Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం !

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం !

ఒకప్పుడు, అందాల నగరం బెంగుళూరు ను 'సరస్సుల నగరం'గా పిలిచేవారు. కాని నేడు ఈ నగరం పట్టణ అభివృద్ధి , నాగరీకతల పేరుతో ఆ పేరు మాయా మై నగరం కొన్ని ప్రాంతాలలో కనీస పారిశుధ్యం సైతం లోపించి కొట్టు మిట్టాడు తోంది. నగరంలోని నాటి సరస్సులు, బెంగుళూరు ఆహ్లాద వాతావరణానికి, బెంగుళూరు పేరు ప్రతిష్టలకు దోహద పడ్డాయి. 1960 సంవత్సరం లో ఈ నగరం లో మొత్తంగా 280 సరస్సులు ఉండేవని చెపుతారు.

సుమారు 30 ఏళ్ళు గడిచేసరికి ఈ సంఖ్యా 80 కంటే తక్కువకు పడి పోయింది. నేడు, నగరంలో, ప్రభుత్వ నిర్వహణ కంటే కూడా, స్వచ్చంద సంస్థల, ప్రైవేటు వ్యక్తుల నిర్వహణా సహకారంతో 17 సరస్సులు మాత్రం కలవు. బెంగుళూరు నగరం నా నాటికి ప్రకృతి కి దూరమై పోతున్నదనేది ఒక భరించలేని వాస్తవం.

ఒకప్పుడు సరస్సులు కారణంగా అనేక రకాల పక్షులు నగరానికి వచ్చేవి. కాని, ప్రసిద్ధ సరస్సులు, బస్సు స్టాండ్ లు గాను లేదా గోల్ఫ్ కోర్స్ లు గాను మార్చి వేయటంతో వాటి వలసలు ఆగి పోయాయి. పూర్వపు బెంగుళూరు అందాలు కనుమరుగయ్యాయి. సరస్సుల పర్యావరణ అసమతుల్యత ఏర్పడింది. ఇక మిగిలిన సరస్సులను సంరక్షించేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇపుడు మిగిలిన సరస్సులు కూడా ఎంతో అందమైనవి. వాటి గురించి కొంత తెలుసుకుందాం.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!
బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

ఈ సరస్సు గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. ఉల్సూర్ లేక్ బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు కెంపే గౌడా కాలం నాటిది. అయితే, నేడు మనం ఈ మాత్రం చూస్తున్న ఉల్సూర్ లేక్ కు ఆ నాటి బెంగుళూరు కమిషనర్ సర్ లెవిన్ బెంథం బౌరింగ్ అని చెపుతారు. ఈ సరస్సు నగరంలో ప్రసిద్ధి చెందినా ఎం జి రోడ్ సమీపంలో తూర్పు బెంగుళూరు లో కలదు.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

ఇది ఒక అందమైన మానవ నిర్మిత సరస్సు. దీనిని నిర్మించినవాడు కల్నల్ రిచర్డ్ హీరాం సాంకీ. ఈ సరస్సును గతం లో గంధధ కోటి కేరే అనేవారు. దీనికి కారణం సరస్సు కు పక్కనే ఒక శాండల్ వుడ్ డిపో వుండేది. ప్రశాంతమైన ఈ వాతావరణం లో ఇపుడు ఒక జాగర్స్ క్లబ్ నడుపుతున్నారు. పరిసరాలు ఎంతో అందమైన దృశ్యాలు అందిస్తాయి.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

నవంబర్ - డిసెంబర్ నెలలు వచ్చాయంటే చాలు మదివాల సరస్సుకు స్పాట్ బిల్ల్ద్ పెలికన్స్ వంటి పక్షులు వివిధ ప్రదేశాల నుండి వచ్చి విశ్రాంతి పొందుతాయి. ఇక్కడ చాలామంది ఈ ప్రాంతంలో అవి ఆకాశంలో ఎగరటం చూస్తూనే వుంటారు. సరస్సు పర్యావరణ విధానం నిర్వహణా లోపం వలన సరస్సు పూర్వ వైభవం కోల్పోయింది.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

హేబ్బాల్ సరస్సు చాలా పురాతన మైనది. బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు కెంపే గౌడా 1537 లో నిర్మించిన మూడు సరస్సులలో ఒకటి. ఈ సరస్సు నీరు పూర్తిగా మురుగు నీటి కాలుష్యంతో తన పూర్వపు అందాలను నిర్మలతలను కోల్పోయింది. మురుగు నీరు వివిధ ప్రదేశాల నుండి వచ్చి ఇందులో చేరుతుంది. ఈ సరస్సు కు కూడా వివిధ రకాల పక్షులు వలస వస్తాయి. ప్రశాంతత కోరే బెంగుళూరు బిజి జీవులకు ఈ పరిసరాలు ఎంతో ఊరటనిస్తాయి.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

లాల్ బాగ్ లేక్ బెంగుళూరు లోని అన్ని సరస్సుల లోకి ప్రసిద్ధి చెందినది. లాల్ బాగ్ లేక్ బెంగుళూరు దక్షిణ ప్రాంతంలో కలదు. ఈ సరస్సు ప్రసిద్ధ లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్ లో కలదు. నగరాని వచ్చే పర్యాటకులు తమ లాల్ బాగ్ సందర్శనలో ఈ సరస్సు ఒడ్డున కొంచెం సమయం తప్పక రిలాక్స్ అవుతారు.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

అందం అవసరం రెండూ కలిస్తే ఎలా వుంటాయి అనేది మీకు హీసర ఘట్ట లేక్ చూస్తె తెలుస్తుంది. బెంగుళూరు కు వాయువ్య దిశగా వున్నా ఈ సరస్సు ఒక మానవ నిర్మిత నీటి సరస్సు. నగర నీటి అవసరాలకు ఈ సరస్సు నిర్మించబడింది. మైసూరు రాజ్య దీవాన్ సర్ క్. శేషాద్రి అయ్యర్ ఈ సరస్సు ను అర్కావతి నది పై నిర్మించారు. ఈ సరస్సు సమీపంలోనే టి జి హళ్లి డాం కలదు. సందర్శకులకు ఆనందాన్ని ఇచ్చే ఈ సరస్సు కు ప్రతి చలి కాలంలో అనేక పక్షులు వస్తాయి.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు కు ఆగ్నేయంగా కల ఈ సరస్సు పర్యాటకులకు అంది పుచ్చుకున్నట్లు గా వుంటుంది. సిటీ సరస్సు లలో ఇది పెద్దది. సుమారు 37,000 ఎకరాలలో విస్తరించి వుంటుంది. దురదృష్టవశాత్తూ ఇపుడు ఈ సరస్సు పిచ్చి మొక్కలతో నిండి, కలుషి తమై పర్యాటకులకు కూడా దూరం అయ్యింది.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

వర్తూర్ లేక్ బెంగుళూరు కు తూర్పు భాగం లో కలదు. ఈ సరస్సు ఇపుడు పూర్తిగా కాలుష్యంతో నిండి వుంది. ఒక పురాతన అవశేషం వాలే వుంటుంది. మానవ నిర్మిత ఈ సరస్సు సుమారు వేయి సంవత్సరాల నాటిది. ఆనాడు పాలించిన గంగ రాజులు ఈ సరస్సు ను వ్యవసాయ అవసరాలకు నిర్మించారు.

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

బెంగుళూరు - సరస్సులు మరచిన నగరం!

అగర సరస్సు బెంగుళూరు దక్షిణ భాగంలో కలదు. ఈ సరస్సు అగర గ్రామ పంచాయత్ పాలనా క్రింద నిర్వహించబడుతోంది. ఈ లేక్ హెచ్ ఎస్ ఆర్ లే అవుట్ సమీపంలో కలదు. అందమైన ఈ సరస్సు అనేకమంది సందర్శకులను ఆహ్వానిస్తూ వుంటుంది. ఈ ప్రదేశం లో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం లు ఆహ్లాదకరంగా వుంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+