Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు లో స్ట్రీట్ ఫుడ్ !

బెంగుళూరు లో స్ట్రీట్ ఫుడ్ !

బెంగుళూరు నగరంలో స్ట్రీట్ ఫుడ్ గురించి ఆలోచిస్తే, మీకు వెంటనే గుర్తుకు వచ్చేది నోటి రుచులూరే మసాలా పానీ పూరీలు, మరింత రుచికర చాట్ లు. బెంగుళూరు నగరం స్ట్రీట్ ఫుడ్ కు ఫేమస్ అయిన బెస్ట్ ప్రదేశాలు కలిగి వుంది. బెంగుళూరు లో స్థానికంగా వుండే వారు కూడా ఈ తిండి ప్రదేశాలలో నగరానికి చూసేందుకు వచ్చిన పర్యాటకులతో పాటుగా ఆహారాలు తిని ఆనందిస్తారు.

 మంచి రుచి ...ధరలు చవక !

బెంగుళూరు లో కొన్ని వీధులలో కల దుకాణాలలో ఆహారాలు మంచి రుచికరంగా వుంటాయి. ఈ స్ట్రీట్ లు చాలా ఫేమస్. మీరు కనుక ఆహార ప్రియులైతే, ఈ నగరం లో కొన్ని మంచి ప్రదేశాలలో కల నోటి రుచులూరే ఆరోగ్యకర స్ట్రీట్ ఫుడ్స్ తిని ఆనందిన్చేయండి. నగరంలోని కొన్ని అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ దుకాణాలను మీకు అందిస్తున్నాం పరిశీలించండి.

తిండి వీధి, వి వి పురం
ఈ స్ట్రీట్ బెంగుళూరు లోని వి వి పురం, లోని సజ్జన్ రావు సర్కిల్ లో కలదు. ఇక్కడ వీధి మొత్తం సాయంత్రాలు తిండి ప్రియులతో కిక్కిరిసి వుంటుంది. ఇక్కడ ఎన్నో దుకాణాలు కలవు. ఈ దుకాణాలు ఒక దాని పక్కన ఒకటిగా వుండి, వచ్చే వారికి చాలా స్పీడ్ గా కోరిన ఐటమ్స్ అందిస్తాయి. వారి నోటి రుచులను తీర్చేస్తాయి. ఇక్కడ బెస్ట్ దుకాణాలు అంటే అవి వి.బి.బేకరి, ఇక్కడ మీకు హనీ కేక్స్ మరియు కర్రీ పఫ్ఫ్, దొరుకుతాయి.

 మంచి రుచి ...ధరలు చవక !

శివన్న గుల్ఖండ్ సెంటర్ - ఇక్కడ మీకు గుల్ఖండ్ మంచి నాణ్యత కలది ఐస్ క్రీం తో దొరుకుతుంది.

రాము టిఫిన్ సెంటర్ లో మీకు నెయ్యి వేసిన మసాలా దోశ లు అద్భుత రుచి గా వుంటాయి.

మల్లేస్వరం లోని సెంట్రల్ టిఫిన్ రూమ్ స్ట్రీట్ ఫుడ్ కు మరొక మంచి ప్రదేశం. మీరు దోస లు ఇష్టపదేవారైతే, ఈ ప్రదేశం మిస్ కాకండి. ఈ సెంట్రల్ టిఫిన్ రూమ్ మల్లేస్వరం లోని మార్గోసా రోడ్ లో కలదు. ఈ దుకాణం సుమారు ఆరు శతాబ్దాలకు పైగా ఈ టిఫిన్ లు అందిస్తోంది. నేటికి ఇక్కడకు అధిక జనాలు వచ్చి తిని వెళతారు. ఇక్కడ వెన్న వేసిన మసాలా దోస ప్రసిద్ధి. ఇక్కడ దోసలే కాక, ఇడ్లి వడ, కేసరి బాత్, పూరి సాగు మొదలైనవి కూడా వుంటాయి.

రాకేశ్ కుమార్ పానీ పూరి స్టాల్, జయనగర్
పాణి పూరి ని గోల్ ల్గాప్ప లేదా పుచ్కా అని కూడా అంటారు. స్ట్రీట్ ఫుడ్ ఇష్ట పడేవారు దీనిని తరచుగా తింటారు. జయనగర్ మూడవ బ్లాక్ లో గల ఈ దుకాణం ప్రత్యేకించి పానీ పూరి, చాట్లు మాత్రమే అందిస్తుంది. ఈ దుకాణాన్ని కొంతమంది రాజస్తానీయులు నడుపుతున్నారు. అసలు సిసలైన నార్త్ ఇండియన్ చాట్ లు వీరు అందిస్తారు. ఒక్కసారి ఇక్కడ మీరు పానీ పూరి తింటే , మరల మరల ఇక్కడకు వెళ్ళాల్సిందే. ఈ స్టాల్ లో ఇతర స్నాక్స్, దహి పూరి, ఆలూ చాట్ , పాపడి చాట్, మొదలైనవి కూడా వుంటాయి.

 మంచి రుచి ...ధరలు చవక !

బ్రాహ్మిన్స్ కాఫీ బార్, బసవనగుడి
రుచికర ఇడ్లీలు, ఇతర సాంప్రదాయ ఆహారాలు తినాలంటే, మీరు బ్రాహ్మిన్స్ కాఫీ బార్ కు వెళ్ళాలి. ఇది బసవనగుడి లోని శంకరాపురం లో శంకర్ మఠం సమీపంలో కలదు. ఇక్కడ దొరికే వేడి వేడి ఇడ్లీలు మెత్తగా రుచికరంగా వుండి మీరు ఒకటి లేదా రెండు తింటే చాలవు. ఇక్కడ ఇడ్లీ లే కాక, టీ, కాఫీ, కేసరిబాత్, మొదలైనవి కూడా దొరుకుతాయి.

హరి సూపర్ సాండ్విచ్, జయనగర్
సాండ్విచ్ ప్రియులకు ఈ ప్రదేశం బాగా వుంటుంది. ఇది జయనగర్ మూడవ బ్లాక్ లో కలదు. దీని సమీపంలోని మరొక దుకాణంలో వీరు చాట్లు కూడా అమ్ముతారు. ఇక్కడ వెజిటబుల్ సాండ్ విచ్ , అమెరికన్ స్వీట్ కార్న్ చాక్ లేట్ సాండ్ విచ్ వంటివి ప్రత్యేక రుచులలో దొరుకుతాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+