Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు లో శనక్కాయల సంత!

బెంగుళూరు లో శనక్కాయల సంత!

శనక్కాయల సంత లేదా గ్రౌండ్ నట్ మార్కెట్ ప్రస్తుతం బెంగుళూరు లో నడుస్తోంది. పేదవారి బాదం పప్పు గా ప్రసిద్ధి చెందిన వేరు శనక్కాయలు బెంగుళూరు బసవనగుడి లోని పురాతన మార్కెట్ లో ఒక సంతలో విరివిగా అమ్మేస్తున్నారు. ఈ మార్కెట్ బుల్ టెంపుల్ రోడ్ లో కలదు. ఇక్కడ కల నంది టెంపుల్ కారణంగా ఈ ప్రాంతానికి బసవనగుడి అని పేరు వచ్చింది. ఇక్కడి నంది విగ్రహం ప్రతిష్ట, శనక్కాయల సంత గురించి చెపితే చాలా ఆసక్తికరంగా వుంటుంది. పూర్వ కాలంలో ఒక ఎద్దు ఈ శనక్కాయల సీజన్ వచ్చిందంటే చాలు కర్ణాటకలో శనక్కాయల పంటలు అధికంగా పండే గుట్టహళ్లి, మావల్లి ,దాసర హళ్లి వంటి ప్రాంతాలలో పంటలను ధ్వంసం చేసేదిట.

ఎద్దును కన్నడంలో బసవ అని అంటారు. దానిని పూజిస్తారు. ఈ బసవను నియంత్రించటానికి ఇక్కడి రైతులు ఎంతో కష్టపడ్డారు. బసవ దేముడిని సంత్రుప్తిపరచేందుకు గాను సంవత్సరంలో వచ్చిన పంటను ముందుగా బసవన్న కు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఆ వెంటనే, ఒక బసవ విగ్రహం అక్కడి పొలాలలో కనుగొనబడింది. ఈ విగ్రహం దానంతట అది పెరగటం మొదలు పెట్టింది.

దీనితో భయపడిన రైతులు ఆ బసవ విగ్రహానికి తలపై ఒక మేకు కొట్టారు. దాని ఎదుగుదల ఆగి పోవటంతో ఆ విగ్రహాన్ని అక్కడే కల ఒక చిన్న కొండపై ప్రతిష్టించారు. దీనినే బసవనగుడి అని కన్నడంలో, బుల్ టెంపుల్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఆనాడు వారు బసవన్న దేముడికి మొక్కుకున్న ప్రకారం నేటికీ, శనక్కాయల పంట వచ్చిందంటే చాలు, ఆ ఉత్పత్తులను రైతులు తీసుకు వచ్చి గుడిలో బసవన్నకు సమర్పించి అక్కడే అమ్మకాలు మొదలు పెడతారు.

కాల క్రమేణా ఈ ఆనవాయితీ ఒక పెద్ద శనక్కాయల జాతర గా మారింది. సుమారు 500 మంది రైతులు ప్రతి సంవత్సరం డిసెంబర్ లో జరిగే ఈ శనక్కాయల సంతలో పాల్గొంటారు. అయితే, ఈ అంశం, నేటి బెంగుళూరు వాసులకు ఎంతో విచిత్రంగాను, కొత్తదిగాను వుంటుంది.

బెంగుళూరు లో శనక్కాయల సంత!

ఈ జాతర ఎందుకు చూడాలి ?

ప్రధానంగా కర్నాటక గ్రామీణ ప్రాంత రంగు రంగుల దృశ్యాలు, చూడవచ్డ్చు, రెండవ కారణంగా, అప్పుడే వచ్చిన కొత్త పంట కావటంతో శనక్కాయలు మంచి రుచిగా వుంటాయి. మూడవ కారణంగా, బాగా అభివృద్ధి చెందిన బెంగుళూరు వంటి నగరంలో గ్రామీణ ప్రాంత ఆచారం అయిన ఒక జాతర వంటి సంఘటన తెలుస్తుంది. ఈ సంతలో శనక్కాయలె కాక, ఇంకనూ అనేక ఇతర హస్త కళల వస్తువులు, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలు, మహిళల వస్తువులు అయిన గాజులు, చెవి రింగులు వంటివి కూడా విక్రయించి ఒక చిన్న మార్కెట్ వలే నిర్వహిస్తారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+