Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం:సుమారు వెయ్యియేళ్ళ నాటిది

భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం:సుమారు వెయ్యియేళ్ళ నాటిది

ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి

ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మత పరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. చాలా వరకు పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమయ్యాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ సజీవంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడినాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం

ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం .ఇది కైమూర్ జిల్లాలోని బీహార్ రాష్ట్రంలో వుంది. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది.

ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా

ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా

ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చును. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం.

ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే

ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే

ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. దీనిని 100ఏడి లో నిర్మించారు. అంతకంటే ముందు దీనిని 105ఏడి లో నిర్మించివుంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది.

ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది.

ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది.

ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది. ఈ ఆలయంలో అమ్మవారు 10చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు.రెండు రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగివుంటాయి.

ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు

ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు

ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి.ఆ కాలంనుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావటం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజాకార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి.

 చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ

చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ

ఈ ఆలయాన్ని సందర్శించటానికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తూవుంటారు. చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. పురావస్తుశాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల 9 విగ్రహాలను కొలకత్తా సంగ్రహాలయానికి తరలించారు. వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. ఇక్కడ అమ్మవారిని శక్తిరూపంలో అంతే కాకుండా ఈ ఆలయాన్ని తాంత్రికపూజలకు ప్రతీకగా భావిస్తారు.

సాత్విక బలి

సాత్విక బలి

ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అటు పై పూజారి మంత్రించిన అక్షింతలను మేక పై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు స`హతప్పి పడిపోతుంది. అటు పై మరోసారి పూజారి అక్షింతలను మేక పై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
P.C: You Tube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+