Search
  • Follow NativePlanet
Share
» »రిటైరింగ్ గదుల సౌక‌ర్యం గురించి ఎప్పుడైనా విన్నారా?

రిటైరింగ్ గదుల సౌక‌ర్యం గురించి ఎప్పుడైనా విన్నారా?

టైరింగ్ గదుల సౌక‌ర్యం గురించి ఎప్పుడైనా విన్నారా?

భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ఏదో ఒక మంచి పథకం లేదా సౌకర్యాలను ప‌ర్యాట‌కుల‌కు నిత్యం అందిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రయాణికులకు ప్రత్యేక రైళ్ల సౌకర్యాల‌ను కూడా అందిస్తుంది. భారతీయ రైల్వే తన స్టేషన్లలో రిటైరింగ్ గదుల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది? రిటైరింగ్ గ‌ది సౌక‌ర్యం అంటే ఏంటి? ఆ గ‌ది ఉప‌యోగం ఏంటి అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని అనివార్య కారణాల వల్ల రైళ్లు ఆలస్యంగా రావడం మామూలే, అలాంటి పరిస్థితుల్లో రైళ్ల కోసం స్టేషన్‌లో వేల సంఖ్యలో ప్రయాణికులు నిలబడి రెండు, నాలుగు, ఏడు గంటలు అలా చాలా సేపు వేచి చూస్తుంటారు. ఆలస్యంగా వస్తుందని తెలియగానే.. చాలామంది ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉంటారు. అలా వేచి ఉండ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు. వేడిగానీ, చలిగానీ, ఇన్ని గంటలు ఆరుబయట నిరీక్షించే సత్తా ఎవరికీ ఉండదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్‌లో రిటైరింగ్‌ రూమ్‌ సౌకర్యం కల్పించారు. అతి తక్కువ ఖర్చుతో కొన్ని గంటలు ఉండే ఒక హోటల్ లాంటిది ఇది అని చెప్పుకోవ‌చ్చు.

restroomsirctc

రిటైరింగ్ గదిని పొందడానికి ఏమి చేయాలి

PNR నంబర్‌తో IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో గదిని బుక్ చేసుకోవచ్చు. రైలు సమయానికి 12 నుండి 24 గంటల ముందు లేదా తర్వాత ఈ గ‌దిని బుక్ చేసుకోవ‌చ్చు. ప్రధాన స్టేషన్లలో, రెండు రకాల రిటైరింగ్ రూమ్‌ల స‌ర్వీస్ అందుబాటులో ఉంటుంది. వీటిలో AC మరియు నాన్ AC గదులు ఉన్నాయి. అదే సమయంలో, ఇంటర్నెట్ సహాయంతో, రిటైరింగ్ రూమ్‌ల ముందస్తు బుకింగ్ కూడా చేయొచ్చు.

రిటైరింగ్ రూమ్ సౌకర్యం కన్ఫర్మ్ టికెట్ ఉన్న లేదా RAC ఉన్న ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంద‌నే విష‌యాన్ని ప్ర‌యాణికులు గుర్తుపెట్టుకోవాలి. వెయిటింగ్ టిక్కెట్లు, కార్డు టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు ఉన్నవారికి రిటైరింగ్ రూమ్‌ల సౌకర్యం ఉండ‌దు. అయితే, 500 కిలోమీట‌ర్ల దూరం వరకు జనరల్ టికెట్ కలిగి ఉంటే మాత్రం రిటైరింగ్ రూమ్ స‌ర్వీస్ వ‌ర్తిస్తుంది.

restroomsirctc

ఈ స్టేషన్లలో గది సౌకర్యం అందుబాటులో ఉంది

రిటైరింగ్ రూమ్‌లు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఇవ్వబడతాయి. రూమ్‌లు ఫుల్ అయితే, వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచబడతాయి. ఎవరైనా గదిని రద్దు చేస్తే, అప్‌డేస్ చేస్తారు. బుకింగ్ కోసం PNR నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటోలు, ID కార్డ్, పాస్‌పోర్ట్, PAN కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి పత్రాలను కూడా చూపించవలసి ఉంటుంది. చాలా స్టేషన్లలో గదులు అందుబాటులో లేనందున ప్రజలకు వాటి గురించి పెద్దగా సమాచారం ఉండ‌డం లేదు. రిటైరింగ్ గదిని కనీసం ఒక‌ గంటకు బుక్ చేసుకోవచ్చు. చాలా రైల్వే స్టేషన్లలో 48 గంటల పాటు రిటైరింగ్ రూమ్‌లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.

మూడు గంటల పాటు రైల్వే రిటైరింగ్ గదిని బుక్ చేసుకుంటే, నాన్-ఏసీ గదిని సుమారు 30-40 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. AC గది ధర ఎక్కువగా ఉండవచ్చు. అంతే కాకుండా, 48 గంటల పాటు బుక్ చేసుకుంటే, ఎక్కువ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. భారతదేశంలోని అనేక ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే రిటైరింగ్ గదులు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, భోపాల్, పాట్నా, లక్నో, కాన్పూర్, వారణాసి మరియు ఛత్తీస్‌గఢ్ మొదలైన పెద్ద స్టేషన్‌లలో రిటైరింగ్ గదులు ఉన్నాయి.
బుకింగ్ కోసం ఈ వెబ్‌సైట్ https://www.rr.irctctourism.com/#/homeని సందర్శించవచ్చు.

More News

    Read more about: delhi mumbai
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+