Search
  • Follow NativePlanet
Share
» »ఈ ‘పుట్ట’సందర్శనతో మీ కడుపున ‘కాయ’ కాస్తుంది

ఈ ‘పుట్ట’సందర్శనతో మీ కడుపున ‘కాయ’ కాస్తుంది

ఆదికుంభేశ్వర్ దేవాలయం గురించి కథనం.

By Kishore

తమిళనాడులోని కుంభకోణాన్ని ఆలయాల పుట్ట అని అంటారు. ఈ ప్రాంతం సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రాంతం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ ప్రతి అడుగుకు ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందులో కుంభేశ్వరాలయం చాలా ప్రాముఖ్యం కలిగినది. దీనినే ఆదికుంభేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న పరమశివుడు. మిగిలిన శివలింగాలతో పోలిస్తే ఇక్కడ శిలింగం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక కలశం ఆకారంలో పక్కాగా చెప్పాలంటే కూజా ఆకారంలో ఉంటుంది. ఈ శివలింగం ఉన్న ఆలయం ప్రాగణంలోనే పార్వతి దేవి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని మంగళనాయకి అని అంటారు. అమ్మవారిని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆలయానికి సంబంధించిన విషాలు మీ కోసం

1. కేవలం కల్పాంతంలో

1. కేవలం కల్పాంతంలో

P.C: YouTube

ప్రళయం, మహాప్రళయాల్లో ప్రక`తి విపరీతాలు, యుద్ధాలు జరిగి విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుంది. అయితే సృష్టి కార్యం మాత్రం నశించదు. కేవలం కల్పాంతంలో మాత్రమేసృష్టి మొత్తం జలమయం అవుతుంది.

2. ఈ సృష్టి కార్యానికి శ్రీకారం

2. ఈ సృష్టి కార్యానికి శ్రీకారం

P.C: YouTube

అటు పై పరమశివుడు బ్రహ్మదేవుడికి చెప్పి ఈ సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టుతాడు. అలా శ్రీ కారం చుట్టిన ప్రదేశమే కుంభ కోణం. కుంభకోణం ఆలయాల పుట్ణ. ఇక ఇక్కడ ప్రతి అడుగుకు ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది.

3. ఇన్ని ఆలయాలు మరెక్కడా ఉండవు

3. ఇన్ని ఆలయాలు మరెక్కడా ఉండవు

P.C: YouTube

ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కాడ ఉండవని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కుంభేశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ సృష్టి కార్యానికి శ్రీకారం ఇక్కడ దేవుడు వెలిశాడని చెబుతారు.

4. బ్రహ్మదేవుడు భయపడుతాడు

4. బ్రహ్మదేవుడు భయపడుతాడు

P.C: YouTube

స్థల పురాణం ప్రకారం పూర్వం మహాప్రళయం రాబోతున్న సంగతి తెలుసుకొన్న బ్రహ్మదేవుడు భయపడుతాడు. ప్రళయంలో సృష్టి బీజం కూడా నశిస్తే తర్వాత ఈ విశ్వంలో జీవి ఉనికి ఉండదని శివుడితో చెప్పి ఆందోళన చెందుతాడు.

5. ఇసుకతో ఒక కుండను

5. ఇసుకతో ఒక కుండను

P.C: YouTube

ఇందుకు శివుడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమ`తం పోయమని చెప్పాడు. అటు పై సృష్టి బీజాలను ఉంచాలని సూచించారు. అటు పై మామిడి ఆకులు, కొబ్బరి కాయను వినియోగించి ఆ కుండను కలశం గా మార్చమని చెప్పాడు.

6. విశ్వం నీట మునిగి పోయింది

6. విశ్వం నీట మునిగి పోయింది

P.C: YouTube

అటు పై దానిని బిల్వ పత్రాలతో పూజించాల్సిందిగా సూచించాడు. బ్రహ్మ శివుడు చెప్పినట్లే చేశాడు. ఇక ప్రళయం వచ్చినప్పుడు ఈ విశ్వం మొత్తం నీట మునిగి పోయింది. ఆ సమయంలో ఈ కలశం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది.

7. దక్షిణదిశగా ప్రయాణించి

7. దక్షిణదిశగా ప్రయాణించి

P.C: YouTube

అంతేకాకుండా దక్షిణదిశగా ప్రయాణించింది. కలశం కుంభకోణం వద్దకు రాగానే అందులో ఉన్న మామిడి ఆకలు, దర్భులు కిందికి పడ్డాయి. అవి పడిన చోటున మామిడి చెట్టు, శివలింగం వెలిసాయి.

 8. తిరువిడై మరుదార్ కి పడమర దిక్కున

8. తిరువిడై మరుదార్ కి పడమర దిక్కున

P.C: YouTube

అటు పై కలశం ఇంకొచ్చెం ముందుకు వెళ్లి ప్రస్తుతం తిరువిడై మరుదార్ కి పడమర దిక్కున ఆగిపోయింది. విషయం తెలుసుకున్న శివుడు భూమి పైకి వచ్చి ఒక బాణంతో ఆ కలశాన్ని గురిచూసి కొట్టాడు.

9. శివుడు బానం ప్రయోగించిన ప్రాంతం బానాపురం

9. శివుడు బానం ప్రయోగించిన ప్రాంతం బానాపురం

P.C: YouTube

అలా శివుడు బానం ప్రయోగించిన ప్రాంతం బానాపురం అనే పేరుతో ప్రసిద్ధి కెక్కింది. ఇక్కడ ఇప్పటికీ శివాలయం ఉంది. బానం తగిలి కలశం ముక్కలై పోయింది. అందులో ఉన్న అమ`తం ఇసుకతో కలిసి ఒక లింగం ఆకారంలో అక్కడ ఆవిర్భవించింది.

10. మొదట కూడమూకు

10. మొదట కూడమూకు

P.C: YouTube

ఆ ప్రాంతాన్ని మొదట కూడమూకు అనేవారు. అదే కాలక్రమంలో కుంభకోణం అయ్యింది. కుంభం నుంచి అమ`తం పడ్డ చోట శివుడు వెలసినాడు కాబట్టి ఆయన్ను కుంభేశ్వరుడు అని అన్నారు.

11.అందువల్లే ఆది కుంభేశ్వర లింగం

11.అందువల్లే ఆది కుంభేశ్వర లింగం

P.C: YouTube

ఇక బ్రహ్మస`ష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందే ఈ శివలింగం ఏర్పడటం వల్ల దీనిని ఆది కుంభేశ్వర లింగం అని కూడా పిలుస్తారు. ఇక శివుడు తపస్సు చేసి ఆ శక్తిని ఈ శివలింగంలో ప్రవేశపెట్టారని చెబుతారు. అందువల్లే ఈ శివలింగం అత్యంత పవిత్రమైనదని చెబుతారు.

12.కైలాసం నుంచి పార్వతి దేవి

12.కైలాసం నుంచి పార్వతి దేవి

P.C: YouTube

ఇక శివుడు ఇక్కడ వెలిశాడని తెలుసుకొన్న పార్వతి కైలాసం నుంచి కుంభకోణంకు వచ్చింది. పార్వతీ దేవిని చూసిన శివుడు సంతోషంతో అమ్మవారిని తన ఎడమ వైపున కుర్చొమన్నాడు.

13. అమ్మవారిని మంగళనాయకి అని అంటారు

13. అమ్మవారిని మంగళనాయకి అని అంటారు

P.C: YouTube

ఆ ఆదేశంతో పార్వతీ దేవి శివుడి పక్కనే వెలిసింది. ఇక్కడి అమ్మవారిని మంగళనాయకి అని అంటారు. అమ్మవారిని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా పెళ్లికాని వారికి వెంటనే వివాహం అవుతుందని, సంతానం లేనివారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని భక్తుల నమ్మకం.

14. 4 ఎకరాల స్థలంలో

14. 4 ఎకరాల స్థలంలో

P.C: YouTube

కుంభకోణం మధ్యలో 4 ఎకరాల స్థలంలో కుంభేశ్వర్ ఆలయం ఉంది. మొత్తం 3 ప్రాకారాలు ఉంటాయి. నాలుగు గోపురాల్లో ఎతైనది తూర్పు గోపురం. 11 అంతస్తులతో 128 అడుగుల ఎత్తు ఉంటుంది.

15.చోళరాజులు

15.చోళరాజులు

P.C: YouTube

ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. అటు పై 15 శతాబ్దంలో తంజావూరు నాయకులు ఈ ఆలయాన్ని విస్తరింపజేశారు. ఆలయంలో పెద్దవైన ఐదు రథాలు ఉన్నాయి. వీటికి వెండి రేకులు తాపడం చేశారు. ఉత్సవాల సమయంలో వీటిని వినియోగిస్తారు.

16. కుంభకోణంలో చూడదగిన మరికొన్ని ఆలయాలు

16. కుంభకోణంలో చూడదగిన మరికొన్ని ఆలయాలు

P.C: YouTube

ఆదికుంభేశ్వర ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం, రామస్వామి ఆలయం, సారంగపాణి ఆలయం, నాగేశ్వర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, అభిముఖేశ్వర ఆలయం. ఇవన్నీ ఒకదానికొకటి అర కిలోమీటరు దూరంలో మాత్రమే ఉంటాయి. కుంభకోణంలో ఇత్తడి సామానులు ముఖ్యంగా పూజా సామాగ్రి నాణ్యతతో ఉండి కొంత ఖరీదు తక్కువకు దొరుకుతుంది. ఇక్కడ లుంగీలు కూడా తక్కువ ధరకు దొరుకుతాయి.

More News

    Read more about: tour travel temple shiva tamilnadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+