Search
  • Follow NativePlanet
Share
» »శీర్కాళి - ప్రసిద్ధ ఆలయాలు, విశిష్టతలు !!

శీర్కాళి - ప్రసిద్ధ ఆలయాలు, విశిష్టతలు !!

శీర్కాళి ఒక ప్రసిద్ధ హిందూ ధార్మిక కేంద్రం. శివుడు ఇక్కడి ప్రధాన దైవం. దక్షిణ భారతదేశంలో గ్రామాలలో కనిపించే మతవిశ్వాసాలకు, సంస్కృతి - సంప్రదాయాలను కాపాడుతూ ఉంటుంది ఈ గ్రామం.

By Mohammad

శీర్కాళి, తమిళనాడు లోని నాగపట్టణం జిల్లాలో బంగాళాఖాతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ధార్మిక ప్రాంతం. చారిత్రిక గతాన్ని కల్గిన ఒక ప్రశాంత దక్షిణ భారత పట్టణం శీర్కాళి, ప్రస్తుత ఆధునిక కాలంలో పర్యాటక రంగం, ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి పై దృష్టిని సారిస్తూనే ఒక సంప్రదాయ దక్షిణ భారత గ్రామంలో ఉండే విశ్వాసాలను, ఆచారాలను కాపాడుతుంది.

పురాణాలు, ఇతిహాసాలను అనుసరించి బ్రహ్మ దేవుడు పూర్తి గ్రహాన్నే తుడిచి పెట్టుకుపోయే విధ్వంసక వరదలనుండి 64 మందిని కాపాడిన శివుడిని ప్రార్ధించిన గ్రామం ఇదే (అందువలననే, బ్రహ్మపురీస్వరార్ అనే పేరు), ఈ కారణంగానే ఈ గ్రామంలో వివిధ రూపాలలో శివుని ఆరాధిస్తారు, అన్ని ప్రదేశాలలో ఆయన వివిధ రూపాల ఆలయాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : తిరుత్తణి - శ్రీ సుబ్రమణ్యస్వామి కోవిల్ !!

శివుడు శీర్కాళిని కాపాడటానికి తెప్ప లేదా పడవను వాడటం వలన దీనిని తోనిఅప్పర్ లేదా తోనిపురం అంటారు; 'తోని' అంటే తమిళంలో పడవ అని అర్ధం. తమిళనాడు నుండే కాక దేశ౦ నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు సందర్శించే ఒక ముఖ్య తీర్థయాత్రా ప్రదేశం శీర్కాళి.

బ్రహ్మపురీస్వరార్ ఆలయం

బ్రహ్మపురీస్వరార్ ఆలయం

బ్రహ్మపురీస్వరార్ ఆలయం శీర్కాళిలో అత్యంత ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శివునికి ఆయన భార్య తిరుమల నాయకికు చెందింది. ఈ ఆలయంలో శివుని మూడు మందిరాలు ఉన్నాయి. ఇక్కడ తోనిఅప్పర్, సత్తైనాధార్ అనే ఇద్దరు ప్రధాన దేవతలు ఉన్నారు.

చిత్రకృప : Jagadeeswarann99

బ్రహ్మపురీస్వరార్ ఆలయం

బ్రహ్మపురీస్వరార్ ఆలయం

ఈ అద్భుతమైన ఆలయం చుట్టూ ప్రతి వైపు గోపురాలు (పొడవైన స్తంభాలు) ఉన్నాయి. పురాణాల ప్రకారం, ఒకసారి బ్రహ్మ దేవుడు బలి చక్రవర్తిని నరకానికి పంపిన తర్వాత ఒక దశలో అహంకారానికి, గర్వానికి లోనయ్యాడు. దీని వలన కలిగే ఊహించని పరిణామాల నుండి తప్పించుకోవడానికి శివుడు అతని అహంకారాన్ని అణచడానికి వేటగాని అవతారమెత్తాడు. బ్రహ్మ తన మూర్ఖత్వానికి పశ్చాతాపం చెందాడు. ఇదంతా ఈ ప్రాంతం దగ్గర జరగడం వలననే బ్రహామపురీస్వరార్ ఆలయ౦ అనే పేరు వచ్చింది.

చిత్రకృప : Portvp

బ్రహ్మ తీర్థం

బ్రహ్మ తీర్థం

బ్రహ్మపురీస్వరార్ ఆలయంలోపల ఉన్న 22 పవిత్ర తీర్థాలలో బ్రహ్మ తీర్థం ఒకటి. ఈ తీర్థం దగ్గరే బ్రహ్మ దేవుడు శివుడిని ప్రార్ధించాడని విశ్వసిస్తారు. ఈ తీర్థం ఒక పవిత్రమైన సరస్సు దగ్గర ఉంది, భక్తులు సుదూర ప్రాంతాల నుండి తమ పాపప్రక్షాళన నిమిత్తం ఇక్కడకు వస్తారు.

చిత్రకృప : Ssriram mt

బ్రహ్మ తీర్థం

బ్రహ్మ తీర్థం

ఈ తీర్థంలో ఒక మునక వేయడం శరీరాన్ని, మనసును కూడా పవిత్రం చేస్తుందని నమ్ముతారు. ప్రతి ఏటా తమ నైతిక పాపాల నుండి పవిత్రులవడానికి వేలాదిమంది భక్తులు ఈ బ్రహ్మ తీర్ధానికి వస్తారు. ఆలయ నిర్వాహకులు భక్తుల తాకిడిని తట్టుకోవడానికి ఆలయాన్ని సాఫీగా, తగిన విధంగా నిర్వహిస్తారు.

చిత్రకృప : Ssriram mt

గోపాలకృష్ణన్ ఆలయం

గోపాలకృష్ణన్ ఆలయం

తిరుకవలంపడి లోని గోపాలక్రిష్ణన్ ఆలయం రోజుకు రెండు సార్లు - ఉదయం 8 గంటల నుండి 11.30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తెరుస్తారు. ఈ ఆలయంలో గోపాలక్రిష్ణన్ పెరుమాళ్ ఇరువైపులా అతని భార్యలు రుక్మిణి, సత్యభామలు ఉంటారు. కృష్ణుడు తన భార్యలు రుక్మిణి, సత్యభామలతో దర్శనమిచ్చే ఈ ప్రాంతాన్ని భక్తులు ద్వారక అంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

చిత్రకృప : Shriramsrinivas wki

గోపాలకృష్ణన్ ఆలయం

గోపాలకృష్ణన్ ఆలయం

పురాణాల ప్రకారం తన భార్య సత్యభామ కోసం కృష్ణుడు ఒకసారి పారిజాత పుష్పాన్ని వెతుకుతుండగా, శివుడు అతనిని ఈ ఆలయం ప్రక్కన ఇవే పూలతో నిండిన సరస్సు దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. అందువల్ల, ఈ ఆలయాన్ని తటమలర్ పాయికై అంటారు. ఈ ఆలయాన్ని ఆళ్వార్లు పాడిన 108 పవిత్ర ఆలయాలు దివ్యలో ఒకటిగా పరిగణిస్తారు.

చిత్రకృప : Vishwajith33

తిరుక్కొలక్క శబ్దపురీసర్ ఆలయం

తిరుక్కొలక్క శబ్దపురీసర్ ఆలయం

తిరుక్కోలక్కలో ఉన్న తిరుక్కోలక్క శబ్దపురీసర్ ఆలయంలో శివుడు శబ్దపురీసర్ అవతారంలో ఉండటం వలన ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఇది శివుడు శబ్దపురీసర్ అవతారంలో పూజించబడే 15 వ దేవర స్తలంగల్. ఈ ఆలయంలో ఉన్న మరొక దేవాలయంలో ఒసై కొడుత నాయకిని పూజిస్తారు.

చిత్రకృప : Shriramsrinivas wki

తిరుక్కొలక్క శబ్దపురీసర్ ఆలయం

తిరుక్కొలక్క శబ్దపురీసర్ ఆలయం

ఈ ఆలయం ఒక ఎకరంలో ముప్పాతిక భాగాన్ని ఆక్రమిస్తుంది. సూర్య తీర్థం లేదా సూర్యుని తీర్థయాత్ర కేంద్రం శబ్దపురీసర్ ప్రధాన దేవాలయానికి సరిగా ఎదురుగా ఉంది. ఈ తీర్థం దగ్గర చైత్ర మాసంలో వేలాది మంది భక్తులు తిరుముల్లైవయాల్ ఉత్సవాన్ని జరుపుకుంటారు.

చిత్రకృప : Ssriram mt

కళీసిరామ విన్నగర౦

కళీసిరామ విన్నగర౦

పెరుమాళ్ కళీసిరామ విన్నగరాం, నాగపట్టణం జిల్లాలోని శీర్కాళిలో ఉన్న హిందూ ఆలయం. ఈ ఆలయం నారాయణ లేదా విష్ణువుకు చెందింది. ఈ ఆలయాన్ని 12 మంది "ఆళ్వారులు" (కవి సాధువులు) నిర్వహించే "దివ్య దేశం" విష్ణు ఆలయాలలో కలిపారు. ఇది శీర్కాళి స్టేషన్ నుండి సుమారు అర మైలు దూరంలో ఉంది. విష్ణువు వామన అవతార౦ ఉన్న మండపాన్ని ప్రధాన గర్భగుడిగా స్థాపించారు.

చిత్రకృప : Ssriram mt

కళీసిరామ విన్నగర౦

కళీసిరామ విన్నగర౦

దేవుడు ఇక్కడ కుడి చేతితో దానాన్ని స్వీకరిస్తునట్లుగా, చెక్క గొడుగును ఎడమ చేతితో పట్టుకొని సాలగ్రామ దండను మెడ చుట్టూ వేసుకొని దర్శనమిస్తాడు. దగ్గరలో తిరుమంగై అళ్వార్ పాదాలకు కడియాలతో ఉంటాడు. వాస్తు పూజ చేసే వారు తమ భూమి నుండి ఇసుకను తెచ్చి సాధువు పాదాల దగ్గర ఉంచి అదృష్టం, విజయం కోసం ప్రార్ధిస్తారు. ఈ ప్రాకారం లోపల మనం రాముని గుడిని కూడా చూడవచ్చు, శ్రీ ఆంజనేయుని మరొక ఆలయం కూడా ఈ ఆలయం బయట వైపున ఉంది.

చిత్రకృప : Ssriram mt

సత్తనాథ స్వామి దేవాలయం

సత్తనాథ స్వామి దేవాలయం

బ్రహ్మపురీస్వరార్ ఆలయ ప్రాంగణంలో ఉన్న సత్తనాథ స్వామి ఆలయం శీర్కాళిలోని ప్రధాన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఈ ఆలయంలో శివుడు భైరవ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం నుండి అందమైన బ్రహ్మపురీస్వరార్ ఆలయ౦ పూర్తి దృశ్యాన్ని చూడవచ్చు.

చిత్రకృప : Ssriram mt

సత్తనాథ స్వామి దేవాలయం

సత్తనాథ స్వామి దేవాలయం

విశాలమైన సభామండపంలో తరుచు భక్తులు గంటల తరబడి ధ్యానం, విశ్రాంతి కోసం కూర్చుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి దూర, దగ్గర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. శీర్కాళిలో ఉన్న అనేక ఇతర ఆలయాలు ప్రజలను, విశ్వాసాలను, ధార్మికతను, దేవుడిని కలుపుతాయి.

చిత్రకృప : Ssriram mt

పండుగలు - ఉత్సవాలు

పండుగలు - ఉత్సవాలు

జనవరిలో మూడు రోజుల పాటు మకర పొంగల్ అనే మూడు రోజుల ఉత్సవం జరుగుతుంది. శివునికి చెందిన అనేక ఆలయాలు ఉన్న పట్టణమైనందున భారీ సంఖ్యలో తీర్థయాత్రికులు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి లో శివుని పూజించడానికి వస్తారు.దీపావళి సందర్భంగా అక్టోబర్/నవంబర్ లలో ఈ పట్టణం దీపాల వెలుగుతో అత్యంత సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటుంది.

చిత్రకృప : Vishwajith33

శీర్కాళి ఎలా చేరుకోవాలి ??

శీర్కాళి ఎలా చేరుకోవాలి ??

రోడ్డు మార్గం ద్వారా

ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం ఉంది. శీర్కాళి చేరడానికి అనేక బస్సులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు శీర్కాళికి తమిళనాడు ఇతర నగరాలకి మధ్య ఉంటాయి.

రైలు మార్గం ద్వారా

శీర్కాళికి రైలు స్టేషన్ కలదు. ప్రధాన రైలు స్టేషన్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నమాయవరం నుండి చెన్నై, రామేశ్వరం, విలుపురం, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాలకు మార్గం ఉంది. రైలు స్టేషన్ నుండి టాక్సీలు లేదా ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి.

వాయుమార్గం ద్వారా

శీర్కాళి కు 125 కిలోమీటర్ల దూరంలో త్రిచి లేదా తిరుచరాపల్లి దేశీయ విమానాశ్రయం ఉంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం 235 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉంది. ఈ విమానాశ్రయం నుండి శీర్కాళి చేరడానికి ప్రైవేట్ టాక్సీలు లేదా బస్సులు ఉంటాయి.

చిత్రకృప : C/N N/G

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+