Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు పరిసరాలు - సైకిల్ మార్గాలు !

బెంగుళూరు పరిసరాలు - సైకిల్ మార్గాలు !

బెంగుళూరు పూర్వకాలంలో గార్డెన్ సిటీ అని పిలువబడేది. పచ్చని చెట్లతో, కాలుష్య రహిత వీధులు, అనేక సరస్సులు, తోటలతో అందంగా వుండేది. ఈ గార్డెన్ సిటీ లోని తాజా గాలులు, పచ్చదనం వెరైటీ గా వుండే సైకిల్ ప్రయాణానికి ఎంతో బాగుంటాయి. నేటికీ ట్రాఫిక్ ఎంత పెరిగినప్పటికీ, ఇక్కడ కల చక్కని రోడ్ల నిర్వహణ సైకిల్ ప్రయాణ ఆసక్తి దారులకు ఎంతో ఉత్సాహం పుట్టిస్తుంది. నగరంలో కొన్ని మార్గాలు సైకిల్ ప్రయాణానికి ఎంతో అనుకూలం. సైకిల్ నడపటంలోని ఉత్సాహం అనుభవించాలంటే, మీ స్నేహితులతో కలసి బెంగుళూరు లోని కొన్ని వీధులు ట్రయల్ బేసిస్ గా సంచరించండి. ఆ పై మా నేటివ్ ప్లానెట్ వెబ్ సైట్ చెప్పినది నిజమో కాదో పరిశీలించండి.

నగరంలోనే కాక నగరం చుట్టుపట్ల కల మరి కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు సైతం వేసవి సెలవులలో సైకిల్ పై చుట్టి రావచ్చు. మీ శారీరక ధృడత్వం పరీక్షించుకోనవచ్చు. మరో వైపు స్నేహితులతో కలసి ఖర్చులేని, కాలుష్య రహిత ప్రయానంచేస్తూ ఆనందించవచ్చు. మరి సైకిల్ పై సంచరించగల నగర చుట్టుపట్ల కల ప్రదేశాలు ఏవి అనేది పరిశీలిద్దాం.

మంచిన బేలే డాం

మంచిన బేలే డాం

మంచినబెలె డాం అందమైన మైసూరు రోడ్ చివరలో ప్రసిద్ధ బ్రహ్మాండమైన బనయాన్ చెట్టు వద్ద సావన్ దుర్గ కు సమీపంలో కలదు. డాం కు వెళ్ళే మార్గంలో మీరు ఇస్రో సాటేలైట్ టవర్స్ చూడవచ్చు. ఉల్లాసం కలిగించే ఈ ట్రిప్ ఒక వీక్ ఎండ్ లో చేయవచ్చు.

నారాయణ కేరే

నారాయణ కేరే

ఈ సరస్సు చాలా మందికి తెలియదు. కాని ఇక్కడకు మీ సైకిల్ టూర్ చాలా బాగుంటుంది. ఎలా వెళ్ళాలి ? సర్జాపూర్ రోడ్ పై మీ సైకిల్ ప్రయాణం మొదలు పెట్టండి. పేరు గాంచిన చిక్క తిరుపతి టెంపుల్ చేరుకొండి. అక్కడ నుండి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు నారాయణ కేరే సరస్సు వస్తుంది. సరస్సు తీరంలో చల్ల గాలులు ఆస్వాదించండి.
Photo Courtesy: modi.kumar

 చక్కని మార్గాలు - సైకిల్ ఆనందాలు !

చక్కని మార్గాలు - సైకిల్ ఆనందాలు !

ఈ సరస్సు బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ మార్గంలో కానివే మహాదేస్వర టెంపుల్ కు సమీపంలో కలదు.ఏ ట్రాఫిక్ సమస్యలు లేని ఈ మార్గం సైకిల్ అభిమానులకు ఆనందం కలిగిస్తుంది. తేలికగా చేరేలా చేస్తుంది. ఈ ప్రదేశానికి అందరకూ తెలిసిన కనకపుర రోడ్ కంటే, రాగి హళ్లి మరియు బన్నెర ఘట్ట మార్గాలలో చేరటం మరింత తేలిక. మీరు అదృష్టవంతులైతే , ఈ మార్గంలో కొన్ని అరుదైన పక్షులు కూడా చూడవచ్చు.
Photo Courtesy: modi.kumar

తూరహళ్లి ఫారెస్ట్ వెల్

తూరహళ్లి ఫారెస్ట్ వెల్

బెంగుళూరు నివాసులకు ఈ సైకిల్ మార్గం బాగా పరిచయమే. ఈ ప్రదేశం కనకపుర రోడ్ చివరి లో కలదు. ఇక్కడకు చేరాలంటే, ఉత్తరహళ్లి లేదా బనశంకరి మార్గాలలో చేరాలి.

Photo Courtesy: modi.kumar

నంది హిల్స్

నంది హిల్స్

నంది హిల్స్ కు వెళ్ళే సైకిల్ మార్గం చాలా ఫేమస్ మార్గం. అంతే కాదు ఎక్కువ దూరం కూడాను. సన్నని వంపులు, చక్కని రోడ్డు, ఉత్సాహంతో కొండపైకి బలంగా సైకిల్ నడపటం చాలా మంది యువకులకు సరదాగా వుంటుంది.
Photo Courtesy: Harsha K R

హీసర ఘట్ట సరస్సు

హీసర ఘట్ట సరస్సు

హీసర ఘట్ట కు వెళ్ళాలంటే, మెయిన్ రోడ్ లో కూడా తేలికగా ప్రయాణించవచ్చు. ముందుగా గోరుగుంట పాల్య మార్గంలో ప్రయానించండి, అక్కడ నుండి న్రిత్య గ్రామ వైపు వెళ్ళే మార్గంలో ప్రయానించండి. హీసర ఘట్ట గ్రామ అందాలు పరిసరాలు మిమ్ములను పూర్తి గా విశ్రాంతి తీసుకునేలా చేస్తాయి.

Photo Courtesy: 'SandFlash

జయనగర్

జయనగర్

వావ్...ఈ ప్రదేశం బెంగుళూరు నగరంలోనే వుంది. ఈ ప్రదేశం అంతా చక్కని సైకిల్ మార్గాలతో గుర్తించబడి ప్రత్యేక లేన్ లు కలిగి వుంది. ఒక్కసారి జయనగర్ లోని ఈ సైకిల్ మార్గాలలో సైకిల్ నడిపి, మీ నగర సంచార ఆసక్తి, సైకిల్ నడపాలనే ఉత్సాహం రెట్టింపు చేసుకొనండి.
Photo Courtesy: Andreas Kambanis

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+