Search
  • Follow NativePlanet
Share
» »ఆ బహిస్టు వల్లే కాశీ చౌడేశ్వరీ దేవి మన చెంతకు వచ్చింది రుజువు ఇదిగో

ఆ బహిస్టు వల్లే కాశీ చౌడేశ్వరీ దేవి మన చెంతకు వచ్చింది రుజువు ఇదిగో

నందవరం చౌడేశ్వరీ దేవాలయానికి సంబంధించిన కథనం.

హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలక్ష్మీ వంటి దేవతలు ఎంతో మంది ఉన్నారు. అందులో చౌడేశ్వరీ దేవి కూడా ఒకరు. వీరిని దర్శించుకోవడానికి సుదూర ప్రయాణం చేసేయాల్సి ఉంటుంది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో రవాణా సౌకర్యాలు లేవు. అందువల్ల ప్రజలు చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకొని కాశీని చేరుకొని అక్కడి దేవతలను సందర్శించుకునేవారు. అయితే తాము అంత దూరం ప్రయాణం చేయలేమని కొంతమంది భక్తాగ్రేసరుల కోరిక పై అక్కడి దేవతలు భారత దేశంలోని నలుమూలలా కొలువై ఉన్నారు. ఈ కోవకు చెందినదే చౌడేశ్వరీ దేవి దేవాలయం. ఈ చౌడేశ్వరీ దేవాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఇదిలా ఉండగా ఈ చౌడేశ్వరీ దేవే కర్నాటకలోని టిప్పుటూర్ కు దగ్గర్లో కూడా ఉందని కొంతమంది చెబుతున్నారు. పురాణాలకు సరైన లిఖిత పూర్వక ఆధారాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ కథనంలో కర్నూలు జిల్లా నందవరం ప్రాంతంలో వెలిసిన చౌడేశ్వరీ దేవి గురించి మనం తెలుసుకొందాం.

1. కోరిన చోటుకు తీసుకువెళ్లే పావుకోళ్లు

1. కోరిన చోటుకు తీసుకువెళ్లే పావుకోళ్లు

P.C: You Tube

ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడనే రాజు ప్రజారంజకంగా పాలించేవాడు. ఆయనకు దత్తాత్రేయ భక్తుడు. ఈ క్రమంలో ఒకరోజు దత్తత్రేయుడు ప్రత్యక్షమయ్యి కోరిన చోటుకు తీసుకువెళ్లే పావుకోళ్లు (పాదరక్షలు) నంద భూపాలుడికి అందజేస్తాడు.

2. కాశీకి వెళ్లి

2. కాశీకి వెళ్లి

P.C: You Tube

అంతేకాకుండా రోజూ కాశీకి వెళ్లి అక్కడి గంగలో స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడు. దీని వల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పావుకోళ్ల విషయం ఎవరికీ చెప్పకూడదని షరత్తు విధిస్తాడు.

3. రాజు అంగీకరిస్తాడు

3. రాజు అంగీకరిస్తాడు

P.C: You Tube

ఇందుకు అంగీకరించిన రాజు ఆ పావుకోళ్లను తీసుకొంటాడు. దత్తత్రేయుడు చెప్పినట్లు ప్రతి రోజు బ్రహ్మముహుర్తంలోనే కాశీకి వెళ్లి అక్కడి గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని కాశీ విశాలక్షిని సందర్శించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు.

4. భార్యకు అనుమానం వస్తుంది

4. భార్యకు అనుమానం వస్తుంది

P.C: You Tube

ఇదిలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతి రోజు తన భర్త రోజూ తెల్లవారుజామున ఎక్కడికో వెలుతున్నాడని అనుమానం వస్తుంది. ఒక రోజు ఇదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ పెట్టుకొంటుంది.

5. నెలసరి వస్తుంది

5. నెలసరి వస్తుంది

P.C: You Tube

దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతోపాటు కాశీకి తీసుకొని వెలుతాడు. అక్కడ స్నానాలు ముగించుకొన్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది.

6.ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి

6.ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి

P.C: You Tube

దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయల్సిందిగా అక్కడే ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరుతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు లోనవుతారని బాధపడుతాడు.

7. ఆ బ్రహ్మణులు తమ తప:శక్తిని

7. ఆ బ్రహ్మణులు తమ తప:శక్తిని

P.C: You Tube

అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని వేడుకొంటారు. దీంతో ఆ బ్రహ్మణులు తమ తప:శక్తిని రాజుకు, ఆయన భార్యకు అందజేస్తారు.

8. తప్పక సాయం అందిస్తానని

8. తప్పక సాయం అందిస్తానని

P.C: You Tube

ఇందుకు సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి భార్యా సమేతుడై నందవరానికి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది.

9. రాజును అర్థిస్తాడు

9. రాజును అర్థిస్తాడు

P.C: You Tube

దీంతో బ్రహ్మణులు తమకు సహాయం చేయాల్సిందిగా నందవరంకు వచ్చి రాజును అర్థిస్తాడు. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలోని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్నదానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నిస్తారు.

10. చౌడేశ్వరీ దేవి సాక్షం

10. చౌడేశ్వరీ దేవి సాక్షం

P.C: You Tube

కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి చౌడేశ్వరీ దేవి సాక్షమని ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు చెబుతారు.

11. సవాలు విసురుతాడు

11. సవాలు విసురుతాడు

P.C: You Tube

దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీ దేవిని ఇక్కడకు రప్పించి సాక్షం చెప్పల్పిందిగా సవాలు విసురుతాడు. దీంతో బ్రహ్మణులు తిరిగి కాశీకి వెళ్లి అక్కడ చౌడేశ్వరీ అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరుతారు.

12. చౌడేశ్వరీ దేవి అంగీకరిస్తుంది

12. చౌడేశ్వరీ దేవి అంగీకరిస్తుంది

P.C: You Tube

ఇందుకు చౌడేశ్వరీ దేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరత్తు విధిస్తుంది. మీరు తోవ చూపిస్తూ ఉంటే నేను మీ వెనుక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరు వెను తిరిగి చూసినా తాను వెనక్కు వెళ్లిపోతానని చెబుతుంది.

13. ఒక సొరంగం గుండా బయలు దేరుతారు

13. ఒక సొరంగం గుండా బయలు దేరుతారు

P.C: You Tube

దీనికి అంగీకరించిన బ్రహ్మణులు చౌడేశ్వరీ అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక సొరంగం గుండా బయలు దేరుతారు. నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రహ్మణుడు వెనక్కు తిరిగి చౌడేశ్వరీ దేవి వస్తోందో? లేదో? అని చూస్తాడు.

14. అక్కడే శిలరూపంలో

14. అక్కడే శిలరూపంలో

P.C: You Tube

దీంతో చౌడేశ్వరీ దేవి అక్కడే శిలరూపంలో ఉండిపోతుంది. విషయం తెలుసుకొన్న రాజు అక్కడికి వచ్చి బ్రహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యం వారికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతారు.

15. నందవరీకులని

15. నందవరీకులని

P.C: You Tube

ఇక మీరు కూడా తన రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాధికార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు. ఇందుకు బ్రహ్మణులు అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రహ్మణులను నందవరీకులని పిలుస్తారే. వీరు ఇప్పటికీ తమ కులదైవతగా చౌడేశ్వరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.

16. ఆ సొరంగం ఇప్పటికీ

16. ఆ సొరంగం ఇప్పటికీ

P.C: You Tube

అమ్మవారు వచ్చిన సొరంగం ఇప్పటికీ ఉంది. అయితే అందులోకి ఎవరినీ అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేది. దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు.

17. మరో విగ్రహం

17. మరో విగ్రహం

P.C: You Tube

దీంతో రాజు అమ్మవారు శిలా రూపం దాల్చిన చోటు పై భాగంలో అంటే భూమి పైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించాడు. ఇక అమ్మవారి విగ్రంఒక చేతిలో ఖడ్గం, మరోచేతిలో కుంకుమ భరిణే ఉంటుంది.

18. చెట్టు కూడా కాశీ నుంచి

18. చెట్టు కూడా కాశీ నుంచి

P.C: You Tube

అమ్మవారి గర్భగుడికి బయట ఒక చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు.

19.అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా

19.అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా

P.C: You Tube

ఇక ఈ చౌడేశ్వరీ అమ్మవారిని సందర్శించుకొంటే సఖల శుభాలు జరుగుతాయని, భయాందోళనలు సమిసిపోతాయని భక్తులు చెబుతుంటారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

P.C: You Tube

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చౌడేశ్వరీ దేవాలయం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి నిత్యం ప్రభుత్వ బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు కూడా ఇక్కడకు వెలుతుంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+