భారత దేశం గురించి చెప్పాలంటే చెప్పలేనన్ని విశేషాలు ఉన్నాయి. మన దేశం ఒక సమ్మీలిత సాగరం. ఈ దేశంలో ఎవ్వరైనా జీవించవచ్చు, దేశం మొత్తం మీద ఎక్కడైనా తిరగేయొచ్చు. ఇక్కడ లెక్కలెన్ని అనుభూతులు అనుభవించవచ్చు.
మేక్మైట్రిప్ ఆఫర్లు : రూ. 2000 ప్రోమో తో దేశీయ హోటళ్ళను బుక్ చేసుకోండి
మీరే చెప్పండి ..! ఉదాహరణకి ఈఫిల్ టవర్ చూస్తే మీరేమంటారు ?? అబ్బో ఎంత ఎత్తుగా ఉందో అని అంటారా? లేదా?, అలాగే మన రాష్ట్రం లో ఉన్న శ్రీశైలం డ్యామ్ ని చూస్తే ఎంత లోతైనదో అని, నాగార్జున సాగర్ ని చూస్తే ఎంత పొడవైనదో అని అంటుంటాము. ఇలాగే మన బారత దేశంలో కూడా చెప్పుకుంటూ పోతే లోతైనవి, పొడవైనవి, పెద్దవి ... ఇలా ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా ..!

సుందర్ బన్స్
సుందర్బన్స్, భారతదేశం - బంగ్లాదేశ్ మధ్య విభజించబడిన ఒక పెద్ద మడ అడవుల రిజర్వ్ ప్రాంతం అయినప్పటికీ ఈ నేషనల్ పార్క్ ఎక్కువ భాగం బంగ్లాదేశ్ లో ఉంది, 1/3 వ వంతు భారతదేశంలో ఉంది. ఇక్కడ పర్యాటక సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సుందర్బన్స్ కి రాష్ట్ర రాజధాని కోల్కతా నుండి ప్రతిరోజూ కార్లు, బస్సులు నడుస్తాయి. స్థానిక రెస్టారెంట్లు, రెస్ట్ హౌస్ లు రుచికరమైన స్థానిక ఆహారాన్ని, కొన్ని చాలా తనివితీర్చే సముద్ర జీవుల ఆహారాన్ని అందిస్తాయి.
Photo Courtesy: joiseyshowaa

లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)
సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు జిల్లా కూడా. దీనికి "ఆఖరి శాంగ్రి లా" ( ది లాస్ట్ శాంగ్రి లా) , " చిట్టి టిబెట్" ( లిటిల్ టిబెట్), " చంద్ర ప్రదేశం" ( ది మూన్ ల్యాండ్), " విరిగిన చంద్రుడు" ( ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు.
Photo Courtesy: sandeepachetan.com travel photography

మథుర (ఉత్తర ప్రదేశ్)
మథుర లో దేశంలో కెల్లా అతి పెద్ద రిఫైనరీ పరిశ్రమ ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ. యమునా నది ఒడ్డున కల మధుర భారతీయ సంస్కృతి మరియు నాగరికతలకు కేంద్రంగా వుంటుంది. ఈ దేశంలో చాలా మంది ప్రశాంత జీవనానికి ఇక్కడ కల ఆశ్రమాలకు వచ్చి ఆనందిస్తారు. ఇక్కడ కల శ్రీ కృష్ణ జన్మ భూమి టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు.
Photo Courtesy: Kendash1987

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
ఇగ్నో విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది. ఈ విద్యాలయం దేశంలో ఉన్న విద్యాలయాలన్నింటిలో అతి పెద్దది. సుమారు దేశం మొత్తం మీద 3 మిలియన్ మంది విద్యార్థులు ఈ విశ్వవిధ్యాలయం లోనే చదువుతుంటారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ లలో ఇగ్నో స్టడీ సెంటర్ లు ఉన్నాయి.
Photo Courtesy: ingou

సె కెథెడ్రల్ (పాత గోవా)
సె కెథెడ్రల్ చర్చి అలెగ్జాండ్రియా కేధరిన్ కు అంకితమైంది. సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా అనే పేరుగల ఈ చర్చి ఇండియాలో అతి పెద్ద చర్చిగా చెప్పవచ్చు. ఈ చర్చి కి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకించి క్రిస్టమస్ పండుగ సందర్భంలో అధిక సంఖ్యలో వస్తారు. ఈ చర్చి పొడవు సుమారు 250 అడుగులు వెడ్లపు 181 అడుగులు ఉండి 115 అడుగుల ఎత్తున గంభీరంగా ఉంటుంది. పది అంతస్తులకంటే అధిక ఎత్తు కలిగి ఉంటుంది.
Photo Courtesy: Amit Rawat

ముంబాయి
ముంబై లో దేశంలో కెల్లా పెద్ద నౌకాశ్రయం ఉంది. కనుకనే తరచూ గేట్ వే ఆఫ్ ఇండియా గా అభివర్ణిస్తారు. భారత దేశానికి ప్రధాన ఆర్థిక నగరమైన ముంబై, ఎప్పుడో 200 సంవత్సరాల కాలంలో పాలించిన బ్రిటీష్ కాలం నుంచి కూడా వన్నె తగ్గలేదు. ఇక్కడికి దుబాయ్, సౌదీఅరేబియా వంటి దేశాల నుంచే కాకుండా ఆఫ్రికా ఖండం లోని మరికొన్ని దేశాల నుంచి, ఐరోపా ఖండం నుండి ఫెర్రీ లు నడుస్తుంటాయి.
Photo Courtesy: claire.tomkins

అండమాన్ మరియు నికోబార్ దీవులు
అండమాన్ నికోబార్ దేశంలో కెల్లా పెద్ద దీవులు. ఈ దీవులు రాజధాని పోర్ట్ బ్లెయిర్. గుంపులు లేని ఒంటరి ప్రదేశాలలో మీరు విహరించాలంటే తప్పక ఈ దీవులకి వెళ్లాల్సిందే, వెళ్ళి ఆనందించాల్సిందే ..! మీకు ఇక్కడ లెక్కకు మించి బీచులు స్వాగతం పలుకుతాయి. వందలాది పక్షులు కిల కిల రాగాలు, పూల పరిమళాలు ప్రత్యేకించి కొత్త జంటలకు హనీమూన్ ఆనందాలను మరింత పెంచుతాయి.
Photo Courtesy: Show In My Eyes

కోల్ కతా
భారత దేశంలో తూర్పు భాగంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయిన కోల్ కత్తా వైశాల్యం రీత్యా అతి పెద్ద నగరం. ఈ నగరం లో సినిమా షూటింగ్ లు అనేకం జరుగుతుంటాయి. పురాతన కాలం నుంచి కూడా తూర్పు వర్తకానికి పెద్దదిక్కుగా ఈ నగరం వ్యవహరించినది.పురాతన కాలం నుంచి కూడా తూర్పు వార్తకానికి పెద్దాదిక్కుగా ఈ నగరం వ్యవహరించినది. ఇక్కడున్న విక్టోరియా మహల్, హౌరా వంతెన ఈ నగరానికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు.
Photo Courtesy: Christopher J. Fynn

తీహార్ (ఢిల్లీ)
భారత రాజధాని ఢిల్లీ లో ఉన్న చాణక్యపురి నుంచి ఏడంటే ఏడే కిలో మీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్ జైలు అని అంటారు. తీహార్ జైలు, భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊసలు లెక్కబెట్టారు.
Photo Courtesy: kiran

ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని శ్రీనగర్ లో నెలకొని ఉన్న వుల్లార్ సరస్సు భారతదేశం లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఇది వివిధ జాతుల పక్షులు మరియు చేపల కు ఆవాసం. సాధారణ గుండు చేప, రోజీ బార్బ్, దోమ చేప, క్రాసో చేలస్ లాటియస్ , వివిధ రకాల మంచు జల్ల చేపలు ఇక్కడ ఉంటాయి. చేప స్థానికుల ఆహారంలో ముఖ్యమైన భాగం.
Photo Courtesy: Maxx786

సాంబార్ (రాజస్థాన్)
సాంబార్ సరస్సు రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ పట్టణానికి 96 కి.మీ దూరంలో మరియు అజ్మీర్ నుండి 64 కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడ సముద్రపు నీరు లేకపోయినా ఇక్కడ ఉప్పును తయారు చేస్తారు. ఇది ఆరావళీ కొండల నడుమ ఉన్నది. వర్షములు పడ్డప్పుడు నీరు బాగా నిండుతుంది. కొండల మీద మడులు చేసి నీటిని నిలువ చేసి, నీటి మట్టం తగ్గినప్పుడు ఎండిపోయిన మడి నుండి ఉప్పును తయారుచేస్తారు.
Photo Courtesy: Nawanshu91

రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)
దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరే ఇతర రాజ్యాధినేత కు లేని నివాస గృహం (అధికారిక నివాసం) ఒక్క మన రాష్ట్రపతి కి మాత్రమే ఉంది. ఢిల్లీ లో ఈయన నివసించే గృహాన్ని రాష్ట్రపతి నిలయం అంటారు. దీని నిర్మాణంలో ఎక్కడా స్టీల్ ఉపయోగించకపోవడం గమనార్హం. మొత్తం 340 గదులతో నాలుగు అంతస్తులుగా ఉండే ఈ భవనం లో .... దర్బాలు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. దర్బారు హాలు జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు , అశోకా హాలు మంత్రుల ప్రమాణ స్వీకారణోత్సవాలకు, డైనింగు హాలులో ఒకేసారి 104 మంది కూర్చొని బోజనం చేయడానికి ఉపయోగిస్తారు.
Photo Courtesy: Manoj Kumar Gangadharan

జామా మసీదు (ఢిల్లీ)
భారత దేశంలో పురాతన మసీదులలో ఒకటైన జామా మసీదు ఢిల్లీ లో ఉన్నది. ఈ మసీదు దేశంలో కెల్లా అతి పెద్ద మసీదు గా చరిత్రకెక్కింది. రంజాన్, బక్రీద్ వంటి పండుగలనాడు ఈ మసీదు చూస్తే మీరు నివ్వెరపోతారు. మామూలుగా పవిత్ర రోజైన శుక్రవారం నాడు చేసే ప్రార్థనలకి ఒకేసారి పాతిక వేల మంది హాజరవుతుంటారు. 40 మీటర్ల ఎత్తుతో తెల్ల పాలరాయి మరియు ఎర్ర ఇసుకరాయితో చేసిన నాలుగు స్తంభాలు గల టవర్లున్నయి.
Photo Courtesy: Muhammad Mahdi Karim

గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
కర్నాటక రాష్ట్రం లోని బీజాపూర్ లో ఎంతో చారిత్రక ప్రాధాన్యతగల గోల్ గుంబజ్ ఉంది. ఇది భారత దేశంలో అతి పెద్ద సమాధి మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమాధి. బీజపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా సమాధి. ఈ డోమ్ లోపలి భాగాలు ఏ ఆధారం లేకుండా నిలవటం అనేది ఒక మిస్టరీగా ఉంటుంది. సంగీత గాయకులు ఇందులో కూర్చుని కచేరీ చేస్తే అది అన్ని వైపులా వినబడుతుంది.
Photo Courtesy: Mukulb

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంక్ లలో పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. ప్రధాన కేంద్రం ముంబై లో ఉన్నది.
Photo Courtesy: Wikimedia Commons free usage.

గోవింద సాగర్ (హిమాచల్ ప్రదేశ్)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో ప్రవహించే సట్లెజ్ నదిపై గోవింద్ సాగర్ అనే మానవనిర్మితమైన సరస్సు కలదు. ఇది దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు. ఇది బాక్రానంగల్ ఆనకట్ట వలన సాధ్యమైనది. ఇక్కడి వంతెనపైనున్న రహదారి ఆసియాలోనే రెండవ అతి పెద్ద వంతెన గా నిలిచింది.
Photo Courtesy: Vishal Majithia

శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం
ఆంధ్ర రాష్ట్రం లోని శ్రీశైలం పుణ్యక్షేత్రం లో చూడదగిన ప్రదేశాలలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు చూడొచ్చు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక దీనికి తోడు అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.
Photo Courtesy: Nori Syamsunder Rao

మజులి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)
సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం మజులి ద్వీపం. చరిత్ర, సంస్కృతితో నిండిన గొప్ప ప్రదేశం కావడంతో ఇది అస్సాం రాష్ట్ర ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. మజులి ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపమే కాక, నవీన వైష్ణవమతానికి అస్సాంలోనే పెద్ద పీట కల్గినది కూడా.
Photo Courtesy: Suraj Kumar Das

నేషనల్ లైబ్రరీ (కోల్ కతా)
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లేక భారత జాతీయ గ్రంథాలయం కోలకతా లోని బెల్వెడెరే ఎస్టేట్ లో కలదు. ఇది భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం గా రికార్డుకెక్కింది. ఈ గ్రంథాలయం సుందరమైన 30 ఎకరాల విస్తీర్ణంలో కలదు. ఇది 2.2 మిలియన్ల పుస్తకాల కంటే ఎక్కువ సేకరణతో భారతదేశంలో అతి పెద్దదిగా ఉంది. స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేది ఈ గ్రంథాలయం.
Photo Courtesy: Biswarup Ganguly

థార్ ఎడారి
థార్ ఎడారి భారత దేశానికి, పాకిస్థాన్ కి సరిహద్దులో 2 లక్షల పై చిలుకు చ. కి. మీ. లలో రాజస్థాన్ రాష్ట్రం లో విస్తరించి ఉంది. ఇది దేశంలో ఉన్న అతి పెద్ద ఎడారిగా గుర్తింపు పొందింది. అందుకే కాబోలు దీనిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో సహారా ఎడారి ఎలాగో ... మనకు ఇది అలాగనమాట !
Photo Courtesy: Flicka

సాంచి (మధ్యప్రదేశ్)
సాంచి స్థూపం భూపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి గ్రామం వద్ద ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశము. ఇక్కడ మూడు స్థూపాలు ఉన్నాయి. ఇక్కడున్న స్థూపాలు దేశంలో పొడవైనవి మరియు పెద్దదైనవి. వీటిని ప్రపంచంలో పురాతన స్థూపాలుగా ఒకటిగా పరిగణిస్తారు.
Photo Courtesy: Marc Shandro

జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా)
కలకత్తా లో ఉన్న జూలాజికల్ పార్క్ దేశంలో పురాతనమైనది మరియు పెద్దది. 1876 లో స్థాపించబడిన ఈ జూ ఎన్నో రకాల వైవిధ్యభరితమైన జంతుజాలంతో, పక్షులతో పర్యాటకులను ఆకట్టుకొంటుంది.
Photo Courtesy: Biswarup Ganguly

అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్)
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని అమర్‌నాథ్ లో ఉన్న అమర్‌నాథ్ గుహ దేశంలో పెద్దది. ఈ గుహలో సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివ లింగం ఉంటుంది. ఈ శివలింగం తరచూ పెరగడం, తరగడం జరుగుతుంది. ఈ మహా శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి హిందూ భక్తులు వస్తుంటారు. ఇక్కడే గణేషునికి, పార్వతీ దేవీ కి మంచులింగాలు ఉన్నాయి.
Photo Courtesy: Amita Sharma

నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా లోని హూగ్లీ నది ఒడ్డున నేషనల్ బొటానికల్ గార్డెన్ ఉంది. సుమారు 109 హెక్టార్లు విస్తరించి ఉన్న ఈ గార్డెన్ మన దేశంలోనే కాదు దక్షిణాసియాలోకెల్ల పెద్దది. ఇక్కడ ప్రపంచంలోనే పెద్దదైన మర్రి చెట్టు కూడా ఉంది. వివిధ దేశాల నుంచి తెచ్చిన ఎన్నో అరుదైన మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. ఇంతకీ ఈ బొటానికల్ గార్డెన్ వయస్సు మీకు తెలుసా ?? 226 సంవత్సరాలు పైమాటే ..!
Photo Courtesy: Jeroje

ఇండియన్ మ్యూజియం (కోల్ కతా)
కలకత్తా మహానగరంలో ఉన్న ఇండియన్ మ్యూజియం దేశంలో పెద్ద మ్యూజియం మరియు ప్రపంచంలో ఉన్న పురాతన మ్యూజియాలలో అరుదైనది. ఇందులో ఎన్నో అద్భుత కళా ఖండాలు ప్రదర్శనకై ఉంచారు. ఇది ఏర్పడి సుమారు రెండు వందల సంవత్సరాల పైనే అయ్యింది. ప్రస్తుతం మ్యూజియం భారత పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది.
Photo Courtesy: telugu native planet

స్వర్ణ దేవాలయం (అమృతసర్)
పంజాబ్ రాష్ట్రం లో ఉన్న గోల్డెన్ టెంపుల్ దేశంలోనే కాక ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యాత్ర స్థలం. ఇది సిక్కుల పవిత్ర పుణ్య క్షేత్రం గా ముద్రపడినది. అమృత్‌సర్ లో గల ఈ ఆలయం దేశంలోనే అతిపెద్ద గురుద్వారా గా ఖ్యాతి గడించింది. టెంపుల్ యొక్క గురుద్వారా పై అంతస్తులను కనివిని ఎరుగని రీతిలో 400 కేజీల బంగారంతో పూతపోశారు.
Photo Courtesy: Oleg Yunakov

ఎల్లోరా (మహారాష్ట్ర)
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డ ఎల్లోరా, మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ కు 30 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఈ గుహలు దేశంలో కెల్ల అతి పెద్ద గుహాలయంగా ప్రసిద్ధి చెందినది. ఎల్లోరా మొత్తం 34 గుహలు కలిగి ఉంది. ఇందులో ప్రతి మతానికి సంబంధించి కొన్ని గుహలు ఉన్నాయి. అందులో బౌద్ధమతానికి మొదటి 12 గుహలు, హిందూ మతానికి తర్వాతి 17 గుహలు, జైన మతస్ధలకు 5 గుహలు కలవు.
Photo Courtesy: Mark Hillary

జీపీవో – ముంబాయి
ముంబై మహానగరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దేశంలో కెల్ల అతి పెద్ద పోస్ట్ ఆఫీస్ గా చరిత్రకెక్కింది. ఈ పోస్ట్ ఆఫీస్ నమూనా, కర్నాటక రాష్ట్రం లోని బీజాపూర్ లో గల గోల్ గుమ్మజ్ శైలిని పోలి ఉంటుంది. దీనిని అప్పట్లో కట్టడానికే 18 లక్షల 9 వేలు ఖర్చు అయ్యింది.
Photo Courtesy: Ting Chen

శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి)
హైదరాబాద్ లో ఉన్న లలితకళా తోరణం, రవీంద్రభారతి ఎలాగా ముంబై లో ఉన్న శ్రీ షణ్ముఖానంద హాల్ అలాగన్నమాట. ఈ హాలు దేశంలో కెల్ల పెద్ద ఆడిటోరియం గా ప్రసిద్ధి చెందినది. సుమారుగా 2763 పట్టే ఈ ఆడిటోరియాన్ని 1952 వ సంవత్సరంలో నిర్మించినారు. దీంట్లో ఫైన్ ఆర్ట్స్ మరియు సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు.
Photo Courtesy: jamessv2005

భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్)
దేశంలో తెహ్రీ డ్యామ్ పెద్దదైనప్పటికీ, రిజర్వాయర్ కెపాసిటీ పరంగా భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కువ సామర్థ్యం గలది. భాక్రానంగల్ డ్యామ్ పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల మధ్య సట్లేజ్ నదిపై నిర్మించినారు.
Photo Courtesy: mayanksingha

పరిటాల, కృష్ణా జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ,కృష్ణా జిల్లాలో గల పరిటాల లో ఉన్న విగ్రహం దేశంలోనే కాక ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్ద విగ్రహంగా చరిత్రకెక్కింది. ఇక్కడున్న అభయాంజనేయ స్వామి విగ్రహం ఎత్తు 135 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇక్కడున్న ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటుగా, పర్యాటకులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుంటారు.
Photo Courtesy: Narendra Sadhu

మిధాపూర్ (గుజరాత్)
మిథాపూర్ గుజరాత్ రాష్ట్రంలో గల ఒక పట్టణం. ఇక్కడ దేశంలో కెల్ల అతి పెద్ద ఉప్పు తయారీ కేంద్రం ఉంది. టాటా వారి కార్యాలయాలు ఇక్కడ కూడా ఉన్నాయి.
Photo Courtesy: Just Jimish

కార్బుడే టన్నెల్ (మహారాష్ట్ర - గోవా)
భారత దేశంలో అతి పొడవైన టన్నెల్ గా కార్బుడే టన్నెల్ ఖ్యాతి గడించింది. 6.5 కిలోమీటర్ల పొడావున్న ఈ టన్నెల్ కొంకణ్ రైల్వే మార్గం లో ఉన్నది. మహారాష్ట్ర సమీపంలోని రత్నగిరి నుండి గోవా వెళ్లే రైలు లో ప్రయాణీకులు ఈ టన్నెల్ గుండా వెళ్ళటం ఒక మాధురానుభూతి.
Photo Courtesy: Akshay Marathe

ఏడో నెంబరు జాతీయ రహదారి
దేశంలో కెల్లా అతి పొడవైన జాతీయ రహదారి గా జాతీయ రహదారి 7 గుర్తించబడింది. ఉత్తరం నుండి దక్షిణ భారతదేశం వరకు విస్తరించిన ఈ జాతీయ రహదారి పొడవు 2,369 కి. మీ. ఎక్కడో ఉత్తరాన ఉండే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని వారణాసి నుండి ప్రారంభమయ్యే ఈ రహదారి దక్షిణ కొన తమిళనాడు రాష్ట్రం లోని కన్యాకుమారి తో ముగుస్తుంది.
Photo Courtesy: MP Chandrasekharan

గంగా నది(2525 కి. మీ)
గంగా నది భారత దేశపు జీవనది మరియు హిందువుల పవిత్ర నది. భగీరధ మరియు అలకనంద నది కలిసి గంగా నదిగా ఏర్పడినది. ఈ గంగా నది పొడవు 2525 కి. మీ. ఈ నది ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోనే ప్రవహిస్తుంది. 1450 కి. మీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, 445 కి. మీ. బీహార్ రాష్ట్రంలో, 525 కి. మీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహిస్తున్నది. మిగిలిన 110 కి. మీ. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల సరిహద్దులలో ప్రవహిస్తుంది.
Photo Courtesy: J Reid

యమున
భారతదేశంలో కెల్లా అతి పెద్ద ఉపనది యమున నది. ఇది గోదావరి నదికి ఉపనది. 1376 కి. మీ. పొడావున్న ఈ నది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహిస్తున్నది. ఈ నది ఒడ్డునే ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ , పుణ్య ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
Photo Courtesy: elly

హీరాకుడ్ డ్యామ్ (25.8 కి.మీ. –ఒడిశా)
హీరాకుడ్ డ్యామ్ దేశంలో కెల్ల అతి పొడవైన ఆనకట్ట. ఈ డ్యామ్ ఒరిస్సా రాష్ట్రం లోని సంబాల్పూర్ కి 10 కి. మీ. దూరంలో ఉంది. దీనిని మహానదిపై నిర్మించినారు. ఈ డ్యామ్ కి అంతం లేనట్టుగా సుమారు 26 కి. మీ. వరకు విస్తరించి ఉంది.
Photo Courtesy: Crazyviews EOS 50D

మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
దేశంలో అతి పొడవైన బీచ్ గా ప్రాచూర్యం పొందిన మెరీనా బీచ్ తమిళనాడు రాష్ట్రం రాజధాని చెన్నై లో ఉన్నది. ఈ బీచ్ యొక్క మొత్తం పొడవు 13 కి. మీ. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద బీచ్ మరియు అత్యద్భుతమైన అందం తో ఈ బీచ్ పర్యాటకుల మనసులను దోచుకుంటుంది.
Photo Courtesy: L.vivian.richard

గోరఖ్ పూర్ (1,366.33 మీ – ఉత్తర ప్రదేశ్ )
గోరఖ్ పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నది. ఇక్కడ దేశంలో కెల్ల అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఉంది. దీని పొడవు 1, 366 . 33 మీటర్లు. దీని తరువాతి స్థానాలలో కొల్లాం జంక్షన్ 1,180 మీటర్లు, ఖరగ్ పూర్ 1,072 మీటర్లు తో ఉన్నాయి. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్ (ఈశాన్య భారతం) యొక్క రైల్వే ప్రధాన కార్యాలయం ఉంది.
Photo Courtesy: Benison P Baby

రాజస్థాన్ కాలువ / ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
ఇందిరా గాంధీ కెనాల్ భారత దేశం లో కెల్ల అతి పెద్ద కాలువ. రాజస్థాన్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో ఈ కెనాల్ ప్రవహిస్తుంది. పంజాబ్ రాష్ట్రం లోని ఫిరోజ్‌పూర్ లో పుట్టి రాజస్థాన్ లోని ధార్ ఎడారి తో అంతమవుతుంది. దీనిని రాజస్థాన్ కెనాల్ అని కూడా అంటుంటారు.
Photo Courtesy: Ariz Shahbaz

గుజరాత్
దేశంలో కెల్ల అతి పెద్ద తీర రేఖ కలిగి ఉన్న రాష్ట్రం గుజరాత్. సుమారు 1600 కి. మీ. తీర రేఖ కలిగిన ఈ రాష్ట్రం లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి స్థావరాన్ని నెలకొల్పింది. ఎంతో మంది రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు , ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పుట్టినారు.
Photo Courtesy: Yessrao

సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
భారతదేశంలో పొడవైన హీమానీనదం సియాచిన్ హిమనీనదం . ఇది సుమారు 76 కి. మీ వరకు విస్తరించి ఉంది. ఇది హిమాలయ పర్వత ప్రాంతంలో కారకోరం శ్రేణి లో ఉంది. చలికాలంలో సరాసరి మంచుపాతం 1000 సెంటీమీటర్ల పైమాటే మరియు ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.
Photo Courtesy: Rizwan Saddique

మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
ఇండియాలో కెల్ల పొడవైన రోడ్డు బ్రిడ్జ్ మహాత్మా గాంధీ సేతు. సేతు అంటే వారధి, వంతెన మరియు బ్రిడ్జ్ అని అర్థం. ఈ రోడ్డు వంతెన బీహార్ రాష్ట్రం లో ప్రవహించే గంగా నది మీద, పాట్నా మరియు హజిపూర్ మధ్య నిర్మించినారు. దీని పొడవు 5, 575 కి. మీ. దీనిని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించింది.
Photo Courtesy: Chandravir Singh

వెంబనాడ్ బ్రిడ్జి (కొచ్చి)
దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జిగా పేరుగాంచిన వెంబనాడ్ బ్రిడ్జి (దీనిని వల్లార్‌పాదం బ్రిడ్జి అని కూడా పిలుస్తారు) ని కొచ్చి (కేరళ) వద్ద ఎడపల్లి - వల్లార్ పాదం ఏరియాలను కలుపుతూ నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం 350 కోట్ల రూపాయలు. పొడవు నాలుగున్నర కిలోమీటర్లు. మొత్తం 231 పిల్లర్లపై ఈ వంతెన నిర్మాణం జరిగింది.
Photo Courtesy: VIMLESH CHANDRA RAILWAY WRITER

అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జ్ ని పంబన్ బ్రిడ్జ్ అంటారు. భారత దేశపు తొలి సముద్రపు వంతెన అయిన పంబన్ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్ళేదారిలో కనిపిస్తుంది ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని - భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. ఈ పంబన్ బ్రిడ్జి భారతదేశపు తొలి సముద్రపు వంతెన, దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన. ఈ వంతెన దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి మధ్య భాగం రెండుగా విడివడి పైకి లేవడం ఈ వంతెన ప్రత్యేకత.
Photo Courtesy: James A

తెహ్రీ డ్యాం
తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఉంది. ఈ డ్యామ్ దేశంలో కెల్లా ఎత్తైనది మరియు ప్రపంచంలో ఉన్న ఎత్తైన డ్యామ్ లలో ఒకటి. ఈ డ్యామ్ భాగీరథీ నది మీద నిర్మించినారు.
Photo Courtesy: Loupiote

కాంచన జంగా (8586 మీ.)
8586 మీటర్ల ఎత్తు ఉండే కాంచన జంగా శిఖరం భారత దేశంలోని ఉత్తర సిక్కిం మరియు నేపాల్ దేశ సరిహద్దులో ఉన్నది. డార్జీలింగ్ నుంచి కనపడే అద్భుతమైన దృశ్యాలకు కాంచేన్ జంగా సుప్రసిద్ధమైంది. కొండ పైకి ఎక్కడానికి అనుమతి చాలా అరుదుగా ఇస్తారు.
Photo Courtesy: shankar s.

లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ నుండి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి వరకు వెళ్లే రోడ్డు మార్గం ప్రపంచంలోనే అతి ఎత్తైనది. 490 కి. మీ. పొడవు ఉండే ఈ రహదారి కేవలం నాలుగున్నారా నెలల సమయం వరకు మాత్రమే తెరచి ఉంటారు. మే లేదా జూన్ నుండి అక్టోబర్ మధ్య వరకు ఈ రహదారి గుండా రాకపోకలు జరుగుతుంటాయి. పూర్తిగా సరిహద్దు రోడ్డు సంస్థ ఆధ్వర్యంలో రాకపోకలు జరిగే ఈ రహదారి గుండా భారత సైన్యానికి కావలసిన అవసరాలను తీరుస్తుంది.
Photo Courtesy: roads in india

జోగ్ లేదా జెర్సొప్పా ఫాల్స్(253 మీ. – కర్ణాటక)
దేశంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన జోగ్ ఫాల్స్ కర్నాటక రాష్ట్రం లో ఉంది. ఈ జలపాతం శరావతి నది నుండి ఏర్పడుతుంది. ఈ జలపాతం ఎత్తు 253 మీటర్లు. ఈ జలపాతం చుట్టూ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు అన్ని భాషల సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి.
Photo Courtesy: ram

బులంద్ దర్వాజా (53.5 మీ.)
బులంద్ దర్వాజా 17 వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్ పై అక్బర్ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్ సిక్రీ నగరంలో ఉంది. ప్రశాంతమైన దృశ్యాలను, గోడలపై ఉన్న అందమైన కళను చూసి ఆనందించడానికి అనేక మంది సందర్శకులు ఇక్కడకు వస్తారు. బులంద్ దర్వాజాను ఎరుపు, పసుపు ఇసుక రాయితో నిర్మించి, తెలుపు, నలుపు చలువరాయితో లోపలి భాగాలను చెక్కారు.
Photo Courtesy: Satish Somasundaram

డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
డ్రాస్ సెక్టార్ దేశంలో కెల్ల క్తి చల్లని ప్రదేశం. ఈ ప్రదేశాన్ని గేట్ వే ఆఫ్ లఢఖ్ అని అంటారు. జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లా లో ఉన్న ఈ ప్రదేశం గుండా జాతీయ రహదారి 1 - డి వెళుతుంది . ఈ ప్రదేశం ఎంత చల్లగా ఉంటుంది అంటే -40 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు చేస్తుంది.
Photo Courtesy: Ww2censor

సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
కేరళ రాష్ట్రం లోని త్రిసూర్ జిల్లా లో గల పాలయూర్ లో సెయింట్ థామస్ ఉన్నది. దీనిని పాలయూర్ చర్చి అని కూడా అంటారు. క్రీ. శ . 52 లో సంవత్సరంలో ఈ చర్చి స్థాపన జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. పాలయూర్ మహాతీర్ధ పండుగ వేడుకలలో దేశంలోని వివిధ భాగాలనుండి చెక్క శిలువలు మోసుకుంటూ క్రీస్తు భక్తులు ఇక్కడకు వస్తారు.
Photo Courtesy: Tim Schapker



Click it and Unblock the Notifications
















