
అనంత చరిత్ర దాగి ఉన్న శ్రీవారి ఆనంద నిలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా , సాలిగ్రామ శిలా మూర్తిగా ఆవిర్భవించి నిలిచిన ప్రాంతం గర్భాలయం, దీనేనే ఆనంద నిలయం అని పిలుస్తారు.
ఆ ఆనంద నిలయంపై బంగారు గోపురం నిర్మించారు. దీన్ని ఆనంద నిలయం అంటారు. ఈ ఆనంద నిలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఆనంద నిలయంలో కేవలం శ్రీవారు మాత్రమేనా లేదా ఇతరులు ఉన్నారా, ఆనంద నిలయానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు, ఇందులో ఎన్ని అంతస్తులుంటాయన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషానికి గుర్తుగా
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషానికి గుర్తుగా ఆ దేవుడికి ఆనంద నిలయం అని నామకరణం చేశారు. ఆలయ నిర్మాణం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. 12వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆ ఆనంద నిలయం, అనువనువు అబ్బుర పరిచే నిర్మాణమే. వాటి కట్టడాల శిల్ప సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఆనంద నిలయం. మూడు అంతస్తులుగా నిర్మించిన ఈ ఆనంద నిలయంపై ఎన్నో శిల్పసౌందర్యాలు కొలువై ఉన్నాయి.

బంగారు పూత పూసిన లోహపు రేకుతో
బంగారు పూత పూసిన లోహపు రేకుతో తళతళలాడే గోపుర సౌందర్యం వర్ణణాతీతం. శ్రీవారికి గొడుగు లాంటింది గోపుర కట్టడం దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువైన శ్రీవారికి నాభిలాంటి ఈ గోపురం 65.2 అండుగుల ఎత్తు ఉంటుంది.

ఈ పునాది 17 నుండి 20 అడుగులు ఉంటుంది.
ఈ పునాది 17 నుండి 20 అడుగులు ఉంటుంది. 27.4అడుగుల వరకూ దీర్ఘచతురస్రాకారంగా ఉండే నిర్మాణం ఆతర్వాత గుండ్రంగా, దీర్ఘచతురస్రాకారంగా మారుతుంది.ఆ గోపురు నిర్మాణంపై శ్రీవిమాన వెంకటేశ్వరుడు మరియు పద్మావతి అమ్మవార్లతో సహా , ఆకులు, ద్రాక్షగుత్తులు నమూనాలు, 8 సింహాలు ద్వారపాలకులుగా ఉండేటటువంటి శిల్పకలను భక్తులు చూడగానే మది పులకించిపోతుంది.

మరి ఇంతటి మహత్తరమైన నిర్మణాం
మరి ఇంతటి మహత్తరమైన నిర్మణాం ఎవరు మొదలు పెట్టారు?ఎప్పుడు పూర్తి చేశారు? కలియుగదైవానికి కాస్తంత గోపురం కట్టించాలనే ఆలోచన క్రీ.శ 839లోనే కలిగింది. పల్లవ రాజు అయిన విజయదంతి విక్రమ వర్మకు ఆ అవకాశం దక్కింది. ఈ గోపురానికి బంగారు పూత ఆయనే మొదలు పెట్టారు. ఈ ప్రక్రియ దాదాపు 430ఏళ్ళు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

రాజులు పోయినా తరువాత వచ్చే
రాజులు పోయినా తర్వాత వచ్చే పాలకులు ఆ బాధ్యతలను తీసుకున్నారు. ఆనంద నియల గోపురానికి బంగారు పూత వేసే కార్యక్రమాన్ని క్రీ.శ 1262లో పాండ్య రాజు సుందర పాండ్య జతవర్మ పూర్తి చేశారు. ఆ తర్వాత కాలంలోని పాలకులు అందరు శ్రీవారిపై అపారమైన భక్తి భవావంతో ఆలయంలోపల ఎన్నో మార్పులను చేశారు.

1359లో అప్ప సాలవరాజు
1359లో అప్ప సాలవరాజు మంగిదేవ మహరాజు గోపురంపై కొత్త కలశంను ప్రతిష్టింపబడినది. విజయ నగర సామ్రాజ్య మంత్రి చంద్రగిరి మల్ల క్రీ.శ 1417 ఈ గోపురానికి కొత్త హంగులు తీర్చిదిద్ది సరికొత్త హంగులను తీసుకొచ్చారు. ఆలంయలోపలి భాగంలో కొన్ని మండపాలను నిర్మించారు. అ అయితే అప్పటికే తిరుమల దేవాలయంలోని వేంకటేశ్వరునిపై విజయనగర ప్రభువులు అపారమైన భక్తిని కనబరుస్తున్నారు.

శ్రీవారి గర్భగుడికి ఆనంద నిలయం అని పేరు ఎలా వచ్చింది?
బంగారు కొండపై కొలువైన బంగారు స్వామి, ఆ బంగారు స్వామికి కాపు కాస్తున్న బంగారు నిలయం. ఇది భక్తుల పాలిట ఆనంద నిలయం. అందుకే భక్తులకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా ఈ ఆనంద నిలయంలోకి చేరుకోగానే అన్నీ మర్చిపోతారు. స్వామి వారి దివ్య మంగల తేజో రూపం దర్శించుకోగానే అన్ని బాధలు తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువే స్వయంగా వైకుంఠం నుండి వచ్చి శ్రీనివాసునిగా ఇక్కడ కొలువై, భక్తుల కోర్కెలు తీర్చుతూ కోనేటి రాయుడుగా పిలవబడుతున్నాడు. భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఆనంద నియం చూడగానే సాక్షాత్త్ ఆ మహావిష్ణువును చూసిన ఆనందం కలుగుతుంది. అందుకే భక్తుల సంతోషానికి గుర్తుగా స్వామి ఆవిర్భవించిన ఆ ప్రాంతానికి ఆనంద నిలయం అని నామకరణం చేశారు.పేరుకు తగిన విధంగానే ఆనంద నిలయం నిర్మాణం మహా అద్భుతంగా ఉంటుంది.

ఏడుకొండలపై శ్రీవారికి జరిగే కైంకర్యాలే కాదు,
ఏడుకొండలపై శ్రీవారికి జరిగే కైంకర్యాలే కాదు,ఆయన వెలసిన ప్రదేశం గురించి కూడా ఆగమ శాస్త్రాల్లో చాలా చక్కగా వర్ణించారు. వైకనస ఆగమ శాస్త్రాల ప్రకారం, గర్భాలయంలో నాలుగు ఆవరణలు ఉంటాయి. అవి బ్రహ్మ, వైదిక , మనుష్య మరియు పైశాచ ఆవరణలు. శ్రీవారి నిజఅర్చవాతర రూపం సరిగ్గా గర్భగుడి మద్యలో ఉంటుంది, గర్భగృహాన్ని నాలుగు చుతురస్రాలుగా విభజిస్తే, అందులో లోపలి వైపు మొదటిగా ఉండే చతురస్రమే బ్రహ్మస్థానం. అదే స్థానంలో శ్రీవారి విగ్రహం వెలిసింది. తిరుమలకు విచ్చేసే భక్తులకు తెలిసిందల్లా, శ్రీవారి ఆలయంలో కొలువుండే ప్రధాన విగ్రహం స్వరూపం మాత్రమే. ఈయన్నే ప్రధాన మూర్తి అనికూడా పిలుచుకుంటారు. అయితే ఆనందం నిలయంలో భక్తులకు తెలియని మరో నాలుగు శ్రీనివాస మూర్తుల విగ్రహాలుంటాయి.

గర్భగుడిలో శ్రీవారి దివ్వ మంగళ విగ్రహంతో
గర్భగుడిలో శ్రీవారి దివ్వ మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనిమిచ్చే నలుగురు మూర్తులు పంచబేరాలు అంటారు. బేర అంటే విగ్రహం.
ఈ పంచే బేరాలను విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ద అనే పేర్లుతో పిలుస్తుంటారు. ప్రతి బేరానికి నిత్య ఆరాధన క్రమంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ద్రువదూరం అనేది మూలవర్యులు, శ్రీవారి యొక్క దివ్వ సాలిగ్రామ బింబం. ఇది స్వయంభుగా వెలిసినది. మిగిలిన ఆ నలుగురు:

శ్రీవారి ఆలయంలో కొలువైన నలుగురు మూర్తులు:
కౌతుక బేరం: ఈయన భోగ శ్రీనివాసుడు: 7వ శతాబ్ధంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు. రోజువారి అభిషేకాలు, నైవేద్యాలన్నీ, దీపారాధన భోగ శ్రీనివాసునికి జరపడం ఆఛారంగా వస్తున్నది.

బలి బేరం:
గర్బగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు. మూల విరాట్ కు తోమాల సేవ తర్వాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి పంచాంగ శ్రవణం జరిపిస్తారు.

స్నపన బేరం:
ఈ మూర్తిని 11వ శతాబద్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజింపబడినాడు. ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవారీయన.

ఉత్సవ బేరం:
ఉత్సవ కార్యక్రమాలన్ని ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వాకి నిర్వహిస్తున్నారు. మలయప్పస్వామి వారు ఉత్సవాలతో వైభోగం వెలిగిస్తారు. ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో బ్రహ్మా వెలిగించే స్వామి ఈయనే. భక్త కోటికి దర్శనమిస్తూ సాగిపోతుంటారు.ఈయనకు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉంటారు.
స్వామి వారి ప్రతిమను ధృవ బేరం అనిపిలుస్తారు. నిశ్చల, ధీర, గంభీర మూర్తి శ్రీవారు. ధృవ మూర్తినే దేవదేవుడు ఈయనకు నిత్య పూజలు, సేవలు అందుతుంటాయి. భక్తుల కోర్కెలు తీర్చే భారం మాత్రం ఈ మూర్తులలో ధృవ మూర్తిదే. అంటే ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వరునిదే.
గర్భాలయంలో దర్పంగా చిద్విలాసం చిందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు మూల విరాట్. ఆగమ పరిభాషలో ఈ మూల విరాటునే ధృవ బేరం అని పిలుస్తున్నారు.ప్రతి రోజు అనేక రకాల పూలతోను బంగారు నగలతోను ఈ ధృవ బేరాన్ని అలంకరిస్తారు. గర్భగుడిలో అలంకరించే విరిదండలు మరింత శోభను తెస్తాయి.
ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్ట సకులుండరు. వీరిరువురు స్వామి వారి వక్ష స్థలం మీద దర్శన మిస్తుంటారు.

ఎలా వెళ్ళాలి?
బెంగుళూరు నుండి తిరుమలకు సుమారు 267కిమీ ల దూరంలో వున్నది, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో వున్నాయి. అదేవిధంగా రైలుసౌకర్యం కూడా తిరుపతికి వున్నాయి.
PC-Balaji Kasirajan



Click it and Unblock the Notifications














