Search
  • Follow NativePlanet
Share
» »నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.. నాగేశ్వర స్వామి క్షేత్రం దర్శిస్తే

నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.. నాగేశ్వర స్వామి క్షేత్రం దర్శిస్తే

నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.. నాగేశ్వర స్వామి క్షేత్రం దర్శిస్తే

తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. తమిళనాడులోని కుంభకోణాన్ని ఆలయాల పుట్ట అని అంటారు. ఈ ప్రాంతం సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రాంతం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాల్లో మరో పవిత్రమైన ఆలయం నాగేశ్వరస్వామి దేవాలయం. పన్నెండో శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించిన దేవాలయం ఇది. చోళ శిల్పకల ఉట్టి పడుతుందిక్కడ. ఆది శేషుడు, సూర్యుడు అర్చించిన స్వామి నాగేశ్వర స్వామి. ఒకప్పుడు ఆదిశేషుడు భూబారం మోయ లేక ఇక్కడికొచ్చి శ్రీ నాగేశ్వర స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాడట. శివ పార్వతులు ప్రత్యక్షమై ఆయనకు భూభారాన్ని అలసట లేకుండా మోసే శక్తి సామర్ధ్యాలను వరప్రసాదంగా ఇచ్చారట. చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో మూడు రోజులు సూర్యభగవానుని కిరణాలు నాగేశ్వర మహా లింగం పై పడి భక్తులకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..

ఈ నాగేశ్వారస్వామి వారు కుంభకోణంలోని స్థానికులు నాగేశ్వరార్ కోవెల అంటారు

ఈ నాగేశ్వారస్వామి వారు కుంభకోణంలోని స్థానికులు నాగేశ్వరార్ కోవెల అంటారు

ఈ నాగేశ్వారస్వామి వారు కుంభకోణంలోని స్థానికులు నాగేశ్వరార్ కోవెల అంటారు. ప్రళయసమయంలో అమృతభాండం ఈ ప్రదేశానికి కొట్టుకువచ్చిందని, అందులో కొట్టుకొచ్చిన పదార్థాలు, వస్తువులన్నీ శివలింగాలు, చెట్టుగా మారాయని అంటారు. ఇక్కడ కలశంలోని బిల్వ పత్రాలు పడి బిల్వ వనం ఏర్పడిందని, అప్పుడు ఆది శేషుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణాద్వారా తెలుస్తున్నది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.

మన పురాణ గాధల ప్రకారం ఆది శేషుడు

మన పురాణ గాధల ప్రకారం ఆది శేషుడు

అదేమిటంటే... మన పురాణ గాధల ప్రకారం ఆది శేషుడు భూభారాన్ని మోస్తూ వుంటాడు కదా. భూమి మీద జనం చేస్తున్న పాపాల వల్ల భూ భారం పెరిగిపోయి ఆది శేషుడికి మొయ్యలేని భారమయింది. భారాన్ని మోయలేక ఆయన కైలాసంలో శివుడికి మొర పెట్టుకున్నాడు. ఈ భరించలేని భారం మోసే శక్తి ఇవ్వమని. శివుడు ఆది శేషుడికి ఒక్క తలతోనే ఆ భారం మోసే శక్తి ఇస్తానని భరోసా ఇస్తాడు. (ఆది శేషుడికి వెయ్యి తలలు).

ఆది శేషుడు శివుని ఆశీస్సులతో కుంభకోణంలోని

ఆది శేషుడు శివుని ఆశీస్సులతో కుంభకోణంలోని

ఆది శేషుడు శివుని ఆశీస్సులతో కుంభకోణంలోని ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ శివలింగం ప్రతిష్టించి పూజించాడు. నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు గనుక ఈ స్వామి పేరు నాగేశ్వర స్వామి (తమిళంలో నాగేశ్వరార్). బిల్వ వనంలో ప్రతిష్టింపబడినాడు కనుక బిల్వవనేశ్వర్.

 గర్భాలయం శివ లింగం చిన్నదే.

గర్భాలయం శివ లింగం చిన్నదే.

గర్భాలయం శివ లింగం చిన్నదే. పెద్ద పీఠం పై వుంటుంది. ఆది శేషు ప్రతిష్టించిన లింగం కనుక రాహు దోష నివారణార్ధం భక్తులు ఇక్కడ సోమ గురు వారాలలో పూజలు చేస్తారు. రాహు దోషం వల్ల వివాహం జరగటం, పిల్లలు పుట్టటం ఆలస్యం అవవచ్చు. ఆలయంలో విష్ణు దుర్గ, సూర్యనారాయణ వగైరా ఇతర దేవతా మూర్తులను కూడా దర్శించవచ్చు.

ఆలయ నిర్మాణం:

ఆలయ నిర్మాణం:

9 వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. సృష్ట్యాదినుంచి వున్న ఈ క్షేత్రం గురించి 7వ శతాబ్దంలో తిరుజ్ఞాన సంబంధార్ రచించిన తేవరమ్ లో చెప్పబడింది. చోళుల కళాభిరుచికి దర్పణంగా వున్న ఈ ఆలయంలో పలు విగ్రహాలు, శిల్పకళలు చాలా అందంగా మలచబడ్డాయి.

వీటిలో దేవతా విగ్రహాలే కాక ఆ కాలంలో రాజులవి, దాతలవి

వీటిలో దేవతా విగ్రహాలే కాక ఆ కాలంలో రాజులవి, దాతలవి

వీటిలో దేవతా విగ్రహాలే కాక ఆ కాలంలో రాజులవి, దాతలవి కూడా వున్నాయి. పూర్వం ఈ ఆలయం చుట్టూ చెట్లు, చేమలు ఇష్టం వచ్చినట్లు పెరిగి ఆలయం శిధిలావస్తలో వున్నది. పడగచెర్రి రామలింగస్వామి అనే శివ భక్తుడు జోలె పట్టి అందరినీ డబ్బులు అడుక్కుని తీసుకువచ్చి ఆ డబ్బుతో కొంచెం కొంచెంగా ఆలయాన్ని అభివృధ్ధి చేసి, కుంభాభిషేకం కూడా చేయించాడు.

ఆలయం లోపలకి ప్రవేశిస్తుంటే ఎడమవైపు తోట,

ఆలయం లోపలకి ప్రవేశిస్తుంటే ఎడమవైపు తోట,

ఆలయం లోపలకి ప్రవేశిస్తుంటే ఎడమవైపు తోట, కుడివైపు అమ్మ పెరియనాయకి ఆలయం, నటరాజు ఆలయం కనిపిస్తాయి. పెరియనాయకి అమ్మ పెరియనాయకి ప్రత్యేక ఆలయంలో, అభయ హస్తంతో భక్తులను దీవిస్తూ వుంటుంది. నటరాజు ఆలయం ఈ నటరాజు ఆలయం చూశారా? గుఱ్ఱాలు, ఏనుగులు లాగుతున్న రధంలాగా లేదూ?

ఇలా రధం ఆకారంలో వున్న ఆలయం ఇంతకు

ఇలా రధం ఆకారంలో వున్న ఆలయం ఇంతకు

ఇలా రధం ఆకారంలో వున్న ఆలయం ఇంతకు ముందు మనం సారంగపాణి ఆలయం చూశాం. ఈ రెండే కాక దారాసురంలో కూడా ఇలాంటి ఆలయం ఇంకొకటి వున్నది. లోపలకెళ్దాం పదండి. ఈ మందిరంలో నటరాజు నాట్యానికి తాళం వేస్తున్న అమ్మ శివకామి, వేణువు వాయిస్తున్న విష్ణుమూర్తిని చూడవచ్చు. ఇక్కడ ఏనుగుల మీద రాజులు కూడా ఉన్నారు చూశారా.

విశేషం

విశేషం

ఇంకో నిర్మాణ నైపుణ్యం ఏమిటో తెలుసా ఇక్కడ? చిత్తిరై మాసంలో మొదటి మూడు రోజులు సూర్య కిరణాలు స్వామిని తాకుతాయి గంగై వినాయగర్ రాజేంద్ర చోళుడు గంగా తీరందాకా తన రాజ్యాన్ని విస్తరించాడని చరిత్ర ఉంది. అలాంటి ఒక యుధ్ధం నుంచి సైన్యం తమ విజయ చిహ్నంగా ఒక వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చారుట. ఆ విగ్రహాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+