - హై టెక్ నగర సమీపంలో అతి సహజ ప్రదేశం 

10

మీరు బెంగుళూరులో ఉంటూ వారాంతపు సెలవులకు ప్రదేశాన్ని అన్వేషిస్తూంటే, బన్నెరఘట్ట తప్పకసందర్శించండి.  ఈ ప్రదేశం చాలా ప్రధానమైంది. చాలామంది ప్రపంచ పర్యాటకులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించి ఆనందిస్తారు. బన్నెరఘట్టలో వైల్డ్ లైఫ్ పార్క్ ఎంతో ఆకర్షణ. ఇది బెంగుళూరు నగరానికి షుమారు 22 కి.మీ. దూరంలో ఉంది. సుమారు 104 చ. కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దీనిలో పది రిజర్వు అడవులు అనేకల్ ప్రాంతానికి చెందుతూ బెంగుళూరు అటవీ విభాగంలో ఉన్నాయి.

ఈ పార్కును 1971 లో స్ధాపించారు. ప్రకృతి సంరక్షణ, ఒక జంతు ప్రదర్శన శాల, ఒక పిల్లల పార్కు, ఒక అక్వేరియం, ఒక మొసళ్ళ పార్కు, ఒక మ్యూజియం, బటర్ ఫ్లై పార్క్, స్నేక్ పార్క్ మరియు పెంపుడు జంతువుల స్ధలం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఫారెస్ట్ లో ఎన్నో ఆకురాలు చెట్లు, ముళ్ళ పొదలు కూడా ఉన్నాయి.

బన్నెరఘట్టలో ప్రధాన ఆకర్షణ అంటే పెద్దపులులు. సింహాలను కూడా పార్క్ లో చూడగలము. అటవీ శాఖ సింహాలు, పులుల ప్రదర్శన ఎంతో ఆకర్షణీయంగా నిర్వహిస్తుంది. పెద్దపులులు, సింహాలే కాక ఇతర జంతువులను కూడా చూడవచ్చు.

ఈ రిజర్వు అడవి సుమారు 25,000 ఎకరాలలో ఉండి పెద్దపులులకు, సింహాలకు, చిరుతలకు, అడవి దున్నలకు, లేడి పిల్లలకు, ఎలుగుబంటులకు, పక్షులకు, సీతా కోక చిలుకలకు నిలయంగా ఉంది. సందర్శకులు దీనిలో చిరుతలు, అరుదుగా కనపడే తెలుపు పెద్దపులులు, బెంగాల్ పులులు, రాచరిక ఠీవికల సింహాలను కూడా చూడవచ్చు. ఈ ప్రాంతం ప్రధానంగా పార్కు జంతువుల రక్షణకు వినియోగిస్తారు. ఈ జంతువులు దేశంలోని వివిధ ప్రదేశాలనుండి వచ్చి ఇక్కడ సంరక్షించబడతాయి.  

ఇతర ప్రధాన ఆకర్షణలలో, బన్నెరఘట్ట బటర్ ఫ్లై పార్క్ దేశంలోనే మొదటిదిగా చెప్పవచ్చు. దీనిని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ 2006లో ప్రారంభోత్సవం చేశారు. ఈ బటర్ ఫ్లై పార్క్ సుమారుగా 7.5 ఎరరాలలో విస్తరించింది. దీనిలో సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఇవి షుమారుగా 20 రకాల సీతాకోక చిలుక జాతులను ఆకర్షిస్తున్నాయి.   

బన్నెరఘట్ట ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బన్నెరఘట్ట వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బన్నెరఘట్ట

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బన్నెరఘట్ట

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు లేదా బస్ ప్రయాణం ఎలా? బెంగుళూరు మరియు బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ల మధ్య కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్ సర్వీసులను నిర్వహిస్తోంది. లేదా పర్యాటకులు బెంగుళూరు విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ నుండి బన్నెరఘట్ట వెళ్ళేందుకు టాక్సీలు, క్యాబ్ లు అద్దెకు తీసుకుని వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం బన్నెరఘట్టకు రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ అంటే బెంగుళూరు రైల్వే స్టేషన్ మాత్రమే ఇది సుమారు 27 కి.మీ. దూరంలో ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అంటే ముంబై, ఢిల్లీ, కోల్ కటా, చెన్నై వంటి నగరాలకు ఇతర పట్టణాలకు కలుపబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం బన్నెర ఘట్ట పార్కు కు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రం అతి దగ్గరలో ఉంది. ఇక్కడినుండి దేశీయంగాను అంతర్జాతీయంగాను విమానాలు ప్రయాణిస్తాయి. ఇది షుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం దేశంలోని ప్రధాన నగరాలకే కాక, ఐరోపా, ఆసియా, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా కలుపబడింది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue