Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బీజపూర్

బీజపూర్ - ప్రతిబింబించే వారసత్వ సంపద

40

బీజపూర్ ఒక్కసారి దర్శిస్తే చాలు మన గత వైభవం ఏమిటనేది తెలిసిపోతుంది. ఈ పట్టణ శిల్పసంపద, అక్కడ కల లెక్కలేనన్ని చారిత్రక చిహ్నాలు పర్యాటకులకు ఒకప్పటి నగర వైభవాన్ని సంస్కృతిని చాటుతాయి. బీజపూర్ పట్టణం బెంగుళూరు నుండి 521 కి.మీ. దూరం ఉంది. కాలానుగతంగా బీజపూర్ తన శోభను కోల్పోతోంది. అయినప్పటికి అక్కడి మసీదులు, గోపురాలు, కోటలు దాని గత వైభవానికి చిహ్నాలుగా ఉన్నాయి.

బీజపూర్ పట్టణ చరిత్ర - బీజపూర్ పట్టణ చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే దాని గత వైభవం అంతా చక్రవర్తి అదిల్ షా వంశ వైభవంగా కనపడుతుంది. యూసఫ్ అదిల్ షా 1490 సంవత్సరంలో బీజపూర్ నగరాన్ని స్ధాపించాడు. అదిల్ షా తర్వాతి కాలంలో అధికారానికి వచ్చిన రాజులు సైతం ఈ పట్టణ అభివృధ్ధికి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి కృషి చేశారు.

ఈ పట్టణంలోని చారిత్రక చిహ్నం గోల్ గుంబజ్ గురించి చెప్పనిదే, ఎన్నింటిని గురించి చెప్పినా ప్రయోజనం లేదు. అదిల్ షా సమాధి అయిన గోల్ గుంబజ్ ఒక వైభవోపేతమైన సమాధి. సెయింట్ పీటర్స్ బేసిలికా తర్వాత ఇదే పెద్ద సమాధిగా చెప్పవచ్చు. మరికొన్ని ప్రధాన చారిత్రక నిర్మాణాలు అంటే మలికే ఎ మైదాన్. ఇది ఆ కాలంనాటి ప్రపంచ రెండవ ఫిరంగి. ఎత్తైన ఉప్లి బురుజు మరియు చాంద్ బావడి, పట్టణంలోని 20 మిలియన్ లీటర్ల నీటిని నిలువ చేయగల నీటి ట్యాంకు వంటివి పాలకులు వైభవాన్ని చాటుతాయి.

ఈ పట్టణంలో ఒక పురాతన కోట ప్రహరీ అవశేషాలు, కోట మరియు పట్టణంలోని మరికొన్ని సమాధులు, మసీదులు, ఇతర రనిర్మాణాలు కూడా ఉన్నాయి. ఐ హోళే, పట్టడాకల్ మరియు బాదామిల లోని చాళుక్య దేవాలయాలకు దీటుగా బీజపూర్ లోని మొగల్ కట్టడాలు కనపడతాయి.

దేశంలోని అన్ని ప్రాంతాలనుండి బీజపూర్ పట్టణం తేలికగా చేరుకోవచ్చు. దీనికి సమీప విమానాశ్రయం బెల్గాం. రైలు సర్వీసులు బెంగుళూరు మరియు గోవాలనుండి కలవు.  

బీజపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బీజపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బీజపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బీజపూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం రోడ్డు మార్గం అనేక పట్టణాలకు కలుపబడి ఉంది. అనేక ప్రయివేటు వాహనాలు బీజపూర్ కు సౌకర్యం కల్పిస్తాయి. ఎయిర్ కండిషన్ బస్సులు ఓల్వో బస్సులు ఉన్నాయి. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బెంగుళూరు, పూనే, ముంబై లనుండి కూడా బీజపూర్ కు బస్సులు నడుపుతుంది. బీజపూర్ చేరిన వెంటనే సందర్శకులు స్ధానిక వాహనాలలో పట్టణంలోని చారిత్రక కట్టడాలైన గోల్ గుంబజ్, ఇబ్రహీం రౌజా, జుమ్మా మసీద్, మాలిక్ ఎ మైదాన్ వంటివి దర్శించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం బీజపూర్ రైల్వే స్టేషన్ దాని మధ్య భాగానికి 4 కి.మీ. దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడినుండి రైళ్ళ రాక పోకలుంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    బీజపూర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం బీజపూర్ బెల్గాం విమానాశ్రయం ద్వారా వివిధ నగరాలకు అనుసంధానించబడింది. ఈ విమానాశ్రయం బీజపూర్ కు 197 కి.మీ. దూరంలో ఉంది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజపూర్ 538 కి.మీ. దూరం ఉంది. ఐరోపా, ఆసియా, అమెరికా మధ్య ప్రాచ్య దేశాల పర్యాటకులు ఈ విమానాశ్రయం ద్వారా బీజపూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun