Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని అత్యంత పొడవైన రైలు మార్గాల గుండా ప్ర‌యాణిద్దామా..!

దేశంలోని అత్యంత పొడవైన రైలు మార్గాల గుండా ప్ర‌యాణిద్దామా..!

భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ చాలా పెద్దది. ఇది దేశమంతా వ్యాపించి ఉంటుంది. ఈ రైలు మార్గాలు, నగరాలు, పట్టణాలు గ్రామాలను కలుపుతూ, ప్రజలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా చేర్చేందుకు ఉపయోగ‌ప‌డ‌తాయి. అయితే రైలు నెట్‌వర్క్ ఎంతో పొడవైన మార్కాన్ని విస్తరించి ఉంది. ఇక్క‌డ ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉండే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అందమైన అనుభూతుల‌ను అందిస్తుంది.

ఈ రైలు ప్ర‌యాణం కేవ‌లం సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా చౌకగా కూడా ఉంటుంది. దేశంలో అనేక సుదూర రైళ్లు క‌లిగి ఉన్నాయి. ఈ రైల్వే కనెక్షన్లు ప్రజలు ప్రయాణించడానికి, కొత్త నగరాలను వీక్షించేందుకు అలాగే, భారతదేశ వైవిధ్యాన్ని అనుభవించేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి మ‌నం నేడు భారతదేశంలోని అతి పొడవైన రైల్వే మార్గాల గురించి తెలుసుకుందాం ప‌దండి.

వివేక్ ఎక్స్‌ప్రెస్

ఈ ప్రత్యేకమైన వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ర్యాట‌కుల‌ను భారతదేశం మొత్తం తిప్పేస్తుంది. ఇది అస్సాంలోని దిబ్రూఘర్ నుండి నేరుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్ర‌యాణిస్తుంది. ఇది భారతదేశంలోని అతి పొడవైన మార్గం. ఇది సుమారు 74 గంటల 35 నిమిషాలలో 4218.6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది, ఈ రైలు ప్రయాణికులకు వివిధ అందమైన ప్రదేశాలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిజానికి నాలుగు జతల ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమూహం. ఇది స్వామి వివేకానంద 150వ జయంతి జ్ఞాపకార్థం 2011-12 రైల్వే బడ్జెట్‌లో ప్రారంభించబడింది.

aronaisuperfastexpress1

అరోనై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

అరోనై సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్రివేండ్రం సెంట్రల్ నుండి మొదలై సిల్చార్ వరకు ప్ర‌యాణిస్తుంది. ఇది మొత్తం 3932 కిలోమీటర్లు ప్ర‌యాణిస్తోంది. ఇది సుమారు 74 గంటల 44 నిమిషాలు ప్రయాణం చేస్తోంది. ఇది కొంచెం సుదీర్ఘ ప్రయాణమ‌నే చెప్పుకోవాలి. కానీ ఇందులో ప్ర‌యాణించే వారు మాత్రం మొత్తం 8 రాష్ట్రాల‌ను సంద‌ర్శించేయచ్చు. ఈ ట్రైన్ గ‌తంలో త్రివేండ్రం సెంట్రల్ నుండి గౌహతి వరకు నడిచేది. కానీ ఆ త‌ర్వాత దీనిని సిల్చార్ వరకు పొడిగించారు. ప్రస్తుతం, ఇది భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం నడిచే సూపర్‌ఫాస్ట్ రైలు, రెండవ పొడవైన రైలుగా ప్ర‌సిద్ధిచెందింది.

himasagarexpres1

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఒక్క‌సారి మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ కన్యాకుమారి నుండి నేరుగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు ప్ర‌యాణిస్తోంది. ఇది చాలా దూరపు ప్ర‌యాణ‌మ‌నే చెప్పుకోవాలి. ఇది మొత్తం దేశంలో 36వ స్థానంలో, మూడవ స్థానంలో ఉంది. ఇది మొత్తం 72 గంటలు ప్ర‌యాణిస్తుంది. 3787 కిలోమీటర్లు ప్ర‌యాణించడ‌మే కాకుండా 12 రాష్ట్రాలను దాటుకుంటూ వెళుతుంది.

తిరునెల్వేలి జంక్షన్

తిరునెల్వేలి జంక్ష‌న్‌లోని జమ్మూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వారానికి ఒక‌సారి మాత్ర‌మే ప్ర‌యాణిస్తుంది. 16787/16788 అనే నెంబ‌ర్‌గ‌ల ఈ ట్రైన్ జమ్మూ, కాశ్మీర్‌లోని కత్రాలో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయాన్ని తమిళనాడులోని తిరునెల్వేలి జంక్షన్ నుండి కలుపుతూ వారానికి ఒకసారి ప్ర‌యాణిస్తోంది. ఈ సుదూర రైలు మార్గం దాదాపు 69 గంటల్లో 3633 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. ఇది ప్రపంచంలో 40వ పొడవైన రైలు మార్గం. భారతీయ రైల్వేలలో నాల్గవ పొడవైన రైలు మార్గం. ఈ రైలు 13 రాష్ట్రాల గుండా వెళుతుంది. అంతేకాదు, 64 స్టాప్‌లలో ఆగుతుంది.

bangaloreweeklyexpress

బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్

అందమైన నగరంగా పేరుగాంచిన‌ టిన్సుకియా నుండి దక్షిణ భారతదేశంలోని IT హబ్ బెంగళూరుకు ప్రయాణించాలని చేస్తుంటే, 22501/02 అనే నెంబ‌ర్‌గ‌ల వీక్లీ ట్రైన్లో ప్ర‌యాణం చేయండి. ఈ రైలు అస్సాంలోని తూర్పు నగరమైన టిన్సుకియా నుండి దక్షిణ భారతదేశంలోని రద్దీగా ఉండే బెంగళూరుకు కలుపుతుంది. ఈ రైలులో AC ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ వంటి అనేక రకాల కోచ్‌ల సౌకర్యం ఉంది. 2023 సంవత్సరం వరకు ఉన్న డేటా ప్రకారం ఇది భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో నడుస్తున్న ఐదవ అతి పొడవైన రైలు మార్గం. ఇది మొత్తం 3,542 కిలోమీటర్ల దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+