Search
  • Follow NativePlanet
Share
» »కృష్ణా పుష్కరాలు ఎక్కడెక్కడ ? ఎలా ?

కృష్ణా పుష్కరాలు ఎక్కడెక్కడ ? ఎలా ?

12 సంవత్సరాలకొకసారి నిర్వహించే కృష్ణా పుష్కరాలకు దేశ, విదేశాల నుండి భక్తులు భారీగానే తరలివస్తుంటారు.పుష్కరాల సమయంలో కృష్ణనదిలో మునిగి తేలితే భౌతిక, మానసిక రుగ్మతలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.

By Mohammad

కృష్ణా పుష్కరాలని సింపుల్ గా 'కృష్ణా నది' పండుగ అని చెప్పవచ్చు. కృష్ణా నది పుష్కరాల ప్రత్యేకత ఏమిటంటే, ఈ పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకొకసారి వస్తాయి. పుష్కరం అంటేనే 12 సంవత్సరాలు. పుష్కరాలని 'పుష్కరాలు లేదా పుష్కర లేదా పుష్కరం' అని కూడా పిలుస్తుంటారు. కృష్ణమ్మ సతారా జిల్లా లోని జోర్ గ్రామం, మహాబలేశ్వర్ వద్ద పుట్టి మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా ప్రవహించి కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.

కృష్ణా నది జీవ నది, దేశంలో 4 వ పెద్ద నది మరియు సుమారు 1300 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. సాధారణంగా కృష్ణా పుష్కరాలు బృహస్పతి కన్యా రాశి లోకి ప్రవేశిస్తున్నప్పుడు జరుగుతాయి. కృష్ణా నది పరివాహ ప్రాంతాలలో పెద్ద నగరం విజయవాడ. కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై కనక దుర్గమ్మ కొలువై ఉంటుంది.

ఇది కూడా చదవండి : కృష్ణా నది ఒడ్డున ఉన్న పవిత్ర క్షేత్రాలు !

12 సంవత్సరాలకొకసారి నిర్వహించే కృష్ణా పుష్కరాలకు దేశ, విదేశాల నుండి భక్తులు మరియు యాత్రికులు భారీగానే తరలివస్తుంటారు. ప్రస్తుతం 4-5 కోట్ల మంది హాజరవ్వొచ్చని అధికారుల అంచనా. పుష్కరాల సమయంలో పవిత్రమైన కృష్ణమ్మ నదిలో మునిగి తేలితే భౌతిక , మానసిక రుగ్మతలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. కృష్ణా పుష్కరాల మిగితా విషయాలను ఒకసారి గమనిస్తే ..!

ఎప్పుడు ?

ఎప్పుడు ?

కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుండి ఆగస్టు 23 వరకు 12 రోజులపాటు నిర్వహిస్తారు. ఏపి, తెలంగాణ తో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా కృష్ణా పుష్కరాల సందడి ఉండబోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కృష్ణా, నల్గొండ, కర్నూలు, ప్రకాశం, ఖమ్మం మరియు మహబూబ్ నగర్ జిల్లలో ఈ సందడి కనిపించబోతుంది.

చిత్ర కృప : Bhaskaranaidu

ఎప్పుడు ?

ఎప్పుడు ?

పైన పేర్కొన్న వాటిలో కృష్ణా జిల్లాలోని విజయవాడలో సందడి పెద్ద ఎత్తున ఉండబోతున్నది. ఎందుకంటే ఈ నగరం చక్కటి రవాణా సౌకర్యాలతో పాటుగా కృష్ణా నది పరవాహ ప్రాంతంలో అతి పెద్ద నగరంగా విరాజిల్లుతున్నది కాబట్టి. పుష్కరాలప్పుడు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్ లను కూడా నడిపిస్తుంది. (ట్రైన్ లిస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కృష్ణా నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాలు

కృష్ణా నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాలు

కింద పేర్కొన్న ప్రముఖ ఆలయాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి

01) మల్లికార్జున ఆలయం - శ్రీశైలం
02) అమరేశ్వర స్వామి ఆలయం - అమరావతి
03) దుర్గ మల్లేశ్వర్ ఆలయం - విజయవాడ
04) మెట్టపల్లి నరసింహ స్వామి ఆలయం - మెట్టపల్లి(నల్గొండ జిల్లా)
05) శివ మరియు నరసింహ స్వామి ఆలయం - వడపల్లి
06) సంగమేశ్వర ఆలయం - అలంపూర్

వేదాద్రి, మోపిదేవి, హంసలదీవి, సీతానగరం(గుంటూరు జిల్లా) లలో కూడా భక్తులు అధికంగానే తరలివస్తుంటారు

కృష్ణా నది - ఆలయాలు

కృష్ణా నది - ఆలయాలు

తెలంగాణ రాష్ట్రంలో ...

కృష్ణా నది తెలంగాణ లో నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ రెండు జిల్లాలలోనే కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణ పుష్కర ఘాట్ వివరాలకొస్తే ..

మహబూబ్ నగర్ జిల్లాలో : జూరాల, బీచ్ పల్లి, రంగాపూర్, అలంపూర్, నంది అగ్రహారం, చింతరేవుల, నందిమల (నారాయణ్ పేట్), కృష్ణ, పసుపుల మరియు పంచదేవ్ పాడు (ముక్తల్), చెల్లెపాడ్ (వీపనగండ్ల), జట్ప్రోలె (వీపనగండ్ల), సోమశిల (కొల్లాపూర్), మల్లేశ్వరం, మంచాలకట్ట మరియు లింగాల.

చిత్ర కృప : రహ్మానుద్దీన్

కృష్ణా నది - ఆలయాలు

కృష్ణా నది - ఆలయాలు

నల్గొండ జిల్లలో : నాగార్జున సాగర్, వడపల్లి (దామరచర్ల మండలం) మెట్టపల్లి మరియు సమీపాన ఉన్న 5 ఆలయాలు(మల్లె చెరువు మండలం), ఉట్లపల్లి (పెద్ద వుర మండలం), అడవిదేవులపల్లి(దామరచర్ల), మహంకాళిగూడెం(నేరేడుచర్ల).

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ నది కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ పుష్కర ఘాట్ వివరాలకొస్తే

కర్నూలు జిల్లాలో : సంగమేశ్వరం, శ్రీశైలం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ..

గుంటూరు జిల్లాలో : అమరావతి , హరిశ్చంద్ర పురం(తూళ్లూరు మండలం), తాళ్లయ్యపాలెం (తూళ్లూరు మండలం) , సీతానగరం (తాడేపల్లి మండలం) , రెంటిచింతల, పెనుముడి (రేపల్లె మండలం), చిలుమూరు(కొల్లూరు మండలం).

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ..

కృష్ణ జిల్లాలో : జగ్గయ్యపేట, ఇబ్రహీం పట్నం, విజయవాడ, ఘంటసాల, పామిడిముక్కల, మచిలీపట్నం, చందర్లపాడు, కంచికచెర్ల, పెనమలూరు, తోట్లవల్లూరు, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు.

చిత్ర కృప : Nagasrinivasarao

సదుపాయాలు

సదుపాయాలు

పుష్కర్ నగర్ వసతికి, విశ్రాంతికి, భోజనాలకు అనువైన ప్రదేశం. ప్రతి ఘాట్ కు సమీపంలో పుష్కర్ నగర్ లు ఉంటాయి. రాత్రి పూట భక్తులు ఇక్కడ స్టే చేయవచ్చు.

పుష్కర్ నగర్ సదుపాయాలు

--> పుష్కరాలు అయ్యేంతవరకు మూడుపూటల భక్తులకు ఉచితంగా శాఖాహార భోజనం వడ్డిస్తారు

--> టీ మరియు స్నాక్ కూడా అందజేస్తారు.

--> పుష్కర్ నగర్ నుండి ఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు

--> చక్కటి రోడ్డు వ్యవస్థ, రిసెప్షన్, పార్కింగ్, వాష్ రూంలు, బట్టలు మార్చుకొనే గదులు, వసతి, ఉచిత త్రాగునీరు, ఫుడ్ స్టాల్స్, లైటింగ్ సదుపాయం, మెడికల్ క్యాంపు, ఘాట్ సమాచార కేంద్రం మొదలైనవి పుష్కర్ నగర్ సదుపాయాలుగా ఉన్నాయి.

భక్తులు చేయవలసినవి/ చేయకూడనివి

భక్తులు చేయవలసినవి/ చేయకూడనివి

చేయవలసినవి1) భక్తులు పుష్కరాలకు కేటాయించిన ఘాట్ లలోనే స్నానాలు ఆచరించండి.

2) అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పుష్కర అధికారులకు తెలియజేయండి.

3)సిటీ లోకి ప్రవేశిస్తున్నప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించండి.

4) చెత్త చెదారాలుంటే అక్కడే ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లో పడవేయండి.

భక్తులు చేయవలసినవి/ చేయకూడనివి

భక్తులు చేయవలసినవి/ చేయకూడనివి

చేయకూడనివి1) ప్లాస్టిక్ బ్యాగ్ లను బహిరంగ ప్రదేశాలలో వాడకండి పూర్తిగా నిషేధం.

2) ఘాట్ ల వద్ద, నది వద్ద బట్టలు ఉతకకండి.

3) పడవల్లో అధిక సంఖ్యలో యాత్రికులు ప్రయాణించడం నిషేధం.

4) బిచ్చగాళ్ళను భక్తులు, యాత్రికులు దయచేసి ప్రోత్సహించకండి.

5) భక్తులు స్నానాలు చేసేటప్పుడు సబ్బులను ఉపయోగించకండి.

6) మొక్కుబడి ఆచారాలు మరియు ఆరాధనల వస్తువులను నదిలో పాడవేయకండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+